Baahubali: బాహుబలి.. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచస్థాయికి చాటి చెప్పిన చిత్రమిది. టాలీవుడ్ మార్కెట్ ను భారీగా పెంచిన ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. అలాగే ఈ చిత్రంలో ప్రభాస్, అనుష్క, రానా, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ, నాజర్ ప్రధాన పాత్రల్లో అంతే అద్భుతంగా నటించారు. తమ తమ పాత్రలకు వంద శాతం న్యాయం చేశారు. బాహుబలి 1: ది బిగినింగ్, బాహుబలి 2: ది కన్‌క్లూజన్ అని రెండు భాగాలుగా విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని నమెదు చేసింది.
ఇండియన్ బాక్సాఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసింది. ఎన్నో రికార్డులను సృష్టించింది. బాహుబలి మూవీతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. అలాగే ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో అలరించిన ప్రతి ఒక్కరికి నేషనల్ వైడ్‌గా గుర్తింపు వచ్చింది. అయితే బాహుబలి చిత్రంలో బాగా హైలెట్ అయిన పాత్రల్లో కట్టప్ప ఒకటి. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు..? అనే లైన్ తోనే రాజమౌళి సెకండ్ పార్ట్ కు లీడ్ ఇచ్చారు.
కట్టప్పగా సత్యరాజ్ తెరపై అదరగొట్టేశారు. యాక్షన్ సన్నివేశాల్లోనే కాకుండా ఎమోషనల్ సీన్స్ లోనూ ఆయన తన నటనా చాతూర్యాన్ని ఎంతో చక్కగా ప్రదర్శించారు. కట్టప్పగా తనను తప్పా మరొకరిని ఊహించుకోలేరు అన్న రీతలో సత్యరాజ్ యాక్ట్ చేశారు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. కట్టప్ప క్యారెక్టర్ కు ఫస్ట్ ఛాయిస్ సత్యరాజ్ కాదు.
అవును, మొదట రాజమౌళి కట్టప్ప కోసం బాలీవుడ్ కు చెందిన ఓ సీనియర్ స్టార్ హీరోను సంప్రదించారట. కానీ సదరు నటుడు కట్టప్ప క్యారెక్టర్ ను రిజెక్ట్ చేశారు. ఇంతకీ ఆ నటుడు మరెవరో కాదు సంజయ్ దత్. ఆయన నో చెప్పడంతో రాజమౌళి కట్టప్పగా సత్యరాజ్‌ను ఎంచుకున్నారు. బాహుబలి మూవీతో సత్యరాజ్ తెలుగువారికి మరింత చేరువయ్యాడు. ఈ చిత్రం ఆయన ఇమేజ్ ను ట్రిపుల్ చేసింది. కాగా, సంజయ్ దత్ విషయానికి వస్తే.. ఒకప్పుడు హీరోగా వందల చిత్రాల్లో నటించిన ఆయన ప్రస్తుతం విలన్ గా, సహాయక నటుడిగా అలరిస్తున్నారు. తెలుగులో ఇప్పుడు రామ్ డబుల్ ఇస్మార్ట్ లో ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు.