Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి నటించిన చిత్రం భీమ్లా నాయక్ రిలీజై 20 రోజులు కావస్తున్నా థియేటర్లలో ఇంకా సందడి చేస్తోంది. ఫిబ్రవరి 25న విడుదలైన ఈ సినిమా రూ.200 కోట్ల వసూళ్ల లక్ష్యానికి అతి సమీపంగా చేరుకుంది. మొదటి మూడు రోజుల్లోనే రూ.100 కోట్లు వసూలు చేసుకోగా.. ఆ తర్వాత నెమ్మదించిన వసూళ్లు మెల్లగా పెరిగాయి. ఈ వారంలోనే రూ.200 కోట్ల మార్క్ ను ఈజీగా చేరిపోతుందని టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
Bheemla Nayak: భీమ్లా నాయక్ రెండోసారి బరిలోకి దిగితే ఎలా ఉంటుందో తెలుసా?
Bheemla Nayak: వారం వారం లెక్కలు:
సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించిన భీమ్లా నాయక్ సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఇక లెక్కల్లోకి వెళ్తే, ట్రేడ్ అనలిస్ట్ మనోబాల విజయన్ లెక్కల ప్రకారం.. ఇప్పటి వరకు ఈ సినిమా రూ.193.04 కోట్లను వసూలు చేసింది. మొదటి వారంలో రూ.170.74 కోట్లు వసూలు చేయగా, 2వ వారంలో రూ.16.30 కోట్లు రాబట్టుకుంది. ఇక 3వ వారంలో మొదటి రోజు రూ.1.39 కోట్లు వసూలు చేయగా, రెండో రోజు రూ.1.54 కోట్లు, మూడో రోజు రూ.1.67 కోట్లు, నాలుగో రోజు రూ.0.40 కోట్లు వసూలు చేసింది.
Bheemla Naayak: “బీమ్లా నాయక్” థియేటర్ బయట అతి చేసిన పవన్ ఫ్యాన్స్ పై పోలీసులు కేసు నమోదు..!!
మొత్తంగా చూస్తే..
నేటికి ఈ చిత్రం విడుదలై పూర్తిగా 20 రోజులు పూర్తవుతున్న తరుణంలో ఈరోజుటికి అనగా 17వ తేదీన చూసుకుంటే మొత్తం రూ.193.04 కోట్లు వసూలు అయినట్టు తెలుస్తోంది. ఇక మరో వారంలో కాలిక్యులేషన్స్ ని గాని చూసుకుంటే ట్రేడ్ అనలిస్ట్ మనోబాల విజయన్ లెక్కల ప్రకారం… 200కోట్లు మార్కుని దాటుతుందని ఓ అంచనా. దాంతో విషయం తెలిసిన పవన్ అభిమానులు మాత్రం తెగ సంబరాలు చేసుకుంటున్నారు.