NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

TDP MP Kanakamedala Ravindra Kumar: కేంద్రానికి టీడీపీ ఎంపి కనకమేడల కీలక లేఖ..! అది ఏమిటంటే..!!

TDP Kanakamedala Ravindra Kumar objects ap cs extension

TDP MP Kanakamedala Ravindra Kumar: ఏపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సీనియర్ ఐఏఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఈ నెల 30వ తేదీన రిటైర్ కానున్నారు. అయితే ఆయన పదవీ కాలాన్ని పొడిగించాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు అనుమతి కోసం కేంద్రానికి లేఖ రాసింది. అధిత్యనాథ్ దాస్ పదవీ కాలాన్ని పొడిగింపునకు కేంద్రం అనుమచించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన నీలం సాహ్ని పదవీ కాలాన్ని మూడు నెలల చొప్పున రెండు సార్లు ఎక్స్ టెన్షన్ తీసుకున్నారు. అదే తరహాలో ఆదిత్యనాథ్ దాస్ విషయంలో పదవీ కాలాన్ని పొడిగింపునకు జగన్ సర్కార్ ప్రయత్నిస్తున్నది. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలపై టీడీపీ ఎంపి కనకమేడల రవీంద్ర కుమార్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కేంద్రానికి లేఖ రాశారు.

TDP Kanakamedala Ravindra Kumar objects ap cs extension
TDP MP Kanakamedala Ravindra Kumar objects ap cs extension

కేంద్ర సిబ్బంది వ్యవహారాల విభాగానికి లేఖ రాసిన రవీంద్ర కుమార్.. ఆదిత్యనాథ్ దాస్ పదవీ పొడిగింపు సరికాదని పేర్కొన్నారు. నేరారోపణలు ఉన్న సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ పదవీ కాలాన్ని ఎలా పొడిగిస్తారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ సేవలు దుర్వినియోగం చేసిన వారికి పదవీ కాలం పొడిగింపు తగదని పేర్కొన్న రవీంద్ర కుమార్… జగన్ పై ఉన్న సీబీఐ కేసుల్లో అదిత్యనాథ్ దాస్ పై కూడా తీవ్ర నేరారోపణలు ఉన్నాయన్నారు. అదిత్యనాథ్ దాస్ జలవనరుల శాఖ కార్యదర్శిగా ఉన్న సమయంలో అభియోగాలు నమోదు అయ్యాయని గుర్తు చేశారు.

Read More: Tdp Ex minister: మరో టీడీపీ మాజీ మంత్రి పై కేసు నమోదు..!!

ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్న సమయంలో ఇండియా సిమెంట్స్ లో జగన్ పెట్టుబడులు పెట్టారనీ, అప్పట్లో ఇండియా సిమెంట్స్ కు ఆదిత్యనాథ్ దాస్ అనధికారికంగా నీటిని కేటాయించారని ఆరోపించారు. నాడు జగన్ తో పాటు అదిత్యనాథ్ దాస్ పైనా సీబీఐ కేసు నమోదు చేసిందని కేంద్రానికి రాసిన లేఖలో రవీంద్ర కుమార్ పేర్కొన్నారు. అయితే కేంద్రం ఈ లేఖను పరిగణలోకి తీసుకుంటుందా లేదా అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

 

 

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N