Bheemla nayak: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ కాంబినేషన్ అంటే అభిమానులకే కాదు ఇండస్ట్రీ వర్గాలలో, ప్రేక్షకుల్లో ఉండే అంచనాలే వేరే లెవల్. ఇక వీరి మధ్య హీరో, దర్శకుడు కంటే కూడా స్నేహితులుగా గొప్ప అనుబంధం ఉంది. పవన్ అంటే ప్రత్యేక అభిమానం అన్నీ రకాలుగా ఉన్న దర్శకుడు త్రివిక్రం. పవన్ సినిమా ఓకే అవ్వాలన్నా, కథ – కథనం, డైలాగ్స్ విషయంలో అన్నీ పక్కాగా ఉన్నాయా లేదా అనే కీలక విషయాలన్నీ ఆయన దగ్గర ఉండి చూసుకుంటుంటారు. ఇక పవన్ కళ్యాణ్‌కు త్రివిక్రం మాట అంటే గురి ఎక్కువ.
ఆయన ఏదైనా చెప్తే తప్పకుండా ఆలోచిస్తారు. అందుకు ఉదాహరణే భీమ్లా నాయక్. ఈ సినిమాను పవన్ కళ్యాణ్ ఒప్పుకోవడానికి కారణం త్రివిక్రం. మలయాళంలో పెద్ద హిట్ సాధించిన ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తే భారీ కమర్షియల్ సక్సెస్ సాధిస్తుందని త్రివిక్రం చాలా నమ్మకంగా చెప్పి తన నిర్మాతలతో రీమేక్ రైట్స్ కొనిపించాడు. అంతేకాదు ఈ కథలో పవన్ కళ్యాణ్ అయితే అద్భుతమైన సక్సెస్ వస్తుందని స్వయంగా ఈ ప్రాజెక్ట్ చేయమని పవన్‌తో మాట్లాడి ఒప్పించాడు. ఆ నమ్మకం నిలబెట్టుకునేందుకు త్రివిక్రం స్క్రీన్ ప్లేతో పాటు డైలాగ్స్ అందిస్తున్నారు.
Bheemla nayak: త్రివిక్రం చెప్పింది వింటూ చెప్పిన సలహాలను పాటిస్తున్నారట.
ఇక ఇప్పటికే సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే, సినిమా పోస్ట్ పోన్ అయిన నేపథ్యంలో ఇంకా చిన్న చిన్న మార్పులను సూచించి సినిమాను చెక్కుతున్నారట పవన్ కళ్యాణ్. ఇప్పుడు చేస్తున్న మార్పులతో భీమ్లా నాయక్ పవన్ ఖాతాలో భారీ కమర్షియల్ హిట్ పడుతుందని మేకర్స్ చాలా నమ్మకంగా ఉన్నట్టు తెలుస్తోంది. అందరూ త్రివిక్రం చెప్పింది వింటూ చెప్పిన సలహాలను పాటిస్తున్నారట. ఏదేమైనా పవన్ కోసం త్రివిక్రం ఇంత ప్రత్యేక శ్రద్ద తీసుకోవడం అంటే చాలా గొప్ప విషయం అని అభిమానులు చెప్పుకుంటున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!