ఏడోరోజు రాత్రి చంద్రప్రభ వాహనం !

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజు రాత్రి మలయప్పస్వామి చంద్రప్రభ వాహనంపై విహరించారు.భక్తులకు కనువిందు చేశాడు.

చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీవారికి వాహనంగా ఉండడం విశేషం. చంద్రోదయం కాగానే కలువలు వికసిస్తాయి. సాగరుడు ఉప్పొంగుతాడు. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. భక్తుల కళ్లు కలువల్లా వికసిస్తాయి. భక్తుల హృదయాల నుంచి అనందరసం స్రవిస్తుంది.