Gunde Ninda Gudigantalu Episode 36: పార్వతి మీ ఇప్పుడు మేమున్న పరిస్థితులు పెళ్లి ఖర్చులు కూడా భరించే అంత స్తోమత మాకు లేదు అని అంటుంది పార్వతి ప్రభావతి ఓహో అయితే ఇంకేంటి ఒకటికి రెండు ఇద్దరు పిల్లల్ని కన్నారు కదా ఇలాంటి చదువుకున్న అబ్బాయిలు తెరగా దొరుకుతారని చూస్తున్నారా అని అంటుంది. సత్యం ప్రభావతి నువ్వు కాసేపు ఆపుతావా అంటాడు మీనా ప్రభావతి గారు ఇక మేము ఊరుకుంటున్నాము అని మీరు నోటికొచ్చిందల్లా మాట్లాడితే పడతాము అనుకోవద్దు మీ ఆయన సత్యం గారే మా ఇంటికి సంబందం అడిగారు మేమేమీ మీ ఇంటికి వచ్చి మీద పడి పెళ్లి చేసుకోమని అడగడం లేదే పదేపదే మా వెంట పడుతూ పెళ్లి చేసుకోమని అడిగారు అందుకే మేము ఒప్పుకున్నాం తప్ప ఏదో చదువుకున్నవాడు తేరగా దొరుకుతాడని మేము ఏమీ అనుకోవడం లేదు మమ్మల్ని అవమానించడం అనుమానించడమేమి ధ్యేయమైతే మాకి పెళ్లి ఇష్టం లేదుపార్వతి మీనా ఇలా చూడు ఎంత చక్కగా ఉన్నావే నాది స్టే తగిలేలా ఉంది అని దిష్టి చుక్క పెడుతుంది ఇదిగో మీనా నేను పెళ్లి చేసుకోమన్నానని నీకు ఇష్టం లేకపోయినా పెళ్లి కొడుకు నచ్చకపోయినా నాకోసం ఒప్పుకోవద్దు అమ్మ నీకు పెళ్లి కొడుకు నచ్చితేనే ఈ పెళ్లి జరుగుతుంది లేదంటే లేదు అని అంటుంది పార్వతి మీనా అదేంటమ్మా ముందు నేను నచ్చాలి కదా పెళ్లి వాళ్ళకి అంటుంది పార్వతి నీకేంటి కుందనపు బొమ్మలా ఉన్నావు నువ్వు ఎవరికైనా నచ్చుతావు అంటుంది పెళ్లి వాళ్ళు కారు దిగుతారు పార్వతి ఇదిగో మీనా నేను పిలిచినప్పుడు రామ్మా మీనా అంటూ లోపలికి పంపిస్తుంది ప్రభావతి కారు దిగి ఇదేనా ఆ ప్యాలెస్ అంటుంది సత్యం ప్రభావతి ఇక్కడిదాకా వచ్చాక ఏంటి ఆ మాటలు అంటాడు ప్రభావతి ఇక్కడిదాకా వచ్చింది లోపలికి వెళ్లడానికి వెనక్కి తిరిగి వెళ్లడానికి కాదు అని లోపలికి వస్తారు పార్వతి వచ్చారా అన్నయ్య రండి రండి అంటూ వారిని ఆహ్వానిస్తూ లోపలికి పిలిచి కుర్చీ వేసి కూర్చో వదిన అంటూ ప్రభావతిని అంటుంది

ఆ ఆలు లేదు సోలు లేదు అల్లుని పేరు సోమలింగం అన్నట్టు అప్పుడే వరుసలు కల్పిస్తుంది చూడు అంటూ మనసులో అనుకుంటుంది పార్వతి సుమతి అక్కను తీసుకురా పెళ్లి వారు వచ్చారు అని పిలుస్తుంది మీనా వచ్చి ఎదురుగా నిలబడుతుంది ప్రభావతి మీనా ని చూస్తూ ఆహా పరవాలేదు అందంగానే ఉంది మాట ఎలా ఉంటుందో చూద్దాం అనుకుంటుంది మనసులో పార్వతి అమ్మ మీనా పెళ్లి వాళ్ళకి టి ఇవ్వమ్మా అంటుంది మీనా వెళ్లి పెళ్లి వాళ్ళకి టి తీస్తుంది సత్యం ఒరే మనోజ్ పెళ్లి కూతుర్ని చూసుకో అంటాడు మనోజ్ తీరా చూస్తే మీనా తను గుడి దగ్గర పూల అమ్ముకునే అమ్మాయి కదా నేను కారు పూజ చేయించడానికి కల్పనతో వెళ్లిన సంగతి తనకు తెలుసు నన్ను చూసింది కదా ఏమనుకుంటుందో అని మనసులో కొంపదీసి ఆ విషయం ఇప్పుడు అమ్మానాన్న ముందు బయట పెడుతుందా ఏంటి అనుకుంటాడు పార్వతి మీనా నువ్వు కూడా అబ్బాయిని చూసుకో అమ్మ అంటుంది

మీనా మనోజ్ ని చూస్తుంది సత్యం మనోజ్ అమ్మాయి నచ్చిందా మనోజ్ నాన్న మీ ఇష్టమే నా ఇష్టం పార్వతి అమ్మ మీనా పెళ్లి కొడుకు నచ్చాడా అని అడుగుతుంది మీనా నీ ఇష్టమే నా ఇష్టం అమ్మ అంటుంది సత్యం అమ్మ మీరు ఏమైనా మాట్లాడాలి అనుకుంటే బయటికి వెళ్లి మాట్లాడుకోండి అంటాడు మనోజ్ నేనేమీ మాట్లాడేది లేదు అంటాడు మీనా నేను మాట్లాడతాను అంటుంది సత్యం అలా వెళ్లి మాట్లాడుకోండి అంటారు అలా బిల్లింగ్ పైకి వెళ్లి మీనా మనోజ్ తో మిమ్మల్ని నేను ఎక్కడో చూశానండి అని అడుగుతుంది మనోజ్ అబ్బే నన్ను మీరు ఎక్కడ చూసి ఉండరు చూసే ప్రసక్తే లేదు అని కవర్ చేస్తూ ఉంటాడు మీనా కు గుర్తు వస్తుంది మీనా అదేనండి మీరు ఒక రోజు కారు పూజ చేయించడానికి గుడికి వచ్చారు కదా ఆ రోజు వేరే అమ్మాయితో వచ్చారు. అని అంటుంది మీనా అప్పుడు మనోజ్ గుర్తుకు వచ్చింది తను నా ఫ్రెండు కారు పూజ చేస్తున్నాను నేను వస్తాను అంటూ వచ్చింది అంతేనండి ఇక దాన్ని వదిలేసేయండి అంటాడు మీనా నాది ఒక కండిషన్ పెళ్లయ్యాక నేను జాబ్ చేసే మా అమ్మ వాళ్ళని చూసుకోవాలి అందుకు మీరు ఒప్పుకోవాలి అని అంటుంది

మనోజ్ సరే అలాగే చూసుకోండి నాకేం అభ్యంతరం లేదు అంటూ కిందికి వెళతాడు మీనా ఇంత త్వరగా ఒప్పుకుంటాడని నేను అనుకోలేదు అని మనసులో సంబరపడిపోతూ తను చాలా మంచివాడు అనుకుని కిందికి వస్తుంది సత్యం మనోజ్ ఏమయింది ఓకేనా అని అడుగుతాడు మనోజ్ నాకు ఓకే నాన్న అంటాడు మీనా కూడా ఓకే చెబుతుంది సత్యం అయితే ఇంకేంటి నేను ఒక మంచి పంతులు గారికి ఫోన్ చేసి మంచి ముహూర్తం చూడమని చెబుతాను అంటాడు మీకేం అభ్యంతరం లేదు కదా అమ్మ పార్వతి అంటాడు పార్వతి అలాగే అన్నయ్య అంటుంది ప్రభావతి నాకు అభ్యంతరం ఉంది అని అంటుంది సత్యం ప్రభావతి ఏంటి నీ అభ్యంతరం అని అంటాడు ఏంటంటే ఏంటి నా కొడుకు డిగ్రీల మీద డిగ్రీలు చదువుకున్నాడు నీ కూతురేమో 10వ తరగతి చదివింది కదా నా కొడుక్కి యూఎస్ నుంచి సంబంధాలు వస్తున్నాయి ఎన్ఆర్ఐ సంబంధాలు వచ్చిన మా ఆయన మీకు మాట ఇచ్చినందుకు మేము ఆ సంబంధాలు వద్దనుకొని మీ ఇంటికి వచ్చి మీ పిల్లను చేసుకోవడానికి ఒప్పుకున్నాం. అలాంటప్పుడు పెట్టిపూతలు కానుకలు అవి ఇవి ఉంటాయి కదా అవి మాట్లాడుకోవాలి కదా అబ్బాయికి పెళ్లి కట్నంగా ఏమిస్తారు 10 తులాల బంగారమ పడవ అంత కారా ఏదో ఒకటి చెప్పండి అంటూ ప్రభావతి పార్వతిని అడుగుతుంది ప్రభావతి అన్న మాటలకు మీనా ఫ్యామిలీ షాక్ అవుతుంది సత్యం ప్రభావతి వాళ్లు అవేవీ పెట్టరు అని అన్నాను

కదా అంటాడు ప్రభావతి ఆ మీరు అంటారండి కట్నం ఎలాగో ఇవ్వట్లేదు కదా కనీసం పెట్టి పోతలన్నా పెట్టాలి కదా అని అంటుంది ప్రభావతి పార్వతి మేము అవేమీ పెట్టుకోలేమండీ అంటుంది ప్రభావతి సరే పెట్టుకోలేరు పెళ్లి ఖర్చులను భరించాలి కదా అంటుంది పార్వతి మీ ఇప్పుడు మేమున్న పరిస్థితులు పెళ్లి ఖర్చులు కూడా భరించే అంత స్తోమత మాకు లేదు అని అంటుంది పార్వతి ప్రభావతి ఓహో అయితే ఇంకేంటి ఒకటికి రెండు ఇద్దరు పిల్లల్ని కన్నారు కదా ఇలాంటి చదువుకున్న అబ్బాయిలు తెరగా దొరుకుతారని చూస్తున్నారా అని అంటుంది. సత్యం ప్రభావతి నువ్వు కాసేపు ఆపుతావా అంటాడు మీనా ప్రభావతి గారు ఇక మేము ఊరుకుంటున్నాము అని మీరు నోటికొచ్చిందల్లా మాట్లాడితే పడతాము అనుకోవద్దు మీ ఆయన సత్యం గారే మా ఇంటికి సంబందం అడిగారు మేమేమీ మీ ఇంటికి వచ్చి మీద పడి పెళ్లి చేసుకోమని అడగడం లేదే పదేపదే మా వెంట పడుతూ పెళ్లి చేసుకోమని అడిగారు అందుకే మేము ఒప్పుకున్నాం తప్ప ఏదో చదువుకున్నవాడు తేరగా దొరుకుతాడని మేము ఏమీ అనుకోవడం లేదు మమ్మల్ని అవమానించడం అనుమానించడమేమి ధ్యేయమైతే మాకి పెళ్లి ఇష్టం లేదు

మీరు ఇంకా బయలుదేర వచ్చు అంటుంది మీనా మనోజ్ అమ్మ నువ్వు కాసేపు ఆగుతావా ఒకసారి ఇలా రా అంటూ ప్రభావతిని సైడ్ కి పిలుచుకు వెళ్లి అమ్మ ఒక్కసారి నా మాట విను నాన్న పైసలు ఇచ్చేదాకా కొంచెం సైలెంట్ గా ఉండు ఈ పెళ్లి ఓకే అయితే నాన్న నాకు పైసలు ఇస్తాడు బిజినెస్ పెట్టి నేను నీ పేరు నిలబెట్టాలి అనుకుంటున్నాను అంటాడు అంటాడు మనోజ్.ప్రభావతి అమ్మో నామీద ఎంత ప్రేమ రా మనోజ్ నీకు నిన్ను కన్నడం నా భాగ్యం అనుకుంటాను రా కొంతమంది నష్ట జాతకులు ఉంటారు అదే మన ఇంట్లో ఉన్నాడు కదా ఒక నష్ట జాతకుడు బాలు వాడిలా నువ్వు మాత్రం అలా కాదురా మనోజ్ అని అంటూ సరే నీకోసం ఒప్పుకుంటున్నాను ఒక మెట్టు దిగుతున్నాను అని అంటూ ఇక ఏమీ మాట్లాడకుండా వెళ్లి సైలెంట్ గా ఉంటుంది పెళ్లికి ఒప్పుకుంటుంది సత్యం అమ్మ పార్వతి తాంబూలాలు మార్చుకుందామా అంటాడు. పార్వతి అలాగే అన్నయ్య అంటూ తాంబూలాలు మార్చుకుంటారు. ప్రభావతి నేను ఈ కుటుంబానికి చేసిన ద్రోహానికి నేను కారణం కాబట్టి నేను ఇంటి ఆడపిల్ల పెళ్లి బాధ్యత తీసుకుంటున్నాను లేదంటే జీవితాంతం నాకు ఆ బాధ మిగిలిపోతుంది ప్రభావతి అంటాడు ప్రభావతి మీ ఇష్టం మీరు ఎప్పుడు నా మాట విన్నారు కనుక మీకు ఇష్టం ఉంటేచినట్లు చేయండి అంటుంది సత్యం అమ్మ పార్వతి మీరు ప్రభావతి మాటలు ఏమీ పట్టించుకోవద్దు ఇదంతా తన కొడుకు మీద ప్రేమతో మాట్లాడుతుంది తప్ప మీ మీద కోపంతో కాదు అంటాడు. పెళ్లి ఖర్చులు పెళ్లికి కావలసినవి అన్నీ నేను చూసుకుంటాను పెళ్లి అంగరంగ వైభవంగా నేను జరిపిస్తాను అంటాడు సత్యం పార్వతి వాళ్ళ ఫ్యామిలీ సంతోషపడుతుంది