Liger: డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం రౌడీ విజయ్ దేవరకొండ తో “లైగర్” ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చాలా మంది బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు అదేరీతిలో సౌత్ లో టాప్ మోస్ట్ నటీనటులు నటిస్తున్నారు. ఈ సినిమా గురించి పూరి జగన్నాథ్ సోషల్ మీడియాలో మాట్లాడుతూ తన కెరీర్లోనే ఇది చాలా డిఫరెంట్ సబ్జెక్ట్ అదేరీతిలో ఎంతగానో నచ్చిన సబ్జెక్ట్ అంటూ చాలా ప్రత్యేకంగా ఈ సినిమా గురించి పూరి చెప్పుకొచ్చాడు.
అదే విధంగా విజయ్ దేవరకొండ.. కూడా ఈ సినిమా తనకు ఎంతగానో ప్రత్యేకమని పూరి జగన్నాథ్ తో పనిచేయడం అనేది చాలా విషయాలు నేర్చుకోవడానికి దోహదపడింది అన్నట్టు ఆయన చెప్పినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. వరుస ఫ్లాపుల్లో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఉండటంతో ఈ సినిమాపై ఆయన అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే బాక్సింగ్ నేపథ్యంలో సినిమా తెరకెక్కుతోంది ఉండటంతో… సినిమాలో ఇంటర్నేషనల్ సెలబ్రిటీ ఒకరు సడన్ ఎంట్రీ ఇచ్చేలా పూరి జగన్నాథ్ ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
Read More: Puri Musings: ఒక్కటే జీవితం.. ఒక్కసారే బతుకుతాం.. ఒక్క మెతుకు కూడా వదలొద్దు..
పూర్తి విషయంలోకి వెళితే ఇంటర్నేషనల్ బాక్సర్ ఛాంపియన్ షిప్ మైక్ టైసన్.. చివరిలో బాక్సింగ్ ఫైట్ గెలిచాక విజయ్ దేవరకొండ కి ట్రోఫీ ఇవ్వటానికి గెస్ట్ గా రాబోతున్నట్లు.. అంతర్జాతీయ స్థాయిలో బాక్సింగ్ నేపథ్యంలో సినిమా ఓ రేంజ్ లో ఉండే విధంగా పూరి ప్లాన్ చేసినట్లు దానికోసం అదే తరహాలో.. ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా బాక్సర్ మైక్ టైసన్ నీ కూడా సినిమాల్లో యాక్ట్ చేయడానికి పూరి డిసైడ్ అయినట్లు ఫిలిం నగర్ టాక్.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!