Rajamouli: బాహుబలి కి 100 రెట్ల సినిమా తీస్తోన్న రాజమౌళి..నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇదే..!

Share

Rajamouli: బాహుబలి సినిమా తెలుగులో మాత్రమే కాకుండా సౌత్ సినిమా ఇండస్ట్రీలోనే ఓ భారీ సంచలనం. ఈ సినిమా సిరీస్‌లతో రాజమౌళి తెలుగు చిత్రపరిశ్రమ గౌరవ ప్రతిష్ఠలను అసాధారణంగా పెంచారు. బాహుబలి తర్వాత అన్నీ సినిమా ఇండస్ట్రీలలోని దర్శక, నిర్మాతలు ఆ స్థాయి సినిమా తీసి రాజమౌళి సృష్ఠించిన రికార్డ్స్‌ను బద్దలు కొట్టాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయనతో ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్ సహా సౌత్ దర్శకులందరూ పోటీపడుతున్నారు.

rajamouli-next-project-will be -100times-more-than-that
rajamouli-next-project-will be -100times-more-than-that

కానీ ఆర్ఆర్ఆర్ సినిమాతో మళ్ళీ బాహుబలి సిరీస్ క్రియేట్ చేసిన రికార్డ్స్‌ను మళ్ళీ రాజమౌళినే బ్రేక్ చేయాలని కసితో ఉన్నారు. మెగా పవర్ స్టార్ రాం చరణ్, ఎన్.టి.ఆర్ హీరోలుగా, బాలీవుడ్, హాలీవుడ్, సౌత్ స్టార్స్ నటించిన ఈ సినిమా జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కావాల్సింది ఆగిపోయింది. మళ్ళీ సమ్మర్ కానుకగా షెడ్యూల్ చేసే అవకాశాలున్నాయని టాక్ వినిపిస్తోంది. అయితే రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పనులు మొదలు పెట్టినట్టు లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Rajamouli: బాలీవుడ్‌లో బాహుబలికి 100 రెట్ల హిట్ సాధించే చిత్రంగా..!

వాస్తవంగా అయితే రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ అనగానే అందరూ మహేశ్ బాబుతోనే అని ఎగ్జైట్ అవుతారు. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ తర్వాత మొదలవ్వాల్సిన సినిమా ఇదే కాబట్టి. కానీ, దీనికంటే ముందే జక్కన్న బాలీవుడ్‌లో రన్‌బీర్ కపూర్‌తో ఓ సినిమాను చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అంతేకాదు ఈ సినిమాను బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాల మాదిరిగా భారీ బడ్జెట్‌తో కాకుండా తెలుగులో సునీల్ హీరోగా ఆయన తెరకెక్కించిన మర్యాద రామన్న సినిమా తరహాలో ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాతోనూ బాలీవుడ్‌లో బాహుబలికి 100 రెట్ల హిట్ సాధించే చిత్రంగా రూపొంధించడానికి ప్లాన్ చేస్తున్నారట. చూడాలి మరి దీనికి సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందో.


Share

Related posts

Madhuri Dixit Beautiful Looks

Gallery Desk

జూమ్ ఆఫర్ చూశారంటే కళ్ళు తిరుగుతాయ్.. అలా ఉంది ఆఫర్!

Teja

Visakha Steel plant : ఏపి సీఎం వైఎస్ జగన్‌కు మాజీ మంత్రి గంటా మరో లేఖ..! ఎందుకంటే..?

somaraju sharma