కాఫీ డే ఔట్ లెట్స్ భారీగా తగ్గింపు.. కారణాలివే

coffee day outlets reduced
Share

భారత్ లో విశేష ప్రాచుర్యం పొందిన ‘కేఫ్ కాఫీ డే’ పలు ఔట్ లెట్లను మూసి వేసింది. గత ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ కాలంలో  దాదాపు 500 ఔట్ లెట్లు మూసీసిన కంపెనీ.. ఈ ఏడాది మొదటి క్వార్టర్ లో మరో 280 మూసి వేసినట్లు తెలుస్తోంది. ఇందుకు లాభాలు తగ్గడం, ఖర్చులు పెరగడం వంటి పలు అంశాలు కారణమయ్యాయని తెలుస్తోంది. దీంతో ఈ జూన్ నెలాఖరుకు ‘కేఫ్ కాఫీ డే’ ఔట్ లెట్స్ సంఖ్య 1,480కి చేరుకుంది.

coffee day outlets reduced
coffee day outlets reduced

 

ఈ ఏడాది తొలి క్వార్టర్ కు డైలీ యావరేజ్ సేల్స్ 15,445గా ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య తగ్గడం, లాభాలు, వర్కంగ్ క్యాపిల్ రిక్వైర్ మెంట్స్, వంటి పలు అంశాలు కారణమయ్యాయని అంటున్నారు. దీంతో ఎగుమతులు కూడా నిలిపేశారు. భవిష్యత్ వ్యాపారాభివృద్ధి, మిగిలిని ఔట్ లెట్స్ లాభాల్లో నడవడం వంటి అంశాల గురించే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఔట్ లెట్స్ తగ్గినా వెండింగ్ మిషన్స్ గత క్వార్టర్ లో 49,397 ఉండగా ఈ ఏడాదికి దాదాపు 10వేలు పెరిగాయి.

గత ఏడాది సంస్థ అధినేత వీజీ సిద్ధార్ధ ఆత్మహత్య చేసుకునే సమయానికి అప్పులు రూ.4,970గా ఉన్నాయి. వాటన్నింటినీ కాఫీ డే గ్లోబల్ నాన్-కోర్ అసెట్స్ అమ్మకం ద్వారా రుణాలు క్రమంగా తీరుస్తోంది. టెక్నాలజీ బిజినెస్ పార్క్ విక్రయంపై బ్లాక్ స్టోన్ గ్రూప్ తో ఇటివల డీల్ కుదిరింది. దీంతో 13 రుణ సంస్థలకు రూ.1644 కోట్ల రుణాలు చెల్లించినట్టు కాఫీ డే తెలిపింది.


Share

Related posts

బిజినెస్: ఎస్ బీఐ కొత్త స్కీమ్.. ఎక్కువ వడ్డీ వచ్చేలా..

Muraliak

Pushpa : అల్లు అర్జున్ ‘పుష్ప’ డైలాగ్ లీక్…?

Arun BRK

జియో మార్ట్ లో అమెజాన్ వాటా కొనుగోలుకు ఆసక్తి!

Muraliak