ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్

జగన్ తో ఒపెన్ ఫైట్ మొదలు పెట్టిన కేసిఆర్..మోడి దిగినా ఆగేదిలేదంటున్నాడు..

Share

ఏపి Andhra Pradesh ముఖ్యమంత్రి cm వైఎస్ జగన్ మోహనరెడ్డి ys jaganmohan reddy, తెలంగాణ telangana ముఖ్యమంత్రి cm కెసిఆర్ kcr మద్య సార్వత్రిక ఎన్నికలకు ముందు నుండి ఇటీవల కాలం వరకూ సంబంధాలు బాగానే ఉన్నాయి. ఏపిలో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ ycp అధికారంలోకి రావడానికి తన వంతు కెసిఆర్ సహాయ సహకారాలు అందించారని పేరుంది. జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకారానికి కెసిఆర్ వచ్చారు. ప్రగతి భవన్ లో జగన్ విందుకు వెళ్లారు. అక్కడి కాళేశ్వరం kaleswaram ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి జగన్ వెళ్లి వచ్చారు. ఇద్దరిది గురు శిష్యుల బంధం అని అందరూ అనుకున్నారు.

జగన్ తో ఒపెన్ ఫైట్ మొదలు పెట్టిన కేసిఆర్..మోడి దిగినా ఆగేదిలేదంటున్నాడు..
jagan vs kcr krisha bord issue

ప్రాజెక్టులపై పరస్పర ఫిర్యాదులు

ఇద్దరి మధ్య స్నేహసంబంధాల నేపథ్యంలో హైదరాబాదు Hyderabad లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న పలు భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి జగన్ అప్పగించేశారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సఖ్యతగా ఉంటే సాగునీటి సమస్యలతో పాటు ఇతర విభజన చట్టంలోని సమస్యలు త్వరితగతిన పరిష్కారం అవుతాయని అందరూ భావించారు. కానీ ఇద్దరి మద్య ఎక్కడ తేడా వచ్చిందో ఏమో కానీ కరోనా corona లాక్ డౌన్ కు ముందు నుండి పేచీలు మొదలు అయ్యాయి. రాయలసీమ rayalaseema ఎత్తిపోతల పథకానికి జగన్ నిధులు మంజూరు చేసినప్పటి నుండి వివాదం తారాస్థాయికి చేరింది. ఏపిలోని ప్రాజెక్టులపై కెసిఆర్ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేయడం, అక్కడి ప్రాజెక్టులపై ఏపి ప్రభుత్వం ఫిర్యాదు చేసుకోవడం వరకూ వెళ్లాయి.

విశాఖలో కృష్ణా బోర్డులో ఏపి నిర్ణయం

ఇప్పుడు తాజాగా జగన్మోహనరెడ్డి తీసుకున్న మరో నిర్ణయాన్ని కెసిఆర్ ప్రభుత్వం అడ్డుకుంటోంది. కృష్ణానదీ నీటి యాజమాన్య బోర్డును విశాఖలో ఏర్పాటు చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. త్వరలో (కోర్టు వివాదాలు పరిష్కారం కాగానే) పరిపాలనా రాజధాని విశాఖకు తరలిస్తున్నందున కృష్ణానదీ నీటి యాజమాన్య బోర్డును కూడా విశాఖలోనే ఏర్పాటు చేయాలని ఏపి ప్రభుత్వం నిర్ణయానికి వచ్చేసింది. అయితే ఈ నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం తప్పుబడుతోంది. విశాఖలో కార్యాలయం ఏర్పాటు పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేఆర్ఎంబీ చైర్మన్ కు తెలంగాణ ఇరిగేషన్ ఎస్‌సి మురళీధర్ లేఖ రాశారు. బోర్డును ఏపి ప్రభుత్వం విజయవాడలో ఏర్పాటు చేస్తామంటే తాము గతంలో ఒపుకున్నామనీ, ఇప్పుడు కృష్ణానదికి సంబంధం లేని ప్రాంతంలో బోర్డు ఏర్పాటు చేయడం ఏమిటని తెలంగాణ ప్రభుత్వం అంటోంది. అపెక్స్ కమిటీలో చర్చించకుండా ఏకపక్షంగా ఇప్పుడు విశాఖలో బోర్డు ఏర్పాటు చేస్తామనడం తగదని పేర్కొంటోంది.

జగన్ నిర్ణయానికి మోకాలడ్డుతున్న కెసిఆర్ సర్కార్

ఇప్పటి వరకూ జగన్మోహనరెడ్డి తీసుకుంటున్న పలు నిర్ణయాలకు కోర్టుల నుండి బ్రేక్ లు పడుతూ రాగా ఇప్పుడు కృష్ణాబోర్డు విషయంలో కెసిఆర్ నుండి బ్రేక్ పడుతోంది. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఆ విషయంలో కెసిఆర్ వెనక్కు తగ్గరు. అదే మనస్థత్వం ఏపి సీఎం జగన్‌లోనూ ఉంది. విశాఖలో కృష్ణా బోర్డు ఏర్పాటునకు కేసిఆర్ పూర్తిగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో జగన్ తన నిర్ణయాన్ని అమలు చేయడానికి ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళతారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. ఇరు రాష్ట్ర ప్రభుత్వాల ఈ పంచాయతీ కూడా కేంద్రం వద్దకు తీసుకువెళతాయా లేక చర్చల ద్వారా పరిష్కరించుకుంటాయా అనేది వేచి చూడాలి.


Share

Related posts

ఐపీఎల్ షెడ్యూల్‌ను విడుద‌ల చేయండి ప్లీజ్‌.. బీసీసీఐపై ఫ్రాంచైజీల ఒత్తిడి..

Srikanth A

Kodali Nani: అప్పుడు చింతమనేని..ఇప్పుడు కొడాలి నాని!అడ్డూ అదుపూ లేని వీరంగం!ఏపీ రాజకీయాల్లో ఇదో విచిత్ర పర్వం!

Yandamuri

Mobile Data : మీ 4G మొబైల్ డేటా స్పీడ్ తగ్గిపోయిందా…? ఇలా చేస్తే చాలు ఫోన్ పరిగెడుతుంది

arun kanna
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar