న్యూస్ సినిమా

Sarkaru Vaari Paata: నిర్మాత అంత నమ్మకంగా చెబుతున్నాడంటే ఇది ‘పోకిరి 2’నా..?

Share

Sarkaru Vaari Paata: తాజాగా సర్కారు వారి పాట సినిమా గురించి చిత్రాలలో ఒకరైన రవి శంకర్ ఎలమంచిలి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట. శరవేగంగా ఈ సినిమా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటోంది. ప్రస్తుతం ఫైనల్ సాంగ్ షూటింగ్ జరుగుతోంది. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సాంగ్ షూటింగ్ జరుగుతుండగా ఈ నెల 21తో గుమ్మడికాయ కొట్టేయనున్నారు.

is sarkaru-vaari-paata-pokiri 2
is sarkaru-vaari-paata-pokiri 2

ఇక పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ కూడా దాదాపు పూర్తి కావచ్చింది. ఇప్పటి వరకు మహేశ్‌ను చూడని ఓ స్టైలిష్ లుక్‌లో చిత్ర దర్శకుడు పరశురామ్ పెట్లా చూపించబోతున్నాడు. ఇప్పటికే, పోస్టర్, టీజర్, కళావతి, పెన్నీ సాంగ్స్‌లో మహేశ్‌ను చూస్తేనే ఈ విషయం అర్థమవుతోంది. ఇక త్వరలో మాంచి మాస్ బీట్ ఉన్న సాంగ్‌ను రిలీజ్ చేయనున్నారు. ఎస్ ఎస్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్ – 14 రీల్స్ ప్లస్ – జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్నాయి.

Sarkaru Vaari Paata: ఈ సినిమా ఖచ్చితం గా మరో పోకిరి..

అయితే, మైత్రీ నిర్మిస్తున్న చిత్రాలలో అంటే..సుందరానికీ ఒకటి. నాని, నజ్రియా జంటగా నటించిన ఈ సినిమాను వివేక్ ఆత్రేయ తెరకెక్కించాడు. తాజాగా చిత్ర టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ విడుదల సందర్భంగా సర్కారు పాట సినిమా గురించి మాట్లాడారు నిర్మాత రవిశంకర్. అంటే..సుందరానికంటే నెల రోజులు ముందు మహేశ్ తో చేస్తున్న సర్కారు వారి పాట సినిమాతో భారీ హిట్ కొట్టబోతున్నాము. ఈ సినిమా ఖచ్చితంగా మరో పోకిరి అంటూ అంచనాలు అమాంతం పెంచేశాడు. దాంతో అభిమానుల్లో అంచనాలు ఇంకా పెరిగిపోయాయి.


Share

Related posts

బిగ్ బాస్ 4 : చివర్లో ట్విస్ట్ పెట్టిన బిగ్ బాస్..! అభిజిత్ కి పెద్ద సవాల్

arun kanna

Renu Desai : అతనితో ప్రేమలో ఉన్నానంటున్న రేణు దేశాయ్..!

Teja

Radhe shyam : రాధేశ్యామ్ అనుకుంటే సలార్ అంటున్నారు..డిసప్పాయింట్ అవుతున్న ఫ్యాన్స్..!

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar