NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఎస్ఈసీ నిమ్మగడ్డకు కాపు ఉద్యమ నేత ముద్రగడ లేఖ..ఎమని రాశారంటే..?

ఏపిలో స్థానిక సంస్థల పంచాయతీ ప్రభుత్వం, ఎస్ఈసీ అన్నట్లుగా వార్ సాగుతున్న విషయం తెలిసిందే. ఓ పక్క కరోనా వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ జరుగుతున్నందున ఎన్నికలు వద్దని ప్రభుత్వం చెబుతుంటే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం ప్రభుత్వ వినతిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లారు. నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. మరో పక్క ఈ వివాదం సుప్రీం కోర్టు వరకూ వెళ్లింది. అయితే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహరిస్తున్న తీరుపై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్పందించారు. నిమ్మగడ్డ వ్యవహరిస్తున్న తీరుపై ముద్రగడ విచారం వ్యక్తం చేస్తూ లేఖ రాశారు.

mudragada wrote letter to sec nimmagadda

రాష్ట్ర ప్రభుత్వంపై ఎస్ఈసీ చేస్తున్న దాడి మీడియా ద్వారా చూస్తున్నాన్న ముద్రగడ..ఎన్నికలు అన్నవి రాష్ట్రంలో పరిస్థితులను బట్టి నిర్వహించడానికి తమరు ప్రయత్నించాలి గానీ రాజకీయ నాయకులుగా పట్టుదలకు పోవడం మంచిది కాదని సూచించారు. గతంలో ఎన్టీఆర్ చిత్రంలో నేరం నాది కాదు ఆకలిది అన్నట్లుగా మిమ్మల్ని ఎవరో అదృశ్య శక్తి వెనుక ఉండి ఈ తలనొప్పులు ఇప్పిస్తున్నారని నా లాంటి వారికి అనుమానం కలుగుతోందని అన్నారు. చాలా పెద్ద చదువులు చదువుకొని పెద్ద హోదాలో ఉద్యోగాలో ఉంటూ రాజకీయాలు చేయడం మంచిగా లేదని అన్నారు. ఈ తగాదాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేయమని అవకాశం ఉంటే సలహాలు ఇవ్వాలి కానీ ఇలా రచ్చ చేయడం మానండి అంటూ సలహా ఇచ్చారు ముద్రగడ.

ప్రస్తుత పరిస్థితి భారతదేశంలో మొట్టమొదటి సారిగా చూస్తున్నామన్నారు. ఎస్ఈసీకి ఉన్న అధికారాలతో సంస్కరణలు తీసుకువచ్చి సమాజంలో మార్పు తీసుకురావాలన్నారు. ఎన్నికలు నిర్వహించే అధికారులు గుండె మీద చేయి వేసుకుని లిక్కరు, డబ్బు లేకుండా ఎన్నికలు చేశామని చెప్పగలరా అని ప్రశ్నించారు. వాటిపై ఏ అధికారి దృష్టి పెట్టరనీ, ప్రకటనల వరకే పనిచేస్తున్నారు తప్ప లోతుగా ఆలోచించి ఏ చర్యలు తీసుకోరని ఆక్షేపించారు.

రాష్ట్ర ప్రభుత్వం, తమరు పట్టుదలతో తగవులు పడి న్యాయస్థానాలలో వాదించడానికి న్యాయవాదులను నియమించడానికి ఇరువురు ఖజానాను కొల్లగొడుతున్నారని అన్నారు ముద్రగడ. ప్రభుత్వ ఖజానలోని డబ్బు ప్రజలు కష్టార్జితంతో కట్టిన పన్నులు అన్న సంగతి మరవద్దని హితవు పలికారు. ప్రభుత్వ ఖజానాలో ఉన్న డబ్బు రాష్ట్రాభివృద్ధికి ఖర్చు చేయాలే గానీ పంతాలు పట్టింపులకు కాదన్న సంగతి తమరికి తెలియంది కాదని అన్నారు. బాధ్యత కల్గిన పౌరుడిగా ఈ విషయాలపై లేఖ రాసినట్లు ముద్రగడ పేర్కొన్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N