NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Election: తెలంగాణలో బీజేపీ – జనసేన పొత్తు ఫైనల్ .. జనసేన పోటీ చేసే స్థానాలు ఇవే..?

Telangana Election:  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరం దగ్గర పడుతున్న వేళ బీజేపీ – జనసేన మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం ఒక కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తొంది. పొత్తు అంశంపై ఇప్పటికే జనసేన – బీజేపీ మధ్య ఒక అవగాహన వచ్చిన సంగతి తెలిసిందే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ముందుగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ లు మంతనాలు జరిపారు. ఆ తర్వాత అమిత్ షాతో పవన్ కళ్యాణ్ సమావేశమై చర్చించారు. పొత్తుపై పయనంపై ఇరు పార్టీలు అవగాహనకు వచ్చేశాయి.

అయితే పొత్తులో భాగంగా జనసేన పార్టీ 20 సీట్లు డిమాండ్ చేస్తుండగా, బీజేపీ అధిష్టానం జనసేనకు 8 నుండి 10 సీట్లు ఇవ్వడానికి సిద్దమైనట్లుగా తెలుస్తొంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆంధ్రప్రాంత ఓటర్లు ఎక్కువగా ఉన్న కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, ఎల్బీ నగర్ వంటి స్థానాలను తమకు కేటాయించాలని జనసేన కోరుతోంది. అయితే కూకట్ పల్లి ని జనసేనకు కేటాయించేందుకు బీజేపీ నాయకత్వం అంగీకరించినట్లు సమాచారం. అలానే ఆంధ్రప్రదేశ్ సరిహద్దుగా ఉన్న ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో మిగితా స్థానాలను కేటాయించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తొంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం కూకట్ పల్లి, వైరా, ఖమ్మం, అశ్వారావుపేట, కొత్తగూడెం, కోదాడ, నాగర్ కర్నూల్, తాండూరు స్థానాలతో పాటు మరో రెండు జనసేనకు కేటాయించే అవకాశం ఉందని అంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రెండు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నాలుగు, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూడు లేక నాలుగు స్థానాలు ఇచ్చేందుకు బీజేపీ యోచన చేస్తుందని అంటున్నారు.

ఒకటి రెండు రోజుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో బీజేపీ నేతలు సమావేశమైతే దీనిపై ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ మూడు విడతలుగా అభ్యర్ధుల జాబితాను విడుదల చేసింది. జనసేనకు కేటాయించే సీట్ల విషయం తేలితే ఫైనల్ జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. సీట్ల సర్దుబాటు పూర్తి అయిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సేవలను ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకోవాలని కమలనాధులు భావిస్తున్నారు. బీజేపీ అగ్రనేతలు పాల్గొనే బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.

Telangana Elections: తలసానికి సెంటిమెంట్ దెబ్బ పడుతుందా..! హాట్రిక్ సాధించి రికార్డు సృష్టిస్తారా..?

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju