AP Assembly Budget Session 2023: ఏపి అసెంబ్లీ సమావేశాల్లో సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. శాసనసభ సమావేశాలు ప్రారంభం అయినప్పటి నుండి టీడీపీ సభ్యులు ఆందోళన చేయడం, స్పీకర్ సస్పెండ్ చేయడం జరుగుతూనే ఉంది. శుక్రవారం కూడా టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారామ్ సస్పెండ్ చేశారు. ఒక్క రోజు సభ నుండి సస్పెండ్ చేశారు. మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేశారు.

బడ్జెట్ పై మాట్లాడేందుకు మైక్ ఇవ్వాలంటూ స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. దీంతో పది మంది టీడీపీ సభ్యులను ఒక్క రోజు సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. సస్పెండ్ అయిన వారిలో అచ్చెన్నాయుడు, బెందాళం అశోక్, రామకృష్ణబాబు, గణబాబు, రామరాజు, బాల వీరాంజనేయులు, గద్దె రామ్మోహన్, ఏలూరి సాంబశివరావు, చిన్న రాజప్ప, ఆదిరెడ్డి భవాని లు ఉన్నారు.