NewsOrbit
దైవం

ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం విశేషాలు ఇవే !

ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం… ఇప్పుడు నిర్మించిది కాదు. వందల ఏండ్ల కింద నిర్మించిన దేవాలయం. టెక్నాలజీ అందుబాటులో లేని సమయంలో నిర్మించిన అతిపెద్ద కట్టడం. ప్రస్తుత సాంకేతికతకు తీసిపోని టెక్నాలజీతో నిర్మించి అతిపెద్ద దేవాలయం ఇది. దీనికి సంబంధించిన విశేషాలు తెలుసుకుందాం…

500 ఎకరాల విస్తీర్ణం.. 65 మీటర్ల ఎత్తయిన భారీ శిఖరం.. చుట్టూ మరిన్ని శిఖరాలతో కూడిన ఆలయ సముదాయం.. అద్భుతమైన శిల్పకళ.. పచ్చని కళతో, నీటి గలగలలు.. ఇవన్నీ ప్రపంచంలోనే అత్యంత పెద్ద దేవాలయమైన అంగ్ కోర్ వాట్ ప్రత్యేకతలు. వందల ఏళ్ల కిందటి ఈ అద్భుత దేవాలయం ఉన్నది భారతదేశంలో మాత్రం కాదు.. కాంబోడియాలో. ఎన్నో వింతలకు, అద్భుతమైన విశేషాలకు నిలయమైన ఈ అంగ్ కోర్ వాట్ దేవాలయం.
కాంభోజ రాజ్యం
ప్రస్తుతం కాంబోడియాలో ఉన్న అంగ్ కోర్ వాట్ ఆలయం.. క్రీస్తుశకం వెయ్యో శతాబ్దానికి చెందిన ప్రఖ్యాత ఖ్మేర్ సామ్రాజ్యంలో భాగం. ఆ సామ్రాజ్యం రాజధాని నగరం పేరు కూడా అంగ్ కోర్. తొలుత ఈ సామ్రాజ్యాన్ని ఇతరులు పాలించినా.. అనంతరం హిందూ రాజుల పరిపాలనలోకి వచ్చింది. దీనిని కాంభోజ రాజ్యంగా పేర్కొనేవారు. యురోపియన్ల వలసల అనంతరం కాంబోడియాగా మారింది. అంగ్ కోర్ వాట్ ఆలయాన్ని నిర్మించిన రాజు పేరు సూర్యవర్మన్-2. ఆయన విష్ణుమూర్తి ఆరాధకుడు.

ప్రపంచంలోనే అతి పెద్ద నగరం ఇదే !
అంగ్ కోర్ నగరంలో అప్పట్లోనే ఇక్కడ పది లక్షల మంది వరకు నివసించినట్టు చరిత్ర పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఆ లెక్కన 19వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం వచ్చే నాటికి కూడా ప్రపంచంలో అతిపెద్ద నగరం అంగ్ కోర్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా కేవలం నగర ప్రధాన ప్రాంతంలోనే ఏకంగా 5 లక్షల మంది నివసించినట్టుగా గుర్తించారు. అంగ్ కోర్ వాట్ కు సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ‘మహేంద్ర పర్వత’గా పిలిచే మరో పెద్ద నగరం అవశేషాలను కూడా గుర్తించారు. ప్రస్తుతం అంగ్ కోర్ వాట్ ప్రాంతాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించి రక్షిస్తోంది.

మేరు పర్వతాన్ని మరిపించేలా..
హిందూ పురాణాల్లో పేర్కొన్న మేరు పర్వతాన్ని తలపించేలా అంగ్ కోర్ వాట్ దేవాలయాన్ని నిర్మించారు. హిమాలయాల అవతల ఉండే మేరు పర్వతం దేవతల నివాసంగా పురాణాలు పేర్కొన్నాయి. అంగ్ కోర్ వాట్ ప్రధాన దేవాలయంపై మధ్యలో 213 అడుగుల (65 మీటర్ల) ఎత్తయిన భారీ గోపురంతోపాటు దానికి నాలుగు పక్కలా కొంత చిన్నగా మరో నాలుగు గోపురాలు ఉన్నాయి. ప్రధాన ఆలయానికి చుట్టూ పలు చిన్న ఆలయాలు ఉన్నాయి.
– దేవాలయం చుట్టూ అతిపెద్ద నీటి కందకం ఉండటం ఈ ఆలయ విశేషాల్లో ఒకటి. ఏకంగా 650 అడుగుల (200 మీటర్లు) వెడల్పుతో 13 అడుగుల (నాలుగు మీటర్ల) లోతుతో ఆలయం చుట్టూరా ఉన్న ఈ కందకం ఎప్పుడూ నీటితో నిండి ఉంటుంది. దీని మొత్తం చుట్టుకొలత ఏకంగా ఐదు కిలోమీటర్లకు పైనే ఉండడం గమనార్హం.
– ఆలయానికి పశ్చిమ, తూర్పు దిశల్లో ప్రవేశ మార్గాలు ఉన్నాయి. ప్రవేశించే చోట రాజగోపురాలు ఏర్పాటు చేశారు. ఇందులో పశ్చిమ ద్వారాన్ని ప్రధాన ద్వారంగా భావిస్తారు. ఈ ద్వారానికి ఇరువైపులా గంభీరంగా సింహాల శిల్పాలు ఉంటాయి. ద్వారం నుంచి ప్రధాన ఆలయం వరకు రాతి కట్టడంతో మార్గాన్ని ఏర్పాటు చేశారు.
– ఆలయం ప్రహరీ గోడ లోపలే పలు నీటి మడుగులు కూడా ఉండటం గమనార్హం.
– ప్రధాన గోపురం కింది గదుల్లో అద్భుతమైన పెయింటింగులు ఉన్నాయి. ఖ్మేర్ సామ్రాజ్యం నాటి పరిస్థితులతో పాటు రామాయణ, మహాభారత గాథలకు సంబంధించిన దృశ్యాలను వాటిల్లో చిత్రించారు.
– అంగ్ కోర్ వాట్ ఆలయం పక్కన 12వ శతాబ్దం నాటికి చెందిన అతిపెద్ద ఇసుక రాతి నిర్మాణాన్ని పరిశోధకులు గుర్తించారు. వృత్తాకారపు ఆకృతులతో ఉన్న ఆ నిర్మాణం ఏమిటన్నది ఇప్పటికీ నిర్ధారించలేదు.
ఇది ప్రధానంగా విష్ణుమూర్తి ఆలయం. ప్రధాన ఆలయంలోని అతిపెద్ద రాజగోపురం కింద ఉన్న గదిలో భారీ విష్ణుమూర్తి విగ్రహం ఉంటుంది. అయితే ఖ్మేర్ సామ్రాజ్య పతనం అనంతర కాలంలో కాంబోడియాలో బౌద్ధం పరివ్యాప్తమైంది.ఇ క్కడ దేవాలయంలో కేవలం బుద్ధుడి ప్రతిమలను మాత్రం అదనంగా ఏర్పాటు చేశారు. తద్వారా అంగ్ కోర్ వాట్ ఆలయ రూపు దెబ్బతినకుండా ఉంది.
– శ్రీమాత
అంగోర్‌కోట్‌ వాట్‌ దేవాలయం ఫోటలు వాడగలరు

Related posts

May 6: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 6: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 5: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 5:  చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 4: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 4: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 3: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 3: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 2: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 2: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 1: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 1: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 30: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 30 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 29 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 28 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 27 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju