Breaking: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చెరువులో పడి ముగ్గురు దుర్మరణం పాలైయ్యారు. ఎమ్మిగనూరు మండలం సిరాలదొడ్డి చెరువులో బట్టలు ఉతికేందుకు వెళ్లిన ముగ్గురు మృతి చెందారు.

మృతులు మరియమ్మ, లోకేష్, సలోమిగా గుర్తించారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనలో గ్రామంలో విషాదశ్చాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.