Raviteja: పవర్ఫుల్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు మాస్ మహారాజ రవితేజ. ఇటీవల ఖిలాడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు రవితేజ. బాలీవుడ్లో కూడా ఈ మూవీ తో ఎంట్రీ ఇచ్చారు. కానీ, భారీ అంచనాల మధ్య వచ్చిన ఖిలాడి ఆయనకు హిట్ ఇవ్వలేకపోయింది. అయినా, దూకుడుగా కమిటయిన సినిమాలను కంప్లీట్ చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం చేతిలో నాలుగు సినిమాలున్నాయి. రామారావూ ఆన్‌డ్యూటీ.. ధమాకా, రావణాసుర, టైగర్ నాగేశ్వ రావు..అలాగే మెగాస్టార్ చిరంజీవితో కలిసి బాబి దర్శకత్వంలో చేస్తున్న సినిమా. ఇవన్నీ వరుసగా షూటింగ్ జరుపుకుంటున్నాయి.
వీలైతే ఈ సినిమాలలో కనీసం ఓ రెండైనా ఇదే ఏడాది రిలీజ్ చేయాలని గట్టిగా ట్రై చేస్తున్నారు. ఈ క్రమంలోనే రామారావు ఆన్‌డ్యూటీ సినిమా నుంచి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు మాస్ మహారాజ. కొత్త దర్శకుడు శరత్ మండవ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా స్పెషల్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ అండ్ స్పెషల్ పోస్టర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ క్రమంలోనే టీజర్ రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు.
Raviteja: రవితేజ కూడా నిర్మాణంలో భాగస్వామి..!
త్వరలో రానున్న మహా శివరాత్రి పండుగ సందర్భంగా మార్చి 1న టీజర్ రాబోతోందని మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఈ సందర్భంగా వదిలిన ఓ మాసివ్ పోస్టర్ మాస్ రాజా అభిమానులనే కాకుండా అందరినీ ఆకట్టుకుంటోంది. ‘రామారావు ఆన్ డ్యూటీ’ మూవీలో రవితేజ ప్రభుత్వోద్యోగిగా నటిస్తున్నారు. ఇక ఇందులో మజిలీ ఫేమ్ దివ్యాంశ కౌశిక్ – రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే, ఈ సినిమా ద్వారా వేణు తొట్టెంపూడి కీలక పాత్ర పోషిస్తు మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తున్నారు. ప్రముఖ నటీనటులు నాజర్ – నరేష్ – పవిత్ర లోకేష్ – తనికెళ్ళ భరణి – రాహుల్ రామకృష్ణ తదితరులు ఇతర కీలక పాత్రల్లో సందడి చేయనున్నారు. ఇక ఈ సినిమాకు రవితేజ కూడా నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరిస్తుండటం విశేషం.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!