NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ

ఏపీలో సీబీఐకి చాలా పనులున్నాయ్..! ఇదే కాదు.. ఇక్కడితో ఆగదు..!!

సీబీఐ ఇక వచ్చెయ్. మా రాష్ట్రానికి వచ్చెయ్. “వస్తా.., వస్తా.., వందలాది అధికారులను, ఈ రాష్ట్రంలో కొన్ని కార్యాలయాల ఏర్పాటుకి వనరులను.., ఇక్కడే చాలా కాలం ఉండేలా కావాల్సిన అవసరాలను తెచ్చేసుకో.., మూటాముళ్ళు కట్టేసుకుని వచ్చేసేయ్..! ఇక ఈ పోరు ఆగేలా లేదు. ప్రభుత్వం వెనకడుగు వేయదు, పిటిషనర్లు పోలీసులను నమ్మరు.., కోర్టు పోలీసులను వదలదు., అందుకే మీరే ఇక దిక్కు. ఒక డాక్టర్ రోడ్డుపై గొడవ చేసినా మీరే రావాలి.., ఒక హత్యా కేసుని ఛేదించడానికి మీరే కావాలి.., ఒక రథం కాలినా మీరే దిక్కు.., కోర్టుని తిట్టినా వాళ్ళ పని పట్టడానికి మీరే రావాలి. ఏపీలో ఈ తంతు ఆగదు. ఇంకా చాలా ఉన్నాయి. మీ కోసం వేచి చూస్తున్నాయి.

16 నెలల్లో ఆరు కేసులు..!!

సీబీఐ అంటే ఎక్కడో దేశ రాజధానిలో కార్యాలయం ఉంటుంది. రాష్ట్రానికి ఒక ప్రత్యేక విభాగం ఉంటుంది. తక్కువ సిబ్బందితో వెళ్లదీస్తుంది. దేశ వ్యాప్తంగా సీబీఐకి సిబ్బంది కొరత ఉంది. సుమారుగా 2 వేల మంది సిబ్బది అదనంగా అవసరం ఉంది. ఈ క్రమంలోనే దాదాపు 550 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. గత ఏడాదిలో దేశ వ్యాప్తంగా దేశం వ్యాప్తంగా సుమారుగా 420 కేసులు నమోదు కాగా.., ఈ ఏడాదిలో ఇప్పటికే 325 కేసులు నమోదయ్యాయి. ఏపీలోనే గడిచిన 16 నెలల వ్యవధిలో ఆరు కేసులు సీబీఐకి వెళ్లాయి.

వీటిలో కొన్ని సిల్లీ కేసులు, ఇంకొన్ని ప్రభత్వ వైఫల్యాలు కూడా ఉన్నాయి. ఇలా ఇప్పటికే కేసుల సంఖ్య పెరుగుతుండడం.., కొత్తగా మరిన్ని అప్పగిస్తుండడం వారిపై ఒత్తిడి పెంచుతుంది. ఇక్కడితో ఆగదు. ఇప్పటికీ రాష్ట్ర హైకోర్టులో అనేక కేసులు విచారణ దశలో ఉన్నాయి. వీటిలో ఇంకొన్ని సీబీఐకి వెళ్లే ఆలోచనలు ఉన్నాయి. ముఖ్యంగా అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ కేసు.., ఫైబర్ గ్రిడ్ లో లోకేష్ పాత్ర కేసుపై సీబీఐ విచారణ చేయాలంటూ ప్రభుత్వం కోరుతుంది.

ap government vs high court issues
ap government vs high court issues

ముందున్నాయి అనేక సవాళ్లు..!

ఇప్పటి వరకు సీబీఐకి వెళ్లిన కేసుల్లో ఆ అవసరం ఉందా..? లేదా..? అనేది పక్కన పెడితే అనేక కేసుల్లో ప్రభుత్వానికి కూడా ఒక రకంగా తలవంపులే. అనవసర వివాదాలు కూడా కేంద్ర దర్యాప్తు సంస్థకి వెళ్లాయి. అందుకే కేంద్రం చేతిలో జగన్ అస్త్రంగా మారిపోయారని. బీజేపీ చేతికి ఆయుధాలు ఇచ్చినట్టు ఉంటుందని కొన్ని కామెంట్లు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఉన్న కేసులు కాకుండా.., ఏపీ ప్రభుత్వం కోరుతున్నట్టు రాజధాని భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ కేసు.., ఫైబర్ గ్రిడ్ కుంభకోణం కూడా సీబీఐకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు విశాఖలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక అవినీతి, ఇళ్ల పట్టాల పంపిణీలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు అవినీతి విషయంలో కూడా పిటిషన్లు పడుతున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా దళితుడికి శిరోముండనం.., చీరాలలో కిరణ్ మృతి కేసులను హైకోర్టు సీరియస్ గా తీసుకుంది. ఇవి కూడా సీబీఐకి అప్పగించే అవకాశం ఉంది అంటూ న్యాయవర్గాల్లో వాదనలు వినిపిస్తున్నాయి.

author avatar
Srinivas Manem

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N