Money: మీ ఇంట్లో బీరువా ఎక్కడ ఉంది.. అలాగే ఆ బీరువాపై ఏమేమి ఉన్నాయి. అంతేకాకుండా బీరువాపై ఏమేమి ఉంచకూడదు. అనే విషయాలు చాలామందికి తెలియదు. వాస్తు ప్రకారం బీరువా ఎటు సైడ్ ఉండాలి. అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ప్రతి ఇంట్లో బీరువా నైరుతి లోనే ఉండాలి. అంటే దక్షిణానికి పడమరకు మధ్య ఉండే ప్రదేశంలో బీరువా డోర్ ఓపెన్ చేయగానే అది ఉత్తరం వైపు చూస్తూ ఉండాలి.

ఇక బీరువాపై కనుక ఈ రెండు పెడితే ఇంట్లో డబ్బులు తాండవమాడుతూ ఉంటాయి. ధనలక్ష్మి వద్దన్నా మన ఇంట్లోనే ఉంటుంది. మనం డబ్బు, బంగారం ఆభరణాలు కీలక పత్రాలు ఇలాంటివన్నీ బీరువాలోనే సర్దుకుంటూ ఉంటాము. అలాంటి బీరువాపై లక్ష్మీదేవి అనుగ్రహం లభించాలంటే బీరువా ఓపెన్ చేయగానే మంచి సువాసన బట్టలను నీట్ గా సర్దుకోవడం ఇలా ఉంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఒకవేళ బీరువాలో బొద్దింకలు పాత బట్టల వాసన ఉన్నట్లయితే లక్ష్మీదేవి అక్కడ నివాసం చేయదు.
బీరువా పై ముఖ్యంగా ఉండవలసింది స్వస్తిక్ గుర్తు అది కూడా రివర్స్లో పెట్టకూడదు. సవ్య స్వస్తిక్ అని అవి కూడా పసుపు రంగులో కుంకుమతో బొట్లు పెట్టి ఉండాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవర్షం కురుస్తుందని వాస్తు నిపుణులు చెబుతూ ఉంటారు. ఇంకా ధనలక్ష్మి మనల్ని విడిపోకుండా ఉండాలంటే బీరువా పైన లక్ష్మీదేవి పక్కన రెండు ఏనుగులు ఉండాలి. వాటి తొండాలు ఎంత ఎత్తున ఉంటే అంత మంచిది అని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
అంతేకాకుండా బీరువాపై ఏమి ఉంచకూడదు అంటే కొంతమంది బీరువాపై డబ్బాలు, గాజు సీసాలు, పేపర్లు, పుస్తకాలు ఇలా చాలా పెడుతూ ఉంటారు. అలా బరువు ఉంచకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.