Wealth: పుట్టిన వెంటనే ఎవరు కోటీశ్వరులు కాదు. మన ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం ఉండాలంటే నిత్యం పూజలు చేస్తూ ఆర్థిక ఇబ్బందులను పోగొట్టుకోవాలి. మన ఇంటికి ధనం, డబ్బు రావాలంటే ఒక ధనలక్ష్మినే కాకుండా వరాహి దేవి అనగా శ్రీ మహావిష్ణువు అవతారం అలాగే భైరవపత్ని ఈమెకి కూడా మనం పూజలు చేస్తే మన కలలు అన్నీ నెరవేరుతాయి.

వరాహి దేవిని కొలిచే వారికి కొంగు బంగారంలా సర్వం సిద్ధిస్తుందని ఎలాంటి లోటు కూడా ఉండదని ఆమెని ఇంట్లో పూజిస్తే జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులను అయినా ఎదుర్కోవచ్చని చెబుతుంటారు. ఇక ముఖ్యంగా అనారోగ్య సమస్యలు.. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అవన్నీ మటుమాయమైతాయని వరాహి దేవికి ఇలాంటి చిన్నపాటి పరిహారాలు చేస్తే సరిపోతుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.
మామూలుగా అయితే రోజు ఒక దేవుడిని ఆరాధిస్తూ ఉంటాము. కానీ ఈ అమ్మకు అలా కాదు ఏరోజైనా ఈమెని మనం పూజించవచ్చు. అయితే ఈ పరిహారాన్ని ఏడు రోజులపాటు వరుసగా చేయాల్సి ఉంటుంది ఇలా చేస్తే మనకు నెరవేరని కోరికలన్నీ నెరవేరుతాయి.
ఆ అమ్మవారికి ఎలాంటి పరాహారాలు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం చేసే రోజు ఇల్లు మొత్తం శుభ్రం చేసుకుని ఇంట్లో ఉన్న వారంతా స్నానాలు ఆచరించి పూజకు పుష్పాలు సిద్ధం చేసుకోవాలి. ఆ తరువాత సంధ్యా పూజలు ముగించుకుని.. ఇక రాత్రి పది గంటల నుండి 11 గంటల వరకు ఈ పరిహారాన్ని చేస్తూ ఉండాలి.
ముందుగా పరిహారానికి కావలసినవి గుప్పెడు రాళ్ల ఉప్పు, 9 మిరియాలు ఆ తరువాత తొడిమెలు లేని తమలపాకులు అవన్నీ పెట్టిన పాత్రను వరాహి దేవి ముందు ఉంచి ఆమె ముందు స్వచ్ఛమైన నేతితో ప్రమిదను వెలిగించాలి . ఇలా ప్రతిరోజు తరచూ రాత్రి నెయ్యితో వెలిగిస్తే మంచిది. ఒకవేళ తమలపాకులు వాడిపోయే అవకాశం ఉంటే తమలపాకును తాజాగా మార్చవచ్చు. ఇక ఉప్పును మిరియాలను ఏడు రోజుల వరకు మార్చనవసరం లేదు. వీటన్నిటినీ పాటిస్తే వరాహి దేవి అనుగ్రహం మన మీద ఉంటుంది.