Thulasivanam OTT release: అక్షయ్, ఐశ్వర్య, వెంకటేష్ కాకమాను, విష్ణు ప్రధాన పాత్రలలో నటించిన లేటెస్ట్ తెలుగు వెబ్ సిరీస్ ” తులసీవనం “. భారీ హైప్స్ తో రిలీజ్ అయిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ కి అనిల్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఇక తాజాగా ఈ మూవీ యొక్క ట్రైలర్ లాంచ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ బట్టి ఈ మూవీలో రొమాంటిక్ సన్నివేశాలతో పాటు క్రికెట్ కి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు కూడా ఉండరున్నట్లు తెలుస్తుంది.
” జనరల్ గా మైండ్ కి క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా.. అవి ఇట్లా అనగానే అట్లా జరిగిపోతాయి ” అనే మాటల మధ్య మొదలైన ఈ ట్రైలర్ ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. ఫ్యామిలీ ఎమోషన్స్, ఫ్రెండ్షిప్, లవ్, కామెడీ మరియు రొమాంటిక్ కథాంశంతో ఈ సిరీస్ తెరకెక్కనున్నాయి. ఇక ఈ సిరీస్ యొక్క ట్రైలర్ లో స్ట్రీట్ క్రికెట్ టోర్నమెంట్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ప్రతి ఒక్కరిని కడుపుబ్బ నవ్వించాయి. ఇక ఈ సిరీస్ ను రూపొందించిన అనిల్ రెడ్డి కూడా న్యూ ఏజ్ కంటెంట్ ను అద్భుతంగా ప్రజెంట్ చేశారు.
స్మరన్ నేపద్య సంగీతం ఫన్నీ మరింత ఎలివేట్ చేయగా.. ప్రేమ్ సాగర్ కెమెరా పనితనం మరింత ప్లస్ అయింది. అదేవిధంగా రవితేజ గిరిజాల ఎడిటింగ్ అద్భుతంగా ఉంది. మొత్తానికి ట్రైలర్ తో అయితే తులసివనం సిరీస్ పై మరింత క్యూరియాసిటీని పెంచేశారు. ఇక ట్రైలర్ యొక్క ఆఖరిలో..” చెన్నై ఎప్పుడైనా ఓడిపోవడం చూసావా రా.. అది ఆర్సీబీపై..సాలా కప్ నమ్ దే ” అనే డైలాగ్ ప్రతి ఒక్కరిని ఆకర్షించింది.
ఇక ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ సమస్త ఈటీవీ విన్ లో మార్చ్ 21 నుంచి స్ట్రీమింగ్ కి రానున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే ఈ మూవీ యొక్క రిలీజ్ డేట్ దగ్గర పడడంతో గ్రాండ్ ప్రమోషన్స్ ని ఏర్పాటు చేస్తున్నారు మేకర్స్. ఇక ఈ సిరీస్ లో నటించిన ప్రతి ఒక్కరి యాక్ట్రెస్ పై కూడా ప్రేక్షకుల కళ్ళు మల్లాయి. ఇక ఈ సిరీస్ కనుక రిలీజ్ అనంతరం సూపర్ హిట్ టాక్ అందుకుంటే ఇందులో నటించిన ప్రతి యాక్టర్ కి కూడా మంచి అవకాశాలు వస్తాయని చెప్పుకోవచ్చు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!