న్యూస్ సినిమా

Varun tej: ‘గని’ ట్రైలర్ టాక్..మెగా ప్రిన్స్ ఖాతాలో మరో హిట్..

Share

Varun tej: గని ట్రైలర్ టాక్..మెగా ప్రిన్స్ ఖాతాలో మరో హిట్..అని మెగా అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ కూడా చెప్పుకుంటున్నారు. తాజాగా వరుణ్ తేజ్ హీరోగా నటించిన గని సినిమా నుంచి థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. గద్దల కొండ గణేశ్ సినిమాతో సూపర్ హిట్  అందుకున్న వరుణ్ ఆ తర్వాత గని సినిమాతో రావాల్సింది. కానీ, కోవిడ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ దశలోనే ఆగిపోయింది. ఇక గత ఏడాది నుంచి విడుదల పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది గని సినిమా.

varun-tej-is going to get another hit by ghani
varun-tej-is going to get another hit by ghani

గత ఏడాది డిసెంబర్ నెలలో రెండుసార్లు రిలీజ్ చేయాలనుకుంటే అఖండ, పుష్ప సినిమాల కారణంగా వాయిదా వేశారు. ఇక ఇప్పుడు అన్నీ కార్యక్రమాలను కంప్లీట్ చేసుకొని ఏప్రిల్ 8వ తేదీన భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ సొంత నిర్మాణ సంస్థ రినైసెన్స్ పిక్చర్స్ బ్యానర్ లో సిద్దు ముద్దతో కలిసి అల్లు ఈ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

Varun tej: మదర్ సెంటిమెంట్‌తో ఈ సినిమాను  తెరకెక్కించినట్టు తెలుస్తోంది.

గని సినిమా ద్వారా కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్‌గా నటించారు. బాలీవుడ్ యంగ్ బ్యూటీ సాయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించింది. ఇతర ముఖ్య పాత్రల్లో జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవిన్ చంద్ర, నదియ కనిపించబోతున్నారు. తమన్నా ఐటెం సాంగ్‌లో మెరవబోతోంది. ఇక ఈ మూవీకి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించాడు. మదర్ సెంటిమెంట్‌తో ఈ సినిమాను తెరకెక్కించినట్టు తెలుస్తోంది. మొత్తంగా ట్రైలర్ చూస్తే గ్యారెంటీగా వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ గ్యారెంటీ అనిపిస్తోంది.


Share

Related posts

BSNL కొత్త ఆఫర్లు అదరహో..!! 365 రిచార్జీతో కొత్త ప్లాన్..!!

bharani jella

Arjun rampal: పిల్లాడ్ని కని, పెళ్లి అంటే నో చెబుతున్న అర్జున్ రామ్ పాల్!

Ram

Mega Daughters : చీరలో మెరిసిపోతున్న మెగా డాటర్స్… ఫోటోలు వైరల్!

Teja
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar