NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Tirupati: దేశంలోనే అత్యుత్తమ ఆసుపత్రిగా శ్రీ పద్మావతి చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి

Tirupati: టీటీడీ నిర్మిస్తున్న శ్రీ పద్మావతి చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి దేశంలోనే అత్యుత్తమ ఆసుపత్రిగా తయారవుతుందని టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి అన్నారు. అలిపిరి సమీపంలో నిర్మిస్తున్న ఈ ఆసుపత్రి పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరు, గడువులోగా పూర్తి అయిన పనుల గురించి అధికారులను అడిగితెలుసుకున్నారు. ఆసుపత్రి నిర్మాణం కోసం సేకరించిన భూమిలో ఉన్న రుయా ఆసుపత్రి క్షయ, ఊపిరితిత్తుల వ్యాధుల చికిత్స వార్డును పరిశీలించారు. ఆసుపత్రి నిర్మాణం వేగంగా పూర్తి చేయాల్సి ఉన్నందువల్ల ఈ  వార్డును తాత్కాలికంగా మరో చోటికి తరలించాలని రుయా అధికారులకు సూచించారు. స్థలం గుర్తించి కొత్త భవనం నిర్మించి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఈవో టీటీడీ అధికారులను ఆదేశించారు. పనులు జరుగుతున్న తీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

Dharma Reddy

 

అనంతరం ధర్మారెడ్డి మీడియా తో మాట్లాడుతూ.. ఈ  ఏడాది డిసెంబర్ లో ఆసుపత్రిని ప్రారంభించేలా ప్రణాళికలు తయారు చేశామన్నారు. అనుకున్న గడువు ప్రకారమే నిర్మాణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం ఉన్న చిన్న పిల్లల హృదయాలయం (గుండె చికిత్సల ఆసుపత్రి) ప్రపంచంలోని ఉత్తమ ఆసుపత్రుల సరసన చేరిందని ఈవో వివరించారు. ఈ ఆసుపత్రిలో ఇప్పటి వరకు 1450 గుండె ఆపరేషన్లు నిర్వహించి పిల్లలకు కొత్త జీవితం ప్రసాదించినట్లు చెప్పారు. అలాగే జీవన్ దాన్ కింద నాలుగు గుండె మార్పిడి శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహించారని తెలిపారు.

కొత్తగా నిర్మిస్తున్న ఆసుపత్రిలో చిన్న పిల్లలకు సంబంధించి గుండె చికిత్సలతో పాటు న్యూరో, న్యూరో సర్జరీ, పల్మనాలజి, యూరాలజి తదితర సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. తదుపరి ఈవో తన కార్యాలయంలో ఆసుపత్రి పనుల ప్రగతిపై అధికారులతో సమీక్షించారు. జేఈవో సదా భార్గవి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వర రావు, ఎస్ఈ వెంకటేశ్వర్లు, టీటీడీ ఎస్టేట్ ఆఫీసర్ లక్ష్మణ మూర్తి, చిన్న పిల్లల గుండె చికిత్సల ఆసుపత్రి ఆర్ ఎంవో  డాక్టర్ భరత్, ఈఈ కృష్ణా రెడ్డి, రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవి ప్రభు తదితరులు పాల్గొన్నారు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju