NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఇండ‌స్ట్రీ క‌దులుతుందా… ప‌వ‌న్ కోసం చిరంజీవి ప్ర‌చారం…!

అవును.. ఇప్ప‌టికైనా సినీ ఇండ‌స్ట్రీ క‌దులుతుందా? .. రాజ‌కీయంగా తాము ఎంచుకున్న మార్గంలో న‌డు స్తుందా? ఇదీ.. ఇప్పుడు ప్ర‌శ్న‌. ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో మెజారిటీ భాగం.. జ‌న‌సేన‌వైపు. టీడీపీవైపు ఉండ‌డం గ‌మ‌నార్హం. దీనికి బీజేపీ కూడా క‌లిసింది. దీంతో కూట‌మివైపు మొగ్గు చూపుతున్న‌వారి సంఖ్య మ‌రింత పెరిగింది. ఉదాహ‌ర‌ణ‌కు నిన్న మొన్న‌టి వ‌ర‌కు త‌ట‌స్థంగా ఉన్న మంచు కుటుంబం ఇప్పుడు ఓపెన్ అయిపోయింది. త‌మ మ‌ద్ద‌తు ఎన్డీయేకేన‌ని తేల్చి చెప్పింది. అంతేకాదు.. ప‌రోక్షంగా వైసీపీని ఓడించా ల‌నే పిలుపు కూడా ఇచ్చింది.

ఇక‌, ఇదే అభిప్రాయంతో అనేక మంది సినీ రంగానికి చెందిన ప్ర‌ముఖులు ఉన్నారు. వీరిలో కొంద‌రు ఇప్ప‌టికే టీడీపీకి అనుకూలంగా ఉన్నారు. కానీ, కొంద‌రు మాత్రం న‌ర్మ‌గ‌ర్భంగా ఉన్నారు. ఇంకా వీరు త‌ట‌ప‌టాయిస్తున్న ప‌రిస్థితి నెల‌కొంది. ఏమో.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ జ‌గ‌న్ వ‌స్తే.. ఇప్పుడు తాము ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా మాట్లాడితే.. ఇబ్బందులు త‌ప్ప‌వేమోన‌నే జంకుతో ఉన్నారు. దీంతో చాలా మంది కేవ‌లం సోష‌ల్ మీడియాకే ప‌రిమిత‌మ‌య్యారు.

అయితే. కొంద‌రు మాత్రం ఓపెన్ అవుతున్నారు. ఇక‌, మెగా కుటుంబం మొత్తం జ‌న‌సేన వైపే ఉంది. అ యితే.. ఇప్ప‌టికీ ఈ ఫ్యామిలీలో మెగాస్టార్ చిరంజీవి, రాం చ‌ర‌ణ్ లు మాత్రం మౌనంగానే ఉన్నారు. వీరు క‌దిలితే.. జ‌న‌సేన కు మంచి ఊపు వ‌స్తుంద‌నే చ‌ర్చ సాగుతోంది. ప్ర‌ధానంగా చిరంజీవిని జ‌గ‌న్ అవ‌మా నించార‌నే వాద‌న ఈ కుటుంబంలో ఉంది. దీంతో స‌మ‌యం కోసం వేచి చూస్తున్నార‌ని తెలుస్తోంది.

అదే స‌మ‌యంలో టీడీపీని అనుకూలంగా చూస్తున్న‌వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ప్ర‌ధానం ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు కూడా టీడీపీకి సానుకూలంగా ఉన్నారు. అయితే.. ఎవ‌రూ కూడా ఇప్ప‌టికిప్పుడు బ‌హిర్గ‌తం కాలేదు. కావ‌డం లేదు. మ‌రికొన్ని రోజులు వేచి చూసి.. పొలిటిక‌ల్‌గా ఏపీలో వాతావ‌ర‌ణం ఒక రేంజ్‌కు చేరుకున్నాక‌.. త‌మ స‌త్తా చూపించే ధోర‌ణిలో ఇండ‌స్ట్రీ ఉంద‌నే చ‌ర్చ సాగుతోంది. ఎలా చూసుకున్నా.. జ‌గ‌న్‌కు అనుకూలంగా త‌క్కువ‌మందే క‌నిపిస్తున్నారు.

ఇక‌, ఇండ‌స్ట్రీలో మ‌రోమాట‌కూడా వినిపిస్తోంది. సినీ రంగం నుంచి రోజా, బాల‌య్య వంటివారు ఉన్నా… సినీ స‌మ‌స్య‌ల‌పై వారు స్పందించింది లేదు. దీంతో ప‌వ‌న్‌ను గెలిపించుకుంటే ఆ గ్యాప్ త‌గ్గుతుంద‌ని లెక్క‌లు వేసుకుంటున్నారు. ఎన్నిక‌ల పోలింగ్ స‌మ‌యానికి నేరుగా చిరంజీవి.. రంగంలోకి దిగి.. ప‌వ‌న్ పోటీ చేసే చోట ప్ర‌చారం చేసే అవ‌కాశం ఉంద‌ని పరిశ్ర‌మ వ‌ర్గాలు చెబుతున్నాయి.

Related posts

EC: జనసేనకు ఈసీ గుడ్ న్యూస్ .. కామన్ సింబల్ గా గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

YS Sharmila: ‘వైఎస్ఆర్.. జగన్ పాలనకు పోలిక ఎక్కడ ..?’

sharma somaraju

TDP: టీడీపీలో జాయిన్ అయిన కోడికత్తి శ్రీను

sharma somaraju

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju