Kruthi Sanan: కృతి సనన్.. అందం, అభినయంతో పాటు ఈమె హైట్ ఈమెకి ప్లస్ అనే చెప్పుకోవాలి. అందుకే సినిమా పరిశ్రమలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే సూపర్ క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ కృతి. ‘1నేనొక్కడినే’ చిత్రం ద్వారా టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి, తెలుగు యువత హృదయాలను కొల్లగొట్టింది కృతి. ప్రస్తుతం బాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ మంచి దూకుడుమీద వుంది. తాజాగా అక్షయ్‌కుమార్‌తో కలిసి ఆ అమ్మడు నటించిన ‘బచ్చన్ పాండే’ మూవీ ఈనెల 18న విడుదల కానుంది.
Ram – Kruthi: పట్టాలెక్కనున్న రామ్ – కృతి సినిమా..!!
Kruthi Sanan: కృతి హాట్ కామెంట్స్ ఇవే…
ఈ సినిమా విడుదల సందర్భంగా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న కృతి తాజాగా స్టార్ హీరోల గురించి సంచలన కామెంట్స్ చేసింది. అవి ఆమె మాటల్లోనే చూడండి.. “హీరోలకు సమానంగా హీరోయిన్ పాత్రలకు ఇక్కడ సరియైన ప్రాధాన్యత లభించడంలేదు. ఒకవేళ సినిమాల్లో హీరోయిన్‌కి 60% స్క్రీన్ స్పేస్ ఉండి, హీరో పాత్రకి 40% ఇంపార్టెన్స్ ఉంటే మాత్రం అందులో స్టార్ హీరోలు అనబడేవారు ఎవరూ నటించడానికి ఆసక్తి చూపించరు. ఈ కారణంగానే గతంలో నేను నటించిన చిత్రాల్లో పలువురు స్టార్స్ నటించడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు!” అని కుండ బద్దలు కొట్టింది.
KruthiSetti Uppena Movie: కృతిశెట్టి డూపుని చూసారా..!? బేబమ్మని మించిన అందం..!!
వైరల్ అవుతున్న మాటలు!
అక్కడితో ఆగకుండా కృతి సనన్, ఇలాంటి కుంచిత స్వభావాలు మారాలని, అప్పుడే బాలీవుడ్ పరిశ్రమ బాగుపడుతుందని మన ఖాన్స్ పైన పరోక్షంగా విరుచుకుపడింది. కాగా ప్రస్తుతం కృతి చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్‌గా అవుతున్నాయి. ఇక ‘ఆత్రంగి రే’ చిత్రంలో పాత్ర చిన్నదైనా అక్షయ్ కుమార్ నటించడానికి ఒప్పుకున్నాడని, ఇది చాలా మంచి పరిణామమని చెప్పుకొచ్చింది మన సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోయిన్.