NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

‘ గ‌ద్దె ‘ క‌నిపించి ఐదేళ్లైంది… ముస‌లోళ్ల‌లోనూ ‘ దేవినేని ‘ కే క్రేజ్‌…!

విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో చిత్ర‌మైన ప‌రిస్థితి నెల‌కొంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఎక్క‌డా లేని విధంగా సీనియ‌ర్ సిటిజ‌న్ల ఓటు బ్యాంకు 32 శాతానికి పైగా ఉంది. దీనిలో అన్ని సామాజిక వ‌ర్గాలు ఉన్నాయి. ముఖ్యంగా క‌మ్మ వ‌ర్గం ఓట్లు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని ఎన్నిక‌ల సంఘం లెక్కే చెబుతోంది. ఒక‌ప్పుడు వీరంతా.. సిట్టింగ్ ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్‌కు అండ‌గా ఉన్నారు. ఉద‌యం, సాయంత్రం వేళల్లో సీనియ‌ర్ సిటిజ‌న్లు ఎక్క‌డ వాకింగ్ చేసినా.. ఏ పార్కులో కూర్చున్నా.. గ‌ద్దె గురించి పాజిటివ్‌గా మాట్లాడుకునేవారు.

కానీ, అదేంటో గ‌త ఐదేళ్లుగా నియోజ‌క‌వ‌ర్గంలో మార్పు క‌నిపిస్తోంది. ముఖ్యంగా ఎన్నిక‌ల‌కు ముందు.. ఈ మార్పు కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. “ గ‌ద్దె సీనియ‌ర్ నాయ‌కుడు. ఈ విష‌యంలో మాకు డౌట్ లేదు. కానీ, ఇప్పుడు ప‌రిస్థితి మారింది. కొత్త నీటికి దారి ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంది. ఆయ‌న అనారోగ్యంతోనో.. ఇత‌ర కార‌ణాల‌తో ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. కానీ, ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గంలో చేయాల్సిన ప‌నులు చాలా ఉన్నాయి. యువ నేత‌ల‌కు ఆహ్వానం ప‌ల‌కాల్సిన అవ‌స‌రం ఉంది “ అని ఏ ఇద్ద‌రు సీనియ‌ర్ సిటిజ‌న్లు క‌లుసుకున్నా.. ఇదే మాట చెబుతున్నారు.

అంతేకాదు.. యువ నాయ‌కులకు పార్టీల‌కు అతీతంగా జై కొడుతున్న‌వారు కూడా పెరుగుతున్నారు. వైసీపీ త‌ర‌ఫున ఇక్క‌డ నుంచి దేవినేని అవినాష్ పోటీ చేస్తున్నారు. ఈయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు సీనియ‌ర్ సిటిజ‌న్ల‌తో భేటీ కాలేదు. ఇత‌ర వ‌ర్గాల‌ను మాత్ర‌మే క‌లుస్తున్నారు. కానీ, తాను స్పృశించ‌ని సీనియ‌ర్ సిటిజ‌న్ల ద‌గ్గ‌ర కూడా.. అవినాష్‌కు మార్కులు ప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. గ‌త ఐదేళ్ల కాలంలో గ‌ద్దె నియోజ‌క‌వ‌ర్గానికి దూరం కావ‌డ‌మే.

కార‌ణాలు ఏవైనా.. ఆయ‌న ప్ర‌జ‌ల‌లోనూ.. ముఖ్యంగా త‌న‌కు ఇప్ప‌టి వ‌ర‌కు అంగా ఉన్న క‌మ్మ సామాజిక వ‌ర్గంలోనూ సింప‌తీని పోగొట్టుకున్నార‌నేది వాస్త‌వం అంటున్నారు ప‌రిశీల‌కులు. అందుకే. ఇక్క‌డ ఎప్పుడూలేని విధంగా మార్పు దిశ‌గా అడుగులు వేస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

యువ నాయ‌కుడిగా ఉండి.. కొండ‌లు ఎక్కుతూ.. మారుమూల ప్రాంతాల‌కు కూడా వెళ్తూ.. నిత్యం ప్ర‌జ‌ల్లోనే ఉంటున్న అవినాష్‌.. వైపు మెజారిటీ ప్ర‌జ‌లు మొగ్గు చూపుతున్నారు. ఇంకా చిత్ర‌మేంటంటే.. నియోజ‌క‌వ‌ర్గంలో చాలా మంది త‌మ ఎమ్మెల్యే గ‌ద్దెను చూసి ఐదేళ్ల‌యింద‌ని చెబుతుండ‌డం. ఇది అవినాష్‌కు క‌లిసి వ‌స్తున్న అంశంగా పేర్కొంటున్నారు ప‌రిశీల‌కులు.

Related posts

Pulavarti Nani: చంద్రగిరి టీడీపీ అభ్యర్ధి పులవర్తి నానిపై దాడి .. తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత

sharma somaraju

Jagan: జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి

sharma somaraju

Lok sabha Elections 2024: వారణాసిలో ప్రధాని మోడీ నామినేషన్ .. హజరైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్

sharma somaraju

Upasana: డెలివరీ తర్వాత ఉపాసనను వెంటాడిన డిప్రెషన్.‌. రామ్ చరణ్ ఏం చేశాడో తెలిస్తే శభాష్ అనకుండా ఉండలేరు!

kavya N

Ajith Kumar: టాలీవుడ్ లో స్టార్ హీరోగా చ‌క్రం తిప్పాల్సిన అజిత్ ను అడ్డుకున్న‌ది ఎవ‌రు.. తెర వెన‌క ఏం జ‌రిగింది?

kavya N

Barzan Majid: ఐరోపా మోస్ట్ వాంటెండ్ స్మగ్లర్ మజీద్ (స్కార్పియన్) అరెస్టు

sharma somaraju

Chiranjeevi-Balakrishna: చిరంజీవి రిజెక్ట్ చేసిన క‌థతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన బాల‌య్య‌.. ఇంత‌కీ ఏ సినిమా అంటే?

kavya N

లగడపాటి సర్వే రిపోర్ట్… ఆ పార్టీకి షాక్ తప్పదా… ?

G V Prakash Kumar: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. 11 ఏళ్ల వైవాహిక బంధానికి స్వ‌స్తి ప‌లికిన యువ హీరో!

kavya N

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N