దోమలతో బాధపడుతున్నారా? అయితే ఈ చిట్కాలు పాటించండి!

కాలం ఏదైనా సరే మన ఇంటి పరిసరాలలో అపరిశుభ్రంగా ఉంటే, దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. దోమలు కుట్టడం వల్ల ఎన్నో వ్యాధులు వస్తాయ్. మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడతారు. అయితే దోమల నుంచి విముక్తి పొందడానికి మనకి మార్కెట్లో ఎన్నో రకాల రసాయనాలతో కూడిన స్ప్రేలు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిని వాడడం వల్ల కొందరిలో అలర్జీ వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి ఇబ్బందులు లేకుండా, కొన్ని చిట్కాలతో దోమలను ఇంట్లో నుంచి తరిమి వేయొచ్చు. మరి ఆ చిట్కాలేంటో ఇక్కడ తెలుసుకుందాం…

 

వెల్లుల్లి..

వెల్లుల్లి వాసన అంటే మనుషులకే కాదు దోమలు కూడా నచ్చదు. వెల్లుల్లి రెబ్బలను మెత్తగా దంచి, దోమలు ఎక్కువగా ఉన్న ప్రదేశం చోట కొద్దికొద్దిగా పెట్టడం ద్వారా దోమలు ఇంట్లో నుంచి వెళ్లి పోతాయి.

కర్పూరం..

కొద్దిగా ఉంట కర్పూరం తీసుకొని దానిని వెలిగించి 30 నిమిషాలపాటు తలుపులన్నీ మూసి వేయాలి. తర్వాత తలుపులు తెరిస్తే ఒక్క దోమ కూడా ఇంట్లో లేకుండా బయటకు వెళ్తాయి. అంతేకాకుండా చిన్న గ్లాస్ లో నీటిని తీసుకొని అందులో కొద్దిగా కర్పూరం వేసి దోమలు ఉన్న చోట పెట్టడం వల్ల దోమల బెడద తప్పుతుంది.

తులసి నూనె..

తులసి చెట్టు ప్రతి ఒక్కరి ఇంట్లో కనిపించే పవిత్రమైన మొక్క. తులసి ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయనే విషయం అందరికీ తెలిసిందే. అయితే తులసి ఆకుల నుండి తయారు చేసిన నూనెను దోమలు ఎక్కువగా ఉన్న చోట స్ప్రే చేయడం ద్వారా ఒక్క దోమ కూడా ఇంట్లో ఉండదు.

పిప్పరమెంటు నూనె..

పిప్పరమెంటు నూనెలో కొద్దిగా కాటన్ ను ముంచి, దోమలు ఉన్న చోట పెట్టడం వల్ల దోమల సమస్య ఉండదు. అంతేకాకుండ పిప్పరమెంటు నూనెలో శీతలీకరణ సంచలనం ఉంటుంది. ఇది మీ శరీరాన్ని దురద నుండి దూరం చేస్తుంది. ప్రతిరోజు సాయంత్రం పూట దోమలు ఎక్కువగా ఇళ్లల్లోకి వస్తాయి కాబట్టి, సాయంత్రం అయ్యేసరికి కిటికీలు తలుపులు మూసి వేయడం ఎంతో సురక్షితం. అంతేకాకుండా దోమ తెరలు వంటి వాటిని వాడటం ద్వారా దోమలను అరికట్టవచ్చు. ఇంకెందుకు ఆలస్యం ఈ సులభమైన చిట్కాలను ఉపయోగించి, దోమల నుంచి విముక్తి పొందండి.