Kaikala Satyanarayana: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని తన నివాసంలో శుక్రవారం ఉదయం తుది శ్వాస విడిచారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా కమెడియన్ గా ఇలా అన్ని రకాల పాత్రలను పోషించి తనదైన గుర్తింపును సంపాదించుకున్నారు. 777 చిత్రాల్లో నటించిన ఆయన నటన కైకల సత్యనారాయణ అద్భుతం..

కైకాల సత్యనారాయణ
నిర్మాతగానూ పలు సినిమాలు రూపొందించారు. కైకాల పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తింపుగా ‘నవరస నటనా సార్వభౌమ’ అనే బిరుదు పొందారు.. టాలీవుడ్ లో ఎస్.వి. రంగారావు తర్వాత అలాంటి వైవిధ్య భరితమైన పాత్రలు పోషించిన వారిలో కైకాల ఒకరు. ఆయన మరణ వార్తతో టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించేందుకు పలువురు సినీ ప్రముఖులు ఆయన ఇంటికి వస్తున్నారు.
ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, జీవితకాల సాఫల్య పురస్కారం (2017),
నంది అవార్డులు
ఉత్తమ చలన చిత్రం – బంగారు కుటుంబం (1994),
రఘుపతి వెంకయ్య అవార్డు – 2011, ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ అవార్డు ,
నటశేఖర – అనంతపురంలో ఒక ప్రభుత్వేతర సంస్థ ఇచ్చింది. నటశేఖర – గుడివాడ పురపాలక సంఘ వేదికపై ఇచ్చినది.
కళా ప్రపూర్ణ – కావలి సాంసృతిక సంఘంవారు ఇచ్చినది
నవరసనటనా సార్వభౌమ – ఒక సాంస్కృతిక సంఘం ఇచ్చింది.
777 సినిమాలులో ఇప్పటిదాకా నటించగా.. అందులో..
28 పౌరాణిక చిత్రాలు
51 జానపద చిత్రాలు
9 చారిత్రక చిత్రాలు
200 మంది దర్శకులతో పనిచేసాడు.
223 సినిమాలు 100 రోజులు ఆడాయి.
59 సినిమాలు అర్ధశతదినోత్సవాలు జరుపుకున్నాయి.
10 సినిమాలు శతదినోత్సవాలు జరుపుకున్నాయి.
10 సినిమాలు ఒక సంవత్సరం కంటే ఎక్కువ రోజులు థియేటర్స్ లో ఆడాయి.