Tirumala: తిరుమల ఆనంద నిలయం దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆదివారం రాత్రి వర్షం పడుతున్న సమయంలో శ్రీవారి ఆనంద నిలయాన్ని ఓ భక్తులు తన మొబైల్ ఫోన్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేసినట్లు తెలుస్తొంది. నిత్యం భక్తులతో కిటకిటలాడే తిరుమల శ్రీవారి ఆలయంలో భద్రత కట్టుదిట్టంగా ఉంటుంది. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలతో మూడంచెలుగా భద్రతను పర్యవేక్షిస్తూనే ఉంటారు. ఆలయానికి వచ్చే భక్తులను క్షుణ్ణంగా పరిశీలించి మరీ లోపలికి అనుమతిస్తుంటారు. సెల్ ఫోన్, కెమెరాలను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించరు. ఇంత పకడ్బందీగా భద్రత ఉన్నప్పటికీ ఓ భక్తులు ఈ విధంగా శ్రీవారి ఆలయంలోకి సెల్ ఫోన్ ను తీసుకువెళ్లడమే కాకుండా ఆనంద నిలయాన్ని వీడియోలు తీయడంపై భక్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం ఆనంద నలియం విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో శ్రీవారి ఆలయంలో భద్రత ఇదేనా అంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై టీటీడీ విజిలెన్స్ విభాగం అప్రమత్తమై భక్తుడు సెల్ ఫోన్ తో ఆలయంలోకి ఎలా ప్రవేశించారన్న విషయంపై ఆరా తీస్తున్నారు. మొబైల్ తో వెళ్లిన భక్తుడి ఆచూకీ తెలుసుకునేందుకు టీటీడీ సెక్యురిటీ సిబ్బంది సీసీ పుటేజీ పరిశీలిస్తున్నారు.
భద్రత నిబంధనలు ఉల్లంఘించి సెల్ ఫోన్ తో శ్రీవారి ఆలయంలో ప్రవేశించడమే కాకుండా ఆనంద నిలయాన్ని చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేసిన నిందితుడిపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసినట్లయితే వర్షం పడుతున్న సమయంలో ఆనంద నిలయాన్ని అతి సమీపంలో నుండి భక్తుడు వీడియో తీసినట్లు తెలుస్తొంది. అయితే ఇప్పటి వరకూ ఈ విషయంపై టీటీడీ అధికారులు అధికారికంగా ఎలాంటి కామెంట్స్ చేయలేదు.
ఇళ్ల మధ్య లో కుప్పకూలిన యుద్ద విమానం ..ముగ్గురు మృతి.. పరుగులు తీసిన ప్రజలు