Akshaya Tritiya: సాధారణంగా హిందూ సాంప్రదాయం ప్రకారం మనము ఎన్నో రకాల పూజలను చేస్తుంటాము. పలు రకాల దేవుళ్లను పూజిస్తూ ఆరోగ్యంగా ,ఆనందంగా అలాగే ధన ప్రాప్తి కలగాలని పూజలు చేస్తూ లక్ష్మీ దేవతను ఆరాధిస్తూ ఉంటాము. అయితే అక్షయ తృతీయ రోజు కూడా మనం లక్ష్మీదేవికి పూజలు చేస్తాం. అయితే ఒక్క లక్ష్మీదేవికే కాదు కుబేరుడికి కూడా పూజలు చేస్తే.. మంచి ఫలితాలు అందుతాయని పురోహితులు చెబుతున్నారు.

సాధారణంగా అక్షయ తృతీయ రోజు కాస్తయినా బంగారం కొంటే దానివల్ల మన ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని ప్రతి ఒక్కరూ అపోహ పడుతూ ఉంటారు. కానీ నిజానికి లక్ష్మీదేవి ప్రసన్నం కావటానికి కుబేర పూజలు చాలా సహాయపడతాయ ని సమాచారం. చాలామంది ఎంత కష్టపడినా వారు అనుకున్న పనులు జరగవు అలాంటివారికి అక్షయ తృతీయ రోజు ఇలా లక్ష్మీదేవి కుబేర పూజలు చేస్తే మంచి అనుగ్రహం కలుగుతుందట
అయితే అక్షయ తృతీయ రోజు ఆ పూజలు ఎలా చేయాలి. ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా లక్ష్మీదేవి కుబేరుడు ఉన్న చిత్రాన్ని తీసుకొని ఒక ప్లేట్లో రెండు రూపాయల నాణ్యాలు ఒక లక్ష్మీకాసు, తాంబూలం, పంచామృతం, పండ్లు పాయసం, దద్దోజనం, కలశం, ఇవన్నీ సిద్ధం చేసుకోవాలి.
ఇక అక్షయ తృతీయ రోజు ఉదయాన్నే నిద్ర లేచి ఇంట్లో ఉన్న వారంతా స్నానం చేసి వాకిలి శుభ్రం చేసుకుని పూజ గదిని సిద్ధం చేసుకోవాలి. ఒకదానిపై కుబేర ముగ్గు వేసి పసుపు కుంకుమలు ఉంచాలి. ఆ ముగ్గుపై పీఠం వేసి ముందు చెప్పిన పటమును ఉంచాలి. ముందుగా ఒక ఆకు వేసుకొని పసుపు గణపతి చేసుకోవాలి. ఆ తరువాత ఒక ప్లేట్లో లక్ష్మీకాసు కుబేరుడు చిత్రావతి ప్రతిరూపంగా రూపాయి నాణెలు ఉంచి పూజ జరిపించాలి.ఇక అన్ని సిద్ధం చేసుకున్న తరువాత మనకున్న కోరికలను ఆ దేవుడి ముందు అనుకుంటూ నెరవేరుతుందనే సంకల్పంతో కంకణం కట్టుకోవాలి. ఆ తర్వాత లక్ష్మి అష్టోత్తర పూజ కుబేర మంత్రాలు జరిపించాలి.