NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: ముకుంద మాస్టర్ ప్లాన్ గురించి క్రిష్ణ, మురారి తెలుసుకుంటారా.?

Krishna Mukunda Murari Today Episode February 8 2024 Episode 388 Highlights

Krishna Mukunda Murari: బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ లో కృష్ణ ముకుందా మురారి కూడా ఒకటి.. ఈ సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సీరియల్ టిఆర్పి రేటింగ్ లో కూడా మంచి రేటింగ్ తో దూసుకెళ్తోంది.. మిగతా సీరియల్స్ కు టఫ్ కాంపిటీషన్ ఇస్తూ బెస్ట్ సీరియల్ గా నిలుస్తోంది. తాజాగా విడుదలైన ఈ సీరియల్ ప్రోమో హైలెట్స్ చూసేద్దాం..

Krishna Mukunda Murari Today Episode February 8 2024 Episode 388 Highlights
Krishna Mukunda Murari Today Episode February 8 2024 Episode 388 Highlights

ప్రస్తుతం ఈ సీరియల్ లో కృష్ణ మురారి ఎట్టకేలకు ఆదర్శ్ ను ఇంటికి తీసుకు వస్తారు. ఆదర్శ్ ఇంటికి వచ్చినా కూడా ముకుందా ముఖంలో ఏ మాత్రం సంతోషం కనిపించదు. ఇక అదే విషయాన్ని గమనించిన భవాని ముకుందతో మాట్లాడటానికి ఇష్టపడదు. కానీ ముకుంద మాత్రం ఎలాగైనా సరే భవాని మనసులో స్థానం సంపాదించుకోవాలని అనుకుంటుంది. ఇక ఆదర్శ్ కి దూరం అవడానికి ముకుంద చేసే ప్రతి ఒక్క చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తూ ఉంటాడు మధు. తాజాగా ఈ సీరియల్ లో బెస్ట్ కపుల్ కాంపిటీషన్ జరగబోతోంది. అందులో ముకుందా ఆదర్శ్ పాటిస్పేట్ చేయాలని కృష్ణా మురారి చెబుతారు. అనుకోకుండా ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ అయితే కృష్ణ వాళ్ళకి అనుకూలంగా మార్చుకొని ఆ ప్రోగ్రాం ని వాళ్లే కండక్ట్ చేద్దామని చెప్పి మురారి కి ఒక ఐడియా ని ఇస్తుంది.

Krishna Mukunda Murari Today Episode February 8 2024 Episode 388 Highlights
Krishna Mukunda Murari Today Episode February 8 2024 Episode 388 Highlights

భవాని ఆదర్శవైపు చూస్తూ నాన్న నువ్వు ఏం చేయాలనుకుంటున్నావని అడుగుతుంది. ఇంకా నేను ఏమి డిసైడ్ అవ్వలేదు అమ్మ నువ్వేం చెప్తే అదే చేస్తాను అంటే నిజంగా నేనేం చెప్పినా చేస్తానంటే చేస్తాను అని ఆదర్శ అంటాడు. అయితే కచ్చితంగా ఒకరోజు చెబుతాను నువ్వు మెంటల్గా స్ట్రాంగ్ గా ఫిట్ అయ్యావని నాకు అనిపించిన రోజు కచ్చితంగా నేను నీకు ఆ విషయాన్ని చెబుతాను అని భవాని అంటుంది. అప్పుడు సరే అని ఆదర్శ్ అంటాడు ఇక అప్పుడే కృష్ణ మురారి ఎందుకు వస్తారు. కాంపిటీషన్ కి అందరూ రెడీనా అని నందు అడుగుతుంది. అక్కడే ఉన్న మురారి కాంపిటీషన్ క్యాన్సిల్ అయింది అని చెప్తాడు. ఇక కృష్ణ అవును కాంపిటీషన్ అయితే క్యాన్సిల్ అయింది కానీ, ఆ కాంపిటీషన్ ని మనం కండక్ట్ చేస్తున్నాము అని అంటుంది. ఆదర్శ్ కి ముకుందకు ఏమీ అర్థం కాదు ఏంటి అని అడుగుతారు.

Krishna Mukunda Murari Today Episode February 8 2024 Episode 388 Highlights
Krishna Mukunda Murari Today Episode February 8 2024 Episode 388 Highlights

వాలెంటైన్స్ డే రోజు మన ఇంట్లోనే కాంపిటీషన్ జరుగుతుంది. ఎవరు బెస్ట్ కపులో మన ఇంట్లోనే నిర్ణయిస్తారు అని అంటారు. ఇక ఇప్పుడు ఏ కారణం చెప్పి కాంపిటీషన్ ఆపాలో ముకుందకి ఆదర్శ్ కి అర్థం కాదు. తను టెన్షన్ పడుతూ ఉంటుంది. సరే ఇక మీ టెన్షన్ ఆపితే మీరిద్దరూ మాకు ఎప్పుడు పార్టీ ఇస్తున్నాడు ఏంటి ఆదర్శ్ వచ్చి మూడు రోజులైంది. ఇంతవరకు పార్టీ ఇవ్వాలని తెలియదా.. కష్టపడి నిన్ను తీసుకువచ్చి ముకుందకు అప్పచెప్పాను కనీసం పార్టీ ఇవ్వరా అని కృష్ణ గొడవ చేస్తుంటే ఇక ఆదర్శ్ ముకుందా ఇద్దరు వాళ్ళిద్దరికీ పార్టీ ఇవ్వడానికి ఫిక్స్ అవుతారు అయితే త్వరగా మీరు వెళ్లి రెడీ అయ్యారండి అని కృష్ణ మురారి లను పంపిస్తారు. ఇక ఆదర్శ్ ముకుందా ఇద్దరూ వాళ్ల గదిలోకి వెళ్తారు.

Krishna Mukunda Murari Today Episode February 8 2024 Episode 388 Highlights
Krishna Mukunda Murari Today Episode February 8 2024 Episode 388 Highlights

ఆదర్శ్ త్వరగా రెడీ అయ్యారా మనం కూడా బయటకు వెళ్దాం అని ముకుందా అంటుంది. అప్పుడు ఆదర్శ్ కోపంగా బయటికి వెళ్దామంటే డస్ట్ ఎలర్జీ అని అంటావు. కాంపిటీషన్ అంటే నాకు ఇష్టం లేదని చెప్తావు. పోనీ ఈ మాటలన్నీ అందరి ముందు చెప్తావా అంటే చెప్పవు నా ఒక్కడికే ఇలా గదిలో చెప్తావు ఇప్పుడు నేను అందరి ముందుకెళ్లి ఏం చెప్పాలి అని అంటాడు. అప్పుడు ముకుంద ముందు మీరు ఈ డ్రెస్ చేంజ్ చేసుకుని రండి మనం బయటికి వెళ్దాము అని ఆగస్టు ఉంటుంది కానీ ఆదర్శ్ మురారిగా కనిపించేసరికి డస్ట్ ఎలర్జీ ఉన్న పర్వాలేదు నీతో ఇలా బయటికి వెళ్లే అవకాశం నాకు ప్రతిసారి రాదు కదా నీకోసం డస్ట్ ఎలర్జీ ఉన్నా కూడా మాస్క్ పెట్టుకోనైనా బయటికి వస్తాను.

Krishna Mukunda Murari Today Episode February 8 2024 Episode 388 Highlights
Krishna Mukunda Murari Today Episode February 8 2024 Episode 388 Highlights

కానీ ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోను అని ముకుందా అంటుంది . ముకుందా ఎదురుగా ఆదర్శ్ ఉన్నా కూడా తనకి మురారిలా కనిపించడంతో ముకుందా ఆ మాటలు విని బోల్తా పడుతుంది ఇక ముకుందా ఆదర్శ్ తో రావడానికి ఇష్టమే అని చెప్పేస్తుంది. కాసేపటి తర్వాత తేరుకుని నిజాన్ని గ్రహిస్తుంది. ఇక ముకుందా ఆదర్శ్ తో కలిసి బయటకు వెళ్లాక ఏం చేస్తుందో ఎలాంటి ప్లాన్ వేసి ఆదర్శ్ తో గడపకుండా ఉండేందుకు మాయ చేస్తుంది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. కచ్చితంగా ముకుందా అయితే ఏదో ఒక ప్లాన్ చేసి ఆదర్శ్ తో బయట కలపడానికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉంటుంది కానీ, కృష్ణ మురారిల ముందు మాత్రం ఏదో విధంగా మేనేజ్ చేస్తూ ఉంటుంది. ముకుంద ఏం చేసింది ఏ విధంగా తప్పించుకుంటుంది అనేది తెలియాలి అంటే ఈరోజు సాయంత్రం సీరియల్ ప్రసారమయ్యే వరకు వేచి చూడక తప్పదు.

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella