NewsOrbit
Entertainment News Telugu TV Serials

Kumkuma Puvvu November 04 Episode 2018: హాస్పటల్లో  ఉన్న బంటి అమ్మ వారి కుంకుమను నుదిటి మీద పెట్టినాక బ్రతుకు తాడా లేదా…..

Kumkuma Puvvu today episode November 04 2023  Episode 2018 highlights

Kumkuma Puvvu November 04 Episode 2018:  పసుపు చీర కట్టుకొని వచ్చి అంజలి. గుడి బయట నుంచి అమ్మవారి

Kumkuma Puvvu today episode November 04 2023  Episode 2018 highlights
Kumkuma Puvvu today episode November 04 2023  Episode 2018 highlights

గుడి మెట్లను మోకాళ్ళ తో నడుచుకుంటూ గుడి లోపలికి వస్తుంది. అంజలి అక్కడి నుంచి మళ్లీ తడి బట్ట స్నానం చేసి పొర్లుదండాలు పెడుతుంది అంజలి. పొర్లు దండాలు పెట్టడం అయిపోయిన తర్వాత, అంజలి అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మ జగన్మాత నా పసుపు కుంకు మలను ఎలాగైనా నువ్వే కాపాడాలి. కావాలంటే అందుకు నీకు నైవేద్యంగా నా పంచప్రాణాలను తీసుకో అని,అంటూ చేతిలో హారతి కర్పూరం వెలిగిస్తూ ఉంటుంది అంజలి. అది అంతా చూస్తున్న అరుణ్ కుమార్ అమృతలు ఎంతో బాధపడుతూ, ఏడుస్తూ అమ్మ జగన్మాత మా బంటిని ఎలాగైనా బ్రతికించు అని,వాళ్ళు కూడా అమ్మవారిని కోరుకుంటారు.తరువాత అంజలి మళ్లీ రావి చెట్టు దగ్గరికి వెళ్లి ముడుపును కడుతుంది. అమ్మ జగన్మాత ఈ మూడు ఎలాగైనా నీ దగ్గరికి చేరి నా భర్త ప్రాణాలు కాపాడితే నాకు అదే చాలు అని అంటుంది అంజలి.

Kumkuma Puvvu today episode November 04 2023  Episode 2018 highlights
Kumkuma Puvvu today episode November 04 2023  Episode 2018 highlights

 

అప్పుడు అంజలి అమ్మవారి దగ్గర ఉన్న ఆ కుంకుమను తీసుకొని నుదుటి మీద పెట్టుకొని అందులో నుంచి కొంత కుంకుమ పేపర్లో కట్టుకొని తీసుకు వెళ్లి అమృత చేతికి ఇచ్చి అమ్మ ఈ కుంకుమని బంటి నుదుటిన పెట్టు ఎలాగైనా ఆ జగన్మాత కాపాడుతుంది అని అంటుంది అంజలి. అప్పుడు అమృత అలాగేనమ్మ అంటుంది. అప్పుడు అంజలి ఎలాగైనా నేను చేసిన ఆ జగన్మాత పూజ వృధా కాదు,ఆ అమ్మవారు కానివ్వదు ఎలాగైనా నా బంటిని కాపాడుతుంది. మీరు వెళ్ళండి అని అంటుంది అంజలి. అప్పుడు అక్కడికి వచ్చిన సాగర్ అదంతా చూసి ఒసేయ్ లక్ష్మి, నువ్వు ఎవరో పరాయి ఆడదాని భర్త కోసం నీవు పొర్లు దండాలు పెట్టి పూజ చేస్తావా అని అంటాడు. ఇదంతా చూసిన నాకే సిగ్గుగా ఉంది.బయట ఎవరికి అయినా  తెలిస్తే నవ్విపోతారు సిగ్గుతో తలవంచుకొని పోతారు అని అంటాడు సాగర్. అందుకు అంజలి సాగర్ గారు నేను మంచి మాత్రమే కోరుకున్నాను అందులో తప్పు ఏముంది అని అంటుంది అంజలి.

Kumkuma Puvvu today episode November 04 2023  Episode 2018 highlights
Kumkuma Puvvu today episode November 04 2023  Episode 2018 highlights

అప్పుడు సాగర్ అంజలిని  ఆపు నీలాంటి ఆడదాన్ని పెళ్లి చేసుకోవడం తప్పు నాదే అనగానే అంజలి ఆపండి సాగర్ గారు,ఇది గుడి అని అంటుంది అంజలి.అప్పుడు అమృత అరుణ్ కుమార్ గారు అవును సాగర్ గారు ఇది గుడి అయినా అంజలి చేసిన దాంట్లో తప్పేముంది ఎదుటివారి బాగు కోసమే కదా అని అంటారు. అప్పుడు సాగర్ అయినా ఆ బంటి ఎవరే లక్ష్మి నీకు ఏమవుతాడు వాడి కోసం నీవు ఈ పూజలు వ్రతాలు ఎందుకు చేస్తున్నావు అని గట్టిగా బెదిరించి అడుగుతాడు సాగర్. అప్పుడు అంజలి ఏమి సమాధానం ఇవ్వదు. అప్పుడు సాగర్, మీరు ఏం పెద్ద మనుషులు ఇలానా బుద్ధి చెప్పేది అసలు మిమ్మల్ని కాదు మీ దగ్గరికి వచ్చినందుకు దీన్ని అనాలి ఒసేయ్ లక్ష్మి పద ఇంటికి వెళ్ళాక నా విశ్వరూపం ఏంటో చూపిస్తాను అంటూ అంజలిని చేయి పట్టుకొని తీసుకువెళ్లి కారులో ఎక్కించుకొని ఇంటికి తీసుకు వెళుతూ ఉంటాడు సాగర్.

Kumkuma Puvvu today episode November 04 2023  Episode 2018 highlights
Kumkuma Puvvu today episode November 04 2023  Episode 2018 highlights

అప్పుడు అరుణ్ కుమార్ గారు,అమృత ఈ సాగర్ ఇలా ప్రవర్తిస్తున్నాడు గుడిలోనే ఇంత బీభత్సం చేశాడంటే. ఇంటికి వెళ్ళాక అంజలిని ఏం చేస్తాడు ఏమో,నేను ఇప్పుడే వెళ్లి సాగరికి జరిగిందంతా చెప్పేస్తాను నిజం తెలిసాక అప్పుడు వాడు ఏం చేస్తాడో చూద్దాం అని అంటాడు అరుణ్ కుమార్.అప్పుడు అమృత వద్దండి అది చెప్పాలనుకుంటే అంజలి ఉంది కదా, కానీ అంజలి ఎందుకు చెప్పడం లేదో,ఎందుకు పళ్ళు బిగువున పట్టుకొని ఉంటుందో,అది మనకు తెలుసు అంజలికి తెలుసు  అని అంటుంది అమృత. కానీ మనకు ఇప్పుడు బంటి బ్రతకడం ముఖ్యం అని అమృత సాగర్ వాళ్లు హాస్పిటల్ కి వెళ్తారు.కారులో సాగర్ మళ్లీ లక్ష్మి ఆ బంటి ఎవరని నువ్వు ఎందుకు ఆ వ్రతాలు చేస్తున్నావు అయినా, నేను గతంలో ఎలా ఉండే వాడినో తెలుసు కదా కానీ ఇప్పుడు మంచిగా మారి నందుకు నీవు ఇదంతా చేస్తున్నావు నా విశ్వరూపం ఏంటో మళ్లీ ఇప్పుడు చూపిస్తాను. ఇంటికి పదం అంటాడు లక్ష్మిని. అప్పుడు లక్ష్మి రూపంలో ఉన్న అంజలి.

Kumkuma Puvvu today episode November 04 2023  Episode 2018 highlights
Kumkuma Puvvu today episode November 04 2023  Episode 2018 highlights

సాగర్ గారు, ప్లీజ్ మీరు పదే పదే అలా మాట్లాడకండి అని అంటుంది అంజలి. అప్పుడు ఇక ఇంటికి వచ్చాక లక్ష్మీ చెయ్యి పట్టుకుని లాక్కు వచ్చి ఇంట్లో పడేస్తాడు,అప్పుడు పద్మావతి కొండమ్మ ఏంటి బాబు ఏం జరిగింది అని అడుగుతారు. అందుకు సాగర్ ఇది ఇంట్లో నుంచి బయటికి వెళ్లి గుడి దగ్గర పొర్లు దండాలు పెడుతూ, ఆ బంటి గాడి కోసం పూజలు వ్రతాలు చేస్తుంది అని అంటాడు సాగర్. అప్పుడు పద్మావతి కొండమ్మ ఏమి మాట్లాడరు సాగర్ ఇక నేను మంచిగా మారాననే కదా ఇది ఇలా ప్రవర్తిస్తుంది ,ఇలా పరాయి భర్త కోసం పూజలు చేసే ఆడదాన్ని ఏమంటారు తెలుసా మానసిక వ్యభిచారి అని అంటారు అని అంటాడు సాగర్ .అప్పుడు అంజలి సాగర్ గారు నోరు ఉందని ఎంత పడితే అంత మాట్లాడ కండి జాగ్రత్త  ఇన్ని రోజులు మీరు కనీసం మనుషులు అనుకున్నాను కానీ ఇప్పుడు మీరు అది కూడా కాదు అని తెలిసిపోయింది అని అంటుంది అంజలి. అప్పుడు సాగర్ అవునే నేను మనిషిని కాదు మృగాన్ని ,మొగాన్ని, మొగుడిని అని అంటూ, అంజలి చేయి పట్టుకుని గదిలోకి తీసుకువెళ్లి నీ రెక్కలు ఎలా విరిచేస్తానో చూడు అని గదిలో పడేసి తలుపు వేస్తాడు సాగర్.

Kumkuma Puvvu today episode November 04 2023  Episode 2018 highlights
Kumkuma Puvvu today episode November 04 2023  Episode 2018 highlights

అప్పుడు పద్మావతి, కొండమ్మ, అయ్యో బాబు ఆడ కూతురిని అలా గదిలో పెట్టి తలుపు వేయడం ఏంటి తప్పు కాదేంటి అని అంటుంది పని మనిషి కొండమ్మ. అప్పుడు సాగర్ తల్లి పద్మావతి అవున్రా సాగర్ గదిలో పెట్టడం తప్పురా అని అంటుంది.అందుకు సాగర్ మీరు నాకు ఏమి చెప్పాల్సిన అవసరం లేదు,దానికి అన్నము నీళ్లు ఏమి  ఇవ్వాలి అనుకున్న అది నన్ను అడిగి ఇవ్వాలి అంటాడు సాగర్. అప్పుడు గదిలో ఉన్న అంజలి ప్లీజ్ అత్తయ్య, కొండమ్మ తలుపు తెరవండి అంటూ బాధతో ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది అంజలి. అప్పుడు కొండమ్మ ఎందుకమ్మా మాట,మాట పెంచుకొని గొడవ అని పెద్దగా చేసుకోవడం తప్ప ఇంకా ఏమైనా ఉందా అని అంటుంది కొండమ్మ.అప్పుడు అంజలి ఏడుస్తూ ప్లీజ్ కొండమ్మ తలుపు తెరవండి అని అంటూ, అడుగుతుంది అంజలి.

Kumkuma Puvvu today episode November 04 2023  Episode 2018 highlights
Kumkuma Puvvu today episode November 04 2023  Episode 2018 highlights

ఇక కొండమ్మ, పద్మావతి కిందికి వచ్చి పద్మావతి కొండమ్మతో,  కొండమ్మ నిజము మనకు అంతా తెలిసి కూడా మనము ఏమి చేయలేకపోతున్నాం.పాపం అంజలిని చూస్తే నాకు చాలా బాధేస్తుంది అని అంటుంది పద్మావతి.అప్పుడు కొండమ్మ కూడా భర్త ఆపదలో ఉన్నప్పుడు ఏ భార్య అయినా చేసే పని కాదమ్మా కానీ, మనము ఏం చేయగలం అని అంటుంది కొండమ్మ. అప్పుడు పద్మావతి మాత్రం అంజలికి మనం ఏమి చేయలేము కొండమ్మ ఆ దేవుడే న్యాయం చేయాలి అని అంటుంది పద్మావతి. అప్పుడు కొండమ్మ మనము ఏమి చేయలేము అంటూ,ఏడుస్తూ వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. అంజలి మాత్రం గదిలో ఏడుస్తూ ఉంటుంది.అప్పుడు సాగర్ మాత్రం అమ్మ అది ఎంత అరిచి కేకలు పెట్టిన,తలుపులు బద్దలు కొట్టిన,మీరు మాత్రం తలుపు తీశారు అంటే నా విశ్వరూపం చూస్తారు అని అంటాడు సాగర్. అప్పుడు పద్మావతి, కొండమ్మ భయపడుతూ అయ్యో దేవుడా ఎలాగైనా నీవే దారి చూపించు అని అనుకుంటారు మనసులు. అప్పుడు అంజలి గది లోపలి నుంచి ప్లీజ్ తలుపు తెరవండి తలుపు తెరవండి అని అడుగుతూ ఏడుస్తూ ఉంటుంది అంజలి.

Related posts

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

sekhar

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu

Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: కూతుర్లని పుట్టింటికి తీసుకెళ్లడానికి పార్వతి ప్రయత్నం.. కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్కీ…

bharani jella

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

bharani jella

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Scam 2010 Web Series: మరో సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. వైరల్ అవుతున్న పోస్టర్..!

Saranya Koduri

Manjummel Boys OTT: ఓటీటీలో దూసుకుపోతున్న మలయాల్ బ్లాక్ బస్టర్ మూవీ..!స‌స‌

Saranya Koduri

Big Boss Siri: సరికొత్త లుక్ లో సిరి హనుమాన్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri