Suriya: సౌత్ సినీ పరిశ్రమలో ప్రేమించి పెళ్లి చేసుకున్న వారిలో సూర్య జ్యోతిక జంట ఒకటి. ప్రముఖ తమిళ నటుడు శివకుమార్ తనయుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పటికీ సూర్య మాత్రం స్వయంకృషి ప్రతిభతోనే ఉన్నత స్థాయికి చేరుకున్నాడు. విపరీతమైన ప్రజాదారణ పొందాడు. అలాగే జ్యోతిక గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముంబైలో జన్మించిన ఈ ముద్దుగుమ్మ సూర్య కంటే ముందే భారీ స్టార్డమ్ సంపాదించుకుంది. తెలుగు, తమిళ్ చిత్రాల్లో ప్రధానంగా నటించింది. సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం అందుకున్న హీరోయిన్లలో ఒకటిగా సత్తా చాటింది. చేతినిండా సినిమాలతో అగ్ర తారగా దూతుకుపోతున్న సమయంలోనే జ్యోతిక.. హీరోగా అప్పుడప్పుడే ఎదుగుతున్న సూర్యతో ప్రేమలో పడింది.
1999లో వచ్చిన పూవెల్లం కెట్టుపర్ చిత్రంలో సూర్య, జ్యోతిక తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత ఏడు సినిమాల్లో సూర్య, జ్యోతిక కలిసి నటించారు. పనిపై పట్ల జ్యోతికకు ఉన్న అంకితభావం, ఆమె వినయం సూర్యను బాగా ఎట్రాక్ట్ చేశాయి. అలాగే ఇతరులను సూర్య గౌరవించే తీరు జ్యోతికను ఆకట్టుకుంది. అలా తెలియకుండానే ఒకరితో ఒకరు ప్రేమలో పడ్డారు. జ్యోతిక స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో సూర్య ఆమె ఎదుట పెళ్లి ప్రపోజల్ పెట్టారు.
జ్యోతికకు కూడా ఇష్టం ఉండటంతో ఆమె ఓకే చెప్పేసింది. ఆపై పెద్దలను ఒప్పించి 2006లో సాంప్రదాయ తమిళ ఆచారాలను అనుసరించి సూర్య, జ్యోతిక వివాహం చేసుకున్నారు. సినీ తారలు ప్రేమించి పెళ్లి చేసుకోవడం చాలా కామన్. కానీ సూర్య, జ్యోతిక మాత్రం దాదాపు రెండు దశాబ్దాలుగా అన్యోన్యమైన దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. పర్ఫెక్ట్ కపుల్ కు తాము నిదర్శనం అని నిరూపించారు. సూర్య, జ్యోతిక ప్రేమకు గుర్తుగా 2007లో దియా అనే కూతురు, 2010లో దేవ్ అనే కుమారుడు జన్మించారు.
పిల్లల కోసం కొన్నాళ్లు వెండితెరకు దూరంగా ఉన్న జ్యోతిక.. ఇప్పుడు మళ్లీ నటిగా దూసుకుపోతోంది. ఇటీవలె బాలీవుడ్ లో సైతాన్ మూవీతో క్రేజీ హిట్ ను ఖాతాలో వేసుకుంది. ఈ సంగతి పక్కన పెడితే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జ్యోతిక తన భార్య సూర్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సూర్యలో ఏయే క్వాలిటీస్ తనకిష్టం.. అలాగే ఈ విషయంలో అతను తనకు నచ్చడో జ్యోతిక వివరించింది. జ్యోతిక మాట్లాడుతూ.. ఓ తండ్రిగా మరియు భర్తగా సూర్య చాలా సిన్సియర్‌గా ఉంటారు. ఆ విషయంలో అతను నాకెంతో నచ్చుతాడు. అలాగే అందరినీ సూర్య చాలా గౌరవిస్తాయి. సూర్యను నేను పెళ్లి చేసుకోవడానికి ప్రధాన కారణం అతడు నాకు ఇచ్చిన గౌరవమే అని చెప్పుకొచ్చింది.
అంతేకాకుండా సూర్యకు ఓపిక, సహనం చాలా ఎక్కువ. ఎదుట వాళ్లు చెప్పేది ఓపిగ్గా వింటారు. ఇంట్లో కూడా అంతే. అలాగే స్నేహానికి ఎంతో విలువ ఇచ్చే వ్యక్తి అతను అని జ్యోతిక తెలిపింది. ఇక వ్యక్తిగతంలో ఎంతో మంచి వ్యక్తి అయిన సూర్యలో జ్యోతికకు ఒక నచ్చని విషయం కూడా ఉందట. అదేంటో తెలిస్తే పడి పడి నవ్వుతారు. సూర్య బాత్ రూమ్ లో ఎక్కువ సమయం గడుపుతాడట. ఈ ఒక్క విషయంలో మాత్రం తనకు సూర్య నచ్చడని జ్యోతిక సరదాగా చెప్పుకొచ్చింది.
https://www.instagram.com/jyotika/?hl=en