Naga Panchami 2023 Episode 205: మోక్ష ఒక బొండం కొట్టించుకొని అందులో రెండు స్ట్రాలు వేసుకొని తీసుకువస్తాడు. పంచమి ఏంటి ఈయన రెండు స్ట్రాలు వేసుకొని ఒక బోనం తీసుకు వస్తున్నాడు అని చూస్తుంది. ఏంటి పంచమి ఈ బోండా లో రెండు స్ట్రాలు వేసుకొని తీసుకువచ్చాడు ఈ అల్పాయసకుడితో కలిసి ఎంగిలి తాగాలా అని అనుకుంటున్నావా అని మోక్ష అంటాడు. మీరు అలాంటి మాటలు మాట్లాడకండి నా ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది మీరే నా ప్రాణం మోక్ష బాబు అని పంచమి అంటుంది. అంతే కానీ కలిసి మాత్రం తాగను అంటావు నేనంటే నీకు ప్రాణం అంటున్నావు నీ ఎంగిలి తాగితే నాకేమన్నా అయితుందని భయమా అని మోక్ష అంటాడు. భగవంతుడా నా ఎంగిలి విషం అని ఆయనకు తెలిసి మాట్లాడుతున్నాడో తెలియక మాట్లాడే నాకు అర్థం కావట్లేదు అని పంచమి అనుకుంటుంది. ఏంటి పంచమ నేనంటే ఇంత ప్రాణం మంటునవు నేను సంతోషంగా ఉండాలని ఎందుకు కోరుకోవు, ఎప్పుడు నీకు నా చావు భయం తప్ప నీకు మనిద్దరం సంతోషంగా ఉందామని ఎప్పుడూ అనుకోవా నీకు కోరికలే లేవా అని మోక్ష అంటాడు.

అందరి ఆడపిల్లలాగే నాకు కోరికలు ఉన్నాయి మోక్ష బాబు పిల్లల్ని కానీ వాళ్ళని పెద్ద వాళ్ళని చెయ్యాలని ఉంటుంది కానీ విధి అలా రాయలేదు అని పంచమి అంటుంది. నీ భయాల నీ పక్కన పెట్టు పంచమి ఉన్నంత కాలమైనా సంతోషంగా బ్రతుకుదాం అని మోక్ష అంటాడు. మోక్ష మాటలు విన్న పంచమి సంతోషంతో మోక్షాన్ని గట్టిగా కౌగిలించుకుంటుంది.నేను ఈ లోకంలో లేకపోయినా పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలి పంచమి అని మోక్ష అనుకుంటాడు . కట్ చేస్తే,అక్క సుబ్బు గాడు ఇంట్లో ఉన్నంతకాలం మనం మనశ్శాంతిగా ఉండలేం అక్క అతని వెళ్ళగొట్టాలి అని చిత్రం అంటుంది. ఇంట్లో మన మాట ఎవరు పట్టించుకోరు చిత్ర ఇక వైదేహి ఆంటీని మనకు దిక్కు ఆవిడకు చెప్పి పంపించేద్దాం అని జ్వాల అంటుంది. అక్క నువ్వు వెళ్లి అసుబ్బుని తీసుకురా అక్క నేను వెళ్లి పట్టుచీరలు తెచ్చి కత్తెరతో ముక్కలు ముక్కలు చేస్తాను అప్పుడు అత్తయ్య చూసి సుబ్బు ని బయటికి వెళ్ళకూడదు అని చిత్ర అంటుంది.

చిత్ర అశుబు ఎక్కడ కనిపించలేదు అని జ్వాల అంటుంది. దొరక్కపోతే ఏంటి అక్క ఈ చీరను పట్టుకొని ముక్కలు ముక్కలు చేయి అత్తయ్య చూసి వాడిని పంపించేస్తుంది అని వాళ్ళు చీరలు కట్ చేస్తూ ఉంటారు. ఇంతలో వైదేహి వచ్చి నా పట్టుచీరలు కట్ చేస్తున్నారు మీరు అసలు మనుషులేనా ఏ పాపం చేసుకుంటే నా ఇంటికి కోడలుగా వచ్చారు అని కోపంగా అనుకుంటూ వెళ్లిపోతుంది వైదేహి. నిజం చెప్పు సుబ్బు ఈ పని అంతా నీదే కదూ అని చిత్రా అంటుంది. నేనేం చేశాను అని సుబ్బు అంటాడు. కట్ చేస్తే మోక్ష ఇంట్లో వాళ్ళందరిని పిలిచి బట్టలు తీస్తాడు. ఏంటి మోక్ష బట్టల వ్యాపారం ఎప్పుడు మొదలు పెట్టావు పాములు రీసెట్టు అన్నావు అది కాకుండా ఇది చేస్తున్నావా అని చిత్రం అంటుంది. మీరు చాలా ఎక్కువ చేస్తున్నారు అసలు మీకుమాట్లాడే అర్హత లేదు అని వాళ్ళ ఆయన అంటాడు. ఇంట్లో మాకు మాట్లాడే అర్హత లేనప్పుడు రాత పోతులు పెట్టి మమ్మల్ని పంపించేయండి అని జ్వాల అంటుంది. ఎప్పుడు వాళ్ళు అలాగే మాట్లాడుతూ ఉంటారు కానీ ఈ బట్టలు ఎందుకు తెచ్చావు మోక్ష అని రఘు అంటాడు.

నా పెళ్లి రోజు వస్తుంది కదా నాన్న అందుకే ఇంటిల్లిపాదికి బట్టలు తెచ్చాను అని మోక్ష అంటాడు. మనవడా నీ పెళ్ళైఅయి సంవత్సరం అవుతుంది నాకు మనవడిని మనవరాలుని ఎప్పుడు ఇస్తావు అని శబరి అంటుంది. ఆలు లేదు సోలు లేదు అల్లుడు పేరు సోమలింగం అన్నట్టుంది మీరు చెప్పేది అని చిత్ర అంటుంది. పెళ్లిఅయి సంవత్సరం అవుతుంది ఆ విషయమే మర్చిపోయారు అని జ్వాల అంటుంది. మనకు పిల్లలు లేరని అవతలి వాళ్లకు కూడా వద్దంటావా అని వాళ్ళ ఆయన అంటాడు. మీకు పిల్లలు కావాలంటే కోట్లు సంపాదించి అప్పుడు మాట్లాడండి అని జ్వాల అంటుంది. వదిన ఎందుకు అలా మాట్లాడతావు నాకు పెళ్లి రోజు అని బట్టలు తెచ్చాను తీసుకోండి అని మోక్ష అంటాడు.

మోక్ష నేను ఒకటి తీసుకుంటున్నాను ఇంకొకటి తీసుకోవచ్చా అని చిత్ర అంటుంది. వదిన అందరికోసం అనే తెచ్చాను కావాలంటే ఎన్నైనా తీసుకో మళ్లీ తెప్పిస్తాను అని మోక్ష అంటాడు. రేయ్ పెళ్లి రోజుకి అందర్నీ పిలువమంటావా లేదంటే మనమే ఏదైనా రెస్టారెంట్ కి వెళ్దామా అని రఘు అంటాడు. ఏమీ వద్దు నాన్నా మనం ఇంట్లోనే జరుపుకుందాం అని మోక్ష అంటాడు.మోక్ష అందరికీ కలిపే తెచ్చావా పంచమికి వేరే సపరేట్గా తెచ్చావా అని వాళ్ళ అత్తయ్య అడుగుతుంది.

అత్తయ్య అందరితోపాటు పంచమికి తెచ్చాను అయినా పంచమి ఏ చీర కట్టిన అందంగానే ఉంటుంది అని మోక్ష అంటాడు. రాజు మేచ్చిందే రంభ అని నీకు నచ్చింది కాబట్టి అందంగానే కనపడుతుంది అని జ్వాలా అంటుంది. మోక్ష ఇవన్నీ పక్కన పెట్టండి నాకు మనవడిని ఇస్తానని చెప్పండి అని శబరి అంటుంది. అలాగే ఇస్తాము అని మాట ఇవ్వు పంచమి అని మోక్ష అంటాడు. పంచమి మాట్లాడకుండా అలాగే ఆలోచిస్తూ ఉంటుంది. మోక్ష పంచమి చేయి తీసుకుని శబరి చేతిలో ఒట్టు వేయిస్తాడు. పంచమి ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా వెళ్ళిపోతుంది..