Mahesh babu: మహేశ్ బాబుకు బంపర్ ఆఫర్..ఇది ఊహించని ఛాన్స్..! అవును తాజాగా సుధీర్ బాబు మాట్లాడిన మాటలను బట్టి ఇప్పుడు అందరూ ఇదే మాట్లాడుకుంటున్నారు.సూపర్ స్టార్ కృష్ణ కుటుంబ నేపథ్యం నుండి ‘ఎస్ఎంఎస్’ అనే మూవీతో టాలీవుడ్‌కు హీరోగా సుధీర్ బాబు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ హీరో ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ ఫుల్‌గా 10 ఏళ్లు పూర్తి అయ్యింది. కృష్ణ చిన్న కూతురు.. మహేష్ సోదరి భర్త సుధీర్ బాబు అనే విషయం తెలిసిందే. ఈ హీరోకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఈజీగానే దొరికింది. అయితే, ఆయన ఇన్నేళ్ల కెరీర్లో చాలా ఒడిదుడుకులు చూశారు.
నట వారసత్వం అనేది ఎంట్రీ వరకు మాత్రమే పనికొస్తుంది. కానీ, ఆ తర్వాత ఏ నట వారసుడైనా కూడా కష్టపడితేనే ఇక్కడ సక్సెస్ ఉంటుంది. ఇదే హీరో సుధీర్ బాబు విషయంలో కూడా మరోసారి ప్రూవ్ అయ్యింది. ఇక్కడ, అలాగే బాలీవుడ్లో సినిమాలు చేసినా కూడా స్టార్ స్టేటస్ రావడానికి చాలానే సమయం పట్టింది. ఇప్పుడు సోలో హీరోగా మంచి సినిమాలు చేస్తున్నారు. తనకంటూ ఓ ప్రత్యేకమైన మార్కెట్‌ను సంపాదించుకున్నారు. ప్రస్తుతం సుధీర్ బాబు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమాలో నటిస్తున్నారు. ఇంద్రగంటి మోహన కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
Mahesh baabu: సుధీర్ బాబు నిర్మాణంలో మహేశ్ హీరోగా సినిమా..!
ఇక ఇందులో కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. కాగా, సుధీర్ బాబు ఎప్పటి నుంచో మహేశ్ బాబుతో స్క్రీన్ షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. ఇంతక ముందు వి సినిమా ప్రమోషన్స్‌లో కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. మహేశ్ సినిమాలో అవకాశం వస్తే ఆయనకు విలన్‌గా నటించడానికి రెడీ అని ఓపెన్‌గా చెప్పారు. అయినా, ఇప్పటి వరకు ఆ అవకాశం రాలేదు. ఇక తాజాగా ఆయన మంచి కథ దొరికితే మహేశ్ బాబు హీరోగా సినిమాను తానే స్వయంగా నిర్మిస్తానని ప్రకటించారు. ఇప్పటికే మహేశ్ సొంత నిర్మాణ సంస్థతో భాగస్వామ్యంగా తను హీరోగా సినిమాలు చేస్తూనే, బయట నిర్మాతలతో సినిమాలు చేస్తున్నారు. అలాగే బయట హీరోలతో సినిమాలు నిర్మిస్తున్నారు. అలాంటిది ఇప్పుడు సుధీర్ బాబు నిర్మాణంలో మహేశ్ సినిమా అనే మాట అభిమానులకు రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తోంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!