NewsOrbit
Entertainment News Telugu TV Serials

Paluke Bangaramayenaa Episode 78: నది ఒడ్డున కార్యక్రమం జరుగుతుంటే జేజేలు కొడుతున్న కార్యకర్తలు

Paluke Bangaramayenaa Today Episode November 20 2023 Episode 78 Highlights
Share

Paluke Bangaramayenaa Episode 78: సరే సార్ ఇక నేను బయలుదేరుతాను ఇప్పటికే లేట్ అయిపోయింది నాన్న వాళ్ళ ఇంటి దగ్గర ఎదురు చూస్తారు అని స్వర అంటుంది.స్వర పొద్దుపోయింది ఈరోజుకి ఇక్కడే పడుకొని తెల్లారి వెళ్ళండి అమ్మ అని యశోద అంటుంది.లేదు ఆంటీ రేపు ఉదయం అమ్మ దశ దిశ కర్మ ఉన్నది వెళ్లాలి రేపటికి సామాన్లు అన్ని సర్దుకోవాలి కదా ఆంటీ అని స్వర అంటుంది. సరే స్వరా వెళ్ళు కానీ అభిషేక్ డ్రాప్ చేసి వస్తాడు అని యశోద అంటుంది. వద్దులేండి ఆంటీ ఈ టైంలో అభిషేక్ సార్ ఎందుకు  మేమిద్దరం వెళ్ళగలము కానిస్టేబుల్ ఉన్నాడు కదా అని స్వర అంటుంది. ఏంటి ఇంతలా ఆంటీ స్వరని ఉండమని అంటుంది అ ఝాన్సీ ఆలోచిస్తుంది. పర్వాలేదు స్వరా నేనే డ్రాప్ చేస్తాను కానిస్టేబుల్ ఎందుకు అని అభిషేక్ అంటాడు.

Paluke Bangaramayenaa Today Episode November 20 2023 Episode 78 Highlights
Paluke Bangaramayenaa Today Episode November 20 2023 Episode 78 Highlights

పర్వాలేదు సార్ మీరు ఇప్పటిదాకా ఆడి అలిసిపోయారు కదా రెస్ట్ తీసుకోండి రేపు మళ్లీ ఉదయం మా ఇంటికి రావాలి కదా అని స్వర అంటుంది. ఇదేంటి అభి ఇంతలా స్వరని బ్రతిమిలాడుతున్నాడు అని ఝాన్సీ అనుకుంటుంది.అలాగే జాగ్రత్తగా వెళ్లి రండి అమ్మ అని యశోద అంటుంది. అలా బయటికి వచ్చిన స్వర మళ్ళీ ఒకసారి వెనక్కి తిరిగి చూసి అభిషేక్ సార్ బయటికి ఒకసారి వస్తే బాగుండు అని మనసులో అనుకుంటుంది. ఇంతలో అభిషేక్ బయటికి వచ్చి నిలబడతాడు. అభిషేక్ ని చూసిన స్వర ఆనంద పడిపోతుంది. సార్ వెళ్లి వస్తాను అని ఆర్య అంటాడు. కట్ చేస్తే ఒరేయ్ విశాల్ ఒకసారి ఆలోచించరా స్వర ను చంపడం కంటే నువ్వు పెళ్లి చేసుకుంటే కేసు నుంచి బయట పడతావు రా నీ ఆవేశాన్ని పక్కన పెట్టు అని కళ్యాణి అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode November 20 2023 Episode 78 Highlights
Paluke Bangaramayenaa Today Episode November 20 2023 Episode 78 Highlights

అలాగే అమ్మ నాకు ఎంత కోపం వచ్చినా సరే నన్ను నేను బాదించుకుంటాను కానీ స్వరని మాత్రం ఏమీ అననమ్మ కానీ పెళ్లయిన తర్వాత నేను పెట్టే చార్జర్ కి అది చస్తూ బ్రతకాలి,భగవంతుడా ఎందుకు నన్ను బ్రతికించావు అని మొరపెట్టుకోవాలి నన్ను ఇంతలా మోసం చేసిన దాన్ని ఊరికే అలా వదిలిపెడతానమ్మా అని విశాల్ అంటాడు. భగవంతుడా వీడిని ఎలా మార్చాలి వీడిని ఎలా కాపాడుకోవాలి అని కళ్యాణి అనుకుంటుంది. కట్ చేస్తే స్వర వాళ్ళ అమ్మకి తద్దినం పెడుతూ ఉంటారు. ఇంతలో పార్టీ కార్యకర్తలు అక్కడికి వచ్చి వైజయంతి జై జై కొడతారు. వైజయంతి వాళ్ళ దగ్గరికి వెళ్లి మేడం మీరు వచ్చారా రండి అని ఆ కార్యక్రమం జరిగే దగ్గరికి తీసుకు వెళుతుంది.

Paluke Bangaramayenaa Today Episode November 20 2023 Episode 78 Highlights
Paluke Bangaramayenaa Today Episode November 20 2023 Episode 78 Highlights

చూడు వైజయంతి నాయుడు మీద పార్టీ కార్యకర్తలు అందరూ కోపంగా ఉన్నారు ఈసారి క్యాబినెట్లో నిన్నే ఎమ్మెల్యేగా నిలబెట్టాలని అనుకుంటున్నారు అని నందిని అంటుంది. అవునా మేడం చాలా థాంక్స్ అని వైజయంతి అంటుంది. మళ్లీ వైజయంతి జై జై కొడుతూ ఉంటారు. నందిని అతని ఎవరు అని అడుగుతుంది.  నాకు కాబోయే అల్లుడు మేడం అని వైజయంతి అంటుంది. వాళ్ళ మాటలన్నీ విన్న నాయుడు కార్యక్రమం పక్కన పెట్టేసి లేసి వైజయంతి చంప మీద ఒకటి  ఇస్తాడు. ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం ఏంటి మీరు మాట్లాడుతున్న మాటలు ఏంటి అసలు మీరు మనుషులేనా, సుగుణ ఉన్నంతకాలం మనశ్శాంతిగా బ్రతకనివ్వలేదు ఈ కార్యక్రమాన్ని జరిపించి మనశ్శాంతి చేకూరాలని చేయాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి మీరు ఇంత అల్లరి చేస్తున్నారు అని అంటాడు నాయుడు.

Paluke Bangaramayenaa Today Episode November 20 2023 Episode 78 Highlights
Paluke Bangaramayenaa Today Episode November 20 2023 Episode 78 Highlights

అందుకు కొట్టావా లేదంటే నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని కొట్టావా అని వైజయంతి అంటుంది. నాయుడు ఆవేశ పడకు అని నందిని అంటుంది. మేడం మీరు ఉన్నారని తెలిసినా చేయి చేసుకోవలసి వచ్చింది ప్లీజ్ మేడం వైజయంతి తో మాట్లాడాలి అనుకుంటే మీరు బయటికి వెళ్లి మాట్లాడుకోండి అని నాయుడు అంటాడు. దానితో మేడం వైజయంతి రంగరాజు విశాల్ అందరూ వెళ్ళిపోతారు. బాబు సమయం మించిపోతుంది కార్యక్రమం జరిపించాలి వచ్చి కూర్చోండి అని పంతులుగారు అంటాడు. నా మనసు ఏమి బాగోలేదు పంతులుగారు మీరే కానీ చేయండి అని నాయుడు అంటాడు. చూడండి బాబు ఎవరు చనిపోతే వారి భర్త అన్నయ్య కొడుకు పెట్టాలి ఇది మేము చేసే కర్మ కాదు బాబు అని పూజారి అంటాడు.

Paluke Bangaramayenaa Today Episode November 20 2023 Episode 78 Highlights
Paluke Bangaramayenaa Today Episode November 20 2023 Episode 78 Highlights

అయితే తలకోరి పెట్టింది స్వర తనే చేస్తుంది అని నాయుడు అంటాడు. అమ్మ వచ్చి మీరు కూర్చొని కార్యక్రమం జరిపించండి అని పంతులుగారు అంటాడు. స్వర చేత కార్యక్రమం జరిపిస్తూ ఉంటాడు పంతులుగారు. నాయుడు బాధపడుతూ వెళ్తూ ఉంటే, అభిషేక్ వెళ్లి సార్ ఎక్కడికి వెళ్తున్నారు ఆగండి అని అంటాడు. నా మనసేం బాగోలేదు అభి అలా బయటికి వెళ్లి ఇంటికి వచ్చేస్తాను  కార్యక్రమం అయిపోయిన తర్వాత స్వరని తీసుకురండి అని నాయుడు అంటాడు. సరే సార్ మీ ఇష్టం అని అభిషేక్ అంటాడు. పంతులుగారు పూజ చేయించి పిండలు గంగలో స్వర చేత కల్పిస్తాడు. దూరం నుంచి నాయుడు చూసి బాధపడుతూ ఉంటాడు. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Share

Related posts

Rajanikanth: ఇంట్రెస్టింగ్ టైటిల్ తో రజినీకాంత్ సినిమా..!!

sekhar

Intinti Gruhalakshmi:గృహలక్ష్మి సీరియల్ ‘తులసి’ ని నెటిజన్లు అంత మాట అన్నారా?

bharani jella

లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన హనీ.. తులసిని పాపకు దూరంగా ఉండమన్న సామ్రాట్..!

bharani jella