కుక్కల దాడిలో గాయపడిన ఓ కోతికి వైద్యులు చికిత్స చేస్తున్న క్రమంలో ఆ కోతి భుజానికి బుల్లెట్ గాయం ఉండటంతో అవాక్కయ్యారు. వెంటనే శస్త్ర చికిత్స చేసి కోతి భుజంలో ఉన్న బుల్లెట్ ను తొలగించారు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లా చెరుకువాడలో ఓ కోతిపై కుక్కలు దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన ఆ కోతిని స్థానికులు భీమవరంలోని పశువైద్యుడు మేకా సాయితేజ వద్దకు తీసుకువెళ్లారు. వైద్యుడు కోతికి చికిత్స చేస్తుండగా ఎడమ భుజం భాగంలో బుల్లెట్ గాయం ఉండటంతో అవాక్కయ్యాడు. వెంటనే శస్త్ర చికిత్స చేసి బుల్లెట్ ను బయటకు తీశారు. కోతి పూర్తిగా కోలుకున్న తరువాత బయట విడిచిపెడతామని చెప్పారు వైద్యుడు సాయితేజ.
కోతి శరీరంలో బుల్లెట్ బయటపడిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పోలీసులు స్పందించారు. వెంటనే వారు సాయితేజ ఆసుపత్రికి వెళ్లి కోతి నుండి తీసిన బుల్లెట్ ను పరిశీలించారు. అది బుల్లెట్ కాదనీ, రొయ్యల చెరువుపై పక్షులను కొట్టేందుకు కాపలాదారులు ఉపయోగించే పిల్లెట్ అని నిర్ధారించారు. ఇది సెంటీ మీటరులో మూడో వంతు ఉంటుందని, దీనిలో గన్ పౌడర్ ఉందని పేర్కొన్నారు. ఈ ఘటనపై మరో పక్క చెరుకువాడ గ్రామ పరిసరాల్లో అటవీ శాఖ అధికారులు విచారణ చేస్తున్నట్లు తెలిసింది. దీనిపై జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూగ జీవాలపై కర్కశంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ప్రభాస్ ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించే న్యూస్ ఒకటి తాజాగా బయటకు వచ్చింది. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో `సలార్` ఒకటి. `కేజీఎఫ్` మూవీతో నేషనల్ వైడ్‌గా గుర్తింపు…
టాలీవుడ్ బడా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజును సోషల్ మీడియా వేదికగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఓ రేంజ్లో ఏకేస్తున్నారు. దాంతో నెట్టింట…
లోకనాయకుడు కమల్ హాసన్ ముద్దుల కుమార్తె అయిన శ్రుతి హాసన్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `శ్రీమంతుడు` మూవీ అనంతరం వ్యక్తిగత కారణాల వల్ల కొన్నాళ్లు…
టాప్ 10 తెలుగు ఎంటర్టైన్మెంట్ వెబ్సైట్లు: మహమ్మారి కరోనా వచ్చాక ఎంటర్టైన్మెంట్ రంగంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్లు ఎక్కువగా బయట కంటే…
పోయిన శుక్రవారం భారీ అంచనాల నడుమ రెండు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అందులో ఒకటే `బింబిసార`. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా కొత్త…
విమాన ప్రయాణాలు అంటే ఎన్ని నియమ నిబంధనలుతో కూడుకున్నదో అందరికీ తెలిసినదే. అయినా ఎక్కడో ఒకచోట కొన్ని రకాల అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటాయి. అందువలన తోటి…