Pushpa: ఈ ఒక్క ప్రాజెక్ట్‌తో బాలీవుడ్ మొత్తం కబ్జా చేయబోతున్న అల్లు అర్జున్

Share

Pushpa: ఈ ఒక్క ప్రాజెక్ట్‌తో బాలీవుడ్ మొత్తం కబ్జా చేయబోతున్న అల్లు అర్జున్ అంటూ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్‌లో సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మన టాలీవుడ్ స్టార్ హీరోలకు బాలీవుడ్ మార్కెట్ మీద పట్టు సాధించాలని ఎన్నో ఏళ్ళుగా ఎంతో పట్టుదలతో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, అక్కడ సరైన లాంచింగ్ ప్రాజెక్ట్ పడటం లేదు. బాహుబలి సిరీస్, సాహో చిత్రంతో ప్రభాస్‌కు హిందీ మార్కెట్ మీద మంచి పట్టు వచ్చేసింది. సాహో సౌత్ భాషలలో నిర్మాతలను నిరాశపరచినా, హిందీలో మాత్రం
మంచి వసూళ్ళు రాబట్టింది.

huge collections of allu arjun pushpa in bollywood
huge collections of allu arjun pushpa in bollywood

అప్పటి నుంచి అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్.టి.ఆర్ లాంటి వారికి ఎక్కువగా పాన్ ఇండియన్ సినిమాలలో నటించి వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేసి పాన్ ఇండియన్ స్టార్ అనిపించుకోవాలని తాపత్రయపడుతున్నారు. అంతేకాదు బాలీవుడ్‌లో స్ట్రైట్ సినిమాలను చేసే అవకాశాలను అందుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల పుష్ప: ది రైజ్ పార్ట్ 1 అనే పాన్ ఇండియన్ సినిమాతో వచ్చాడు. ఈ సినిమా 5 భాషలలో రిలీజైన సంగతి తెలిసిందే. అన్నీ భాషలలోనూ భారీ వసూళ్ళను రాబడుతోంది.

Pushpa: బాలీవుడ్‌లో 70 కోట్ల మార్క్‌ను రీచ్ అవబోతుందని టాక్ వినిపిస్తోంది.

సుకుమార్ దర్శకత్వంలో ఈ హ్యాట్రిక్ సినిమాతో ఐకాన్ స్టార్ రేంజ్ మరింతగా పెరిగింది. ఇప్పటికే ఈ సినిమా బాలీవుడ్‌లో 70 కోట్ల మార్క్‌ను రీచ్ అవబోతుందని టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్‌లో ఫస్ట్ స్ట్రైట్ సినిమాగా అల్లు అర్జున్ మంచి హిట్టే అందుకున్నాడు. ఫిబ్రవరి నుంచి ఈ సినిమా సీక్వెల్ మొదలబోతోంది. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ ఒక్క ప్రాజెక్ట్‌తో బాలీవుడ్ మొత్తం కబ్జా చేయబోతున్నాడు అల్లు అర్జున్ అంటూ అభిమానులు చెప్పుకుంటున్నారు. కాగా, అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాను బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయబోతున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.


Share

Related posts

అమెరికాలో ఆర్థిక సంక్షోభం

Siva Prasad

Pooja hegde: పూజా హెగ్డేకి ప్రొడ్యూసర్ వార్నింగ్..నెమ్మదిగా అమ్మడిని సైడ్ చేసేస్తారా..?

GRK

మొలకల నుంచి శరీరానికి ఎక్కువ పోషణ అందాలంటే ఇలా చెయ్యండి

Kumar