ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

శ‌భాష్ జ‌గ‌న్ … ఇంత‌టి ధైర్యం ఇవ్వ‌డం గ్రేట్‌

cm jagan humiliations with hindu gods idols destroy
Share

ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన అంశం దేవాల‌యాల్లో జ‌రుగుతున్న అవాంచ‌నీయ ఘ‌ట‌న‌లు. ఈ విష‌యంలో ప్ర‌భుత్వం త‌మ చిత్త‌శుద్ధిని చాటుకుంటున్న‌ప్ప‌టికీ విప‌క్షాలు మాత్రం ప‌లు అంశాల ఆధారంగా విరుచుకుప‌డుతున్నాయి.

cm jagan humiliations with hindu gods idols destroy

కొన్ని సంఘ‌ట‌న‌లు కూడా విప‌క్షాల‌కు అస్త్రంగా మారుతున్నాయ‌ని చెప్పుకొవ‌చ్చు. ఏదేమైనా ప్ర‌భుత్వం క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించ‌డం ముఖ్యం. తాజాగా ఓ సంఘ‌ట‌న‌పై ఏపీ స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యం శ‌భాష్ జ‌గ‌న్ అని ప్ర‌శంసించేలా ఉందంటున్నారు.

ముంద‌స్తు జాగ్ర‌త్త‌లే మేలు చేస్తాయి జ‌గ‌న్

కాకినాడ కేంద్రంగా మతభోదకుడు ప్ర‌వీణ్ చ‌క్ర‌వ‌ర్తి మతాలను కించపరిచే పోస్టులు పెట్టటంతో సీఐడీ పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. దేవతా విగ్రహాలను కాలుతో తన్ని తలలను తొలగించానంటూ ప్రవీణ్ చక్రవర్తి వ్యాఖ్యలు చేయటం పై అభ్యంతరాలు వ్యక్తం చేయ‌డంతో పోలీసులు రంగంలోకి దిగారు. అయితే , ఇక్క‌డే అస‌లు ట్విస్ట్ ఉంది. ప్రవీణ్ చక్రవర్తి వీడియో ఎడాది క్రితం పోస్టింగ్ చేసినప్పటికి ఇప్పుడున్న పరిస్దితులను రెచ్చకొట్టే విధంగా ఉండటంతో ,అది కాస్త వైరల్ అయ్యే ప్రమాదం ఏర్పడటంతో సీఐడీ పోలీసులు వెంటనే అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. అమరావతి నుండి కాకినాడ వెళ్ళిన సీఐడీ పోలీసులు ప్రవీణ్ చక్రవర్తిని రాత్రికి రాత్రి అరెస్ట్ చేసి సీఐడీ ప్రదాన కార్యాలయం కు తరలించారు.

తేడా రావొద్ద‌నే జాగ్ర‌త్త‌…

ఇప్పుడున్న పరిస్దితుల్లో రామతీర్దం ఘటన తరువాత హిందూ దేవాలయాల పై దాడులు నేపద్యంలో మెత్తం వ్యవహరాన్ని సీఐడీ అదికారులు ప్రత్యేకంగా పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరుకు చెందిన లక్ష్మినారాయణ అనే వ్యక్తి ప్రవీణ్‌ చక్రవర్తి తన యూట్యూబ్ ఛానల్ లో పోస్టింగ్ లు పెట్టిన వీడియో ఆదారంగా సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేవతా విగ్రహాలను కాలుతో తన్ని తలలను తొలగించానంటూ ప్రవీణ్ చక్రవర్తి వ్యాఖ్యలు చేయటం పై అభ్యంతరాలు వ్యక్తం అయిన నేపథ్యంలో సీఐడీ పోలీసులు వెంటనే అప్రమత్తం అయ్యి కేసు నమోదు చేసి దర్యాప్తుప్రారంభించారు. 153ఎ,153బీ,505,295ఎ 115ఐపీసీ రెడ్ విత్ 66 ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఆయ‌నేం అమాయ‌కుడు కాదండోయ్‌….

కాకినాడ కేంద్రంగా చేసుకొని విద్యాలయాలతో పాటుగా, మానసిక వికలాంగులకు ప్రత్యేకంగా ప్రవీణ్ చక్రవర్తి స్కూలు కూడా నడుపుతున్నాడు. తన వద్ద ఉన్న సంస్థ‌లను ఆసరాగా చేసుకొని ఉపాది కోసం వచ్చే మహిళల పట్ల కూడ ప్రవీణ చక్రవర్తి అసభ్యంగా ప్రవర్తించి పెళ్ళి పేరుతో మోసాలకు పాల్పడ్డారని కూడ పోలీసులకు ఫిర్యాదులు ఉంటంతో ఇప్పటికి వివిద ఫిర్యాదులు పై 6 కేసులు నమోదు అయ్యాయి. కాకినాడలోని సర్పవరం పోలీస్ స్టేషన్ తో పాటుగా టూటౌన్ పోలీస్ స్టేషన్ లో కూడ కేసులు ఉన్నాయని పోలీసు రికార్డ్ లు చెబుతున్నాయి. ఈ నేపద్యంలో మతవిశ్వాసాలను దెబ్బతేసే విదంగా వ్యవహరించిన మతభోదకుడు ప్రవీణ్ చక్రవర్తి పై సీఐడీ దర్యాప్తు పై ఆసక్తి నెలకొంది.


Share

Related posts

Pesticides: అసలు పురుగు మందులు వాడని పండ్లు ఇవే!!

siddhu

CBN సిసలైన రాజకీయం : జగన్ పేషీలో భూకంపం తెప్పించాడు ..

somaraju sharma

Raviteja: రవితేజ డిమాండ్స్ కరెక్ట్ కాదా..?

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar