Radhe shyam: సర్ప్రైజింగ్ అప్డేట్ వచ్చేసింది..! మరో రెండు వారాలలో సినిమా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ మీద దృష్ఠిపెట్టారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా..మోస్ట్ వాంటెడ్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా రూపొందిన పీరియాడికల్ సినిమా ఇది. దీనికి దర్శకుడు రాధాకృష్ణ కుమార్. ఆయన తెరకెక్కించిన ఈ మోస్ట్ అవైటెడ్ మూవీని పాన్ ఇండియా లెవెల్లో 7 భాషలలో రిలీజ్ చేయనున్నారు. మార్చి 11వ తేదీన ఈ మూవీ రాబోతుండగా, ఇప్పటికే ఈ సినిమా మీద భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ పామిస్ట్‌గా కనిపిస్తుండటం విశేషం.
ఇక రిలీజ్ దగ్గర పడుతుంది గనక అభిమానులు ఆశించిన అప్డేట్స్ను ఒక్కటిగా వదులుతున్నారు. ఈ క్రమంలో తాజాగా సాలీడ్ అప్డేట్ ఇచ్చారు. ఈ మధ్యనే ఈ సినిమా హిందీ వెర్షన్ కి బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ తన వాయిస్ ఓవర్ ను అందిస్తున్నారని మేకర్స్ అధికారికంగా కన్ఫర్మ్ చేశారు. ప్రభాస్‌కు హిందీ బెల్ట్‌లో మంచి క్రేజ్ ఉంది. అందుకే, ప్రభాస్ కోసం అమితాబ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ క్రమంలో మిగతా సౌత్ భాషలకు ఆయా స్టార్ హీరోలతో వాయిస్ ఓవర్ ఇస్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తెలుగులో సూపర్ స్టార్ మహేశ్ బాబు వాయిస్ ఇస్తున్నారని వార్తలు వచ్చాయి.
Radhe shyam: తమిళ్ వెర్షన్ కు ఎవరు వాయిస్ చెబుతారో ..?
తాజాగా ఈ విషయంలో మేకర్స్ కన్ఫర్మేషన్ అండ్ అప్డేట్ ఇచ్చి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు. తాజాగా మేకర్స్ మిగతా భాషలకి సంబంధించిన బిగ్ అప్డేట్స్ ను రివీల్ చేశారు. దీని ప్రకారం ప్రభాస్ రాధే శ్యామ్ తెలుగు వెర్షన్ కు దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి వాయిస్ అందిస్తున్నారు. అలాగే, కన్నడ వెర్షన్ కు కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్, మలయాళ వెర్షన్ కు అక్కడి టాలెంటెడ్ యంగ్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ అందిస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు దర్శక, నిర్మాతలు. ఇక తమిళ్ వెర్షన్ కు ఎవరు వాయిస్ చెబుతారో ఇంకా మేకర్స్ రివీల్ చేయలేదు. విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం మేరకు సూర్య అని తెలుస్తోంది.
Heartful thanks to @ssrajamouli sir, @NimmaShivanna sir, and @PrithviOfficial sir for the voiceover of #RadheShyam. #Prabhas @hegdepooja @director_radhaa @UV_Creations @TSeries @GopiKrishnaMvs @AAFilmsIndia @RadheShyamFilm #RadheShyamOnMarch11 pic.twitter.com/nf5u9yxl2m
— UV Creations (@UV_Creations) February 27, 2022
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!