Krishna Mukunda Murari: మురారి కారు పక్కన కూర్చుని కృష్ణ కోసం బాధపడుతూ ఉంటాడు. కృష్ణ నీ విషయంలో నువ్వు చాలా క్లారిటీగా ఉన్నావు. కానీ నువ్వే నా ప్రపంచం కృష్ణ అంటూ మురారి రోడ్డు మీద కూర్చుని బాధపడుతూ ఉంటాడు. కృష్ణ కి మురారి కాల్ చేస్తాడు. కానీ కృష్ణ ఓపి చూస్తూ ఫోన్ పట్టించుకోదు. కానీ మురారి మళ్లీ మళ్లీ కృష్ణ కి కాల్ చేస్తూనే ఉంటాడు.

అంతలో మురారి కి తన సుపీరియర్ ఆఫీసర్ ఫోన్ వస్తుంది. తనని క్యాంప్ కి వెళ్ళాలి రెడీగా ఉండమని చెబుతారు. కానీ మురారి మాటలు విన్న ఆయన ఏమైంది మురారి ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతాడు. నేను డ్యూటీ చేస్తాను అని మురారి అనగానే, సరే నేను వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకుని పంపుతా అంటాడు. అప్పుడే ఆయనతో మాట్లాడుతుండగా.. కృష్ణ తన ఫోన్ చూసుకుంటుంది. మురారి కాల్ లిస్ట్ కనిపించగానే వెంటనే కృష్ణ కాల్ బ్యాక్ చేస్తుంది. అప్పుడు కాల్ వెయిటింగ్ వస్తుంది. కృష్ణ కాల్ వెయిటింగ్ రావడం చూసి మురారి ఊపిరి పీల్చుకుంటాడు. కృష్ణ మురారి కాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.

భవాని ఆదర్శ్, మురారి ఫోటో చూస్తూ.. ఆదర్శ్ నువ్వు ఈ అమ్మని వదిలి ఎలా ఉన్నావురా, ఈ అమ్మతో మాట్లాడాలని లేదా.. ఎందుకురా ఇలా ఉన్నావు అని తనలోనే బాధ పడుతుంది. అంతలో మిలటరీ ఆఫీసర్ ఫోన్ చేసి మీకు ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్. ఆదర్శ్ కి మీ ఇంటికి రావడం, మీకు తన ఆచూకీ చెప్పడం తనకి ఇష్టం లేదు అని చెబుతారు. థ్యాంక్యూ కల్నల్ అని భవాని అంటుంది. సంతోషం తో ఆదర్శ్ రాకపోవడానికి కారణాలు గురించి ఆలోచిస్తూ ఉంటుంది భవాని. ముకుంద వాళ్ళ నాన్న శ్రీనివాస్ చెప్పిన మాటలు భవాని కి గుర్తుకు వస్తాయి. వెంటనే భవాని ముకుంద అని పెద్దగా అరుస్తూ పిలుస్తుంది. ఆ మాటకి ఇంట్లో వాళ్ళందరూ అక్కడికి వస్తారు.

భవాని ముకుందని ఎందుకు పిలిచిందా అని ఇంట్లో వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు. ముకుంద, రేవతి తప్ప ఇంక ఎవ్వరూ ఇక్కడ ఉండకూడదు అని అనగానే అంతా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఏంటి అత్తయ్య పిలిచారు అని భవాని అడుగుతుంది. ముకుందని పిలిచి నువ్వు పెళ్లికి ముందు ఎవరినైనా ప్రేమించావా అని అడుగుతుంది. ఏంటి ఏం సమాధానం చెప్పవు అని అడుగుతుంది. ఇప్పుడు నేను ఏం చేసాను. అదేంటి అత్తయ్య అలా అడుగుతున్నారు అని ముకుందా అడుగుతుంది. ప్రశ్నకి ప్రశ్న జవాబు కాదు. జవాబు చెప్పు అని భవాని ముకుందని నిలదీస్తుంది. ముకుంద ధైర్యం కూడగట్టుకుని అవును అత్తయ్య నేను ఒక అతన్ని ప్రేమిస్తున్నాను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని ముకుంద చెబుతుంది. ఆ మాటకి భవాని షాక్ అవుతుంది.

నీ ప్రేమ విషయం ఆదర్శ్ కి తెలుసా.. తెలీదు, మా ఇద్దరి మధ్య అసలు మాట్లాడుకునే సందర్భం రాలేదు అని ముకుంద అంటుంది. నువ్వు ఇప్పటికీ అతనినే లవ్ చేస్తున్నావా అని భవాని అడుగుతుంది. అడిగేది నిన్నే ముకుంద సమాధానం చెప్పు అని భవాని ముకుంద ని నిలదీస్తుంది. ముకుంద నీ మౌనమే నీ అంగీకారం అయితే ఇప్పుడే నా ఇంటి నుంచి వెళ్లిపో, నేను అతన్ని ప్రేమించింది నిజమే, మా పెళ్లి తరువాత అతన్ని , తన ప్రేమని సమాధి చేశాను అని ముకుంద భవాని కాళ్ళు పట్టుకుని ఏడుస్తుంది.

రేపటి ఎపిసోడ్ లో ముకుంద ఎవరిన్ని ప్రేమించిందో నువ్వే కనుక్కో మురారి, అతను ఎవరో తెలుసుకుని ఆదర్శ్ తో విడాకులు ఇప్పించి, తనతో ముకుంద కి పెళ్లి చేద్దాం అని భవాని మురారి తో అంటుంది.