NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu Prema: పద్మావతిని పెళ్లి చేసుకొని తీరుతానని చెప్పిన కృష్ణ… పద్మావతి కిడ్నాప్..?

Nuvvu Nenu Prema 19 June 2023 today 340 episode highlights

Nuvvu Nenu Prema: స్టార్ మా ఛానల్ లో అత్యంత ఆదరణ దక్కించుకుంటున్న డైలీ సీరియల్స్ లో ఒకటి ‘నువ్వు నేను ప్రేమ’. విజయవంతంగా 339ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకున్న ఈ సీరియల్ ఇప్పుడు 340 వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది.

Nuvvu Nenu Prema 19 June 2023 today 340 episode highlights
Nuvvu Nenu Prema 19 June 2023 today 340 episode highlights

నిన్నటి ఎపిసోడ్ లో,అను ఆర్యాల, హల్దీ ఫంక్షన్ జరుగుతుంది. అను ని పెళ్లికూతురుని చేస్తారు. ఆర్యను పెళ్ళికొడుకుని చేయడానికి, పసుపు తీసుకొని పద్మావతి, ఆర్య వాళ్ళ ఇంటికి వెళుతుంది.

Nuvvu Nenu Prema 19 June 2023 today 340 episode highlights
Nuvvu Nenu Prema 19 June 2023 today 340 episode highlights

Nuvvu Nenu Prema: అను, అర్యాల హల్దీ ఫంక్షన్ గ్రాండ్ గా జరుగుతుంది…ఫంక్షన్ లో భక్త, ఎమోషనల్..

ఈరోజు ఎపిసోడ్ లో, పద్మావతి పసుపు తీసుకొని ఆర్య వాళ్ళ ఇంటికి వస్తుంది. ఆర్య తో పద్మావతి, ఇలాంటి మంచి కుటుంబంలో మా అక్కని, ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది బావగారు అని అంటుంది. మీకు కంగ్రాట్యులేషన్స్ మరియు, థాంక్స్ అని అంటుంది. కంగ్రాట్యులేషన్స్ మీకు పెళ్లి జరుగుతున్నందుకు థాంక్స్ మా అక్కని చేసుకుంటున్నందుకు అని అంటుంది. పద్మావతిని ఆర్య వాళ్ళ నాయనమ్మ నీ రాకతో మా ఇల్లంతా సంతోషంతో నిండిపోయింది. అని అంటుంది. నాకు మాత్రం చాలా చిరాగ్గా ఉంటుంది అని కుచల అనుకుంటుంది. సిద్దు పద్మావతి తీసుకొచ్చిన పసుపుని ఆర్య కి రాస్తాడు. ఇందాకే రాసావు కదరా అంటాడు ఆర్య. ఇది పద్మావతి తీసుకొచ్చిన పసుపు కదా అంటాడు. అరవింద పద్మావతిని, హల్దీ ఫంక్షన్ అంటే కొంచెం సరదాలు ఉండాలి కదా అని అంటుంది. అవును అంటుంది పద్మావతి. అప్పుడే పసుపు తీసుకొని అరవింద పద్మావతి మొహానికి రాస్తుంది. నాకు రాస్తారా అయితే మీకు రాస్తా ఉండు అని పద్మావతి పసుపు తీసుకొని అరవింద కి రాస్తుంది. రేపటి నుండి అరవింద స్థానం నీదే పద్మావతి అని కృష్ణ మనసులో అనుకుంటాడు. నువ్వు ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలి రానమ్మ, అని కృష్ణ అరవింద తో అంటాడు. కుచల నారు నేను నీకు పసుపు రాస్తాను అని అంటుంది. నాకొద్దు అని అనడంతో, గ్లామర్ గా ఉంటావు రాస్తాను, అని అంటుంది కుచల, నాకేమీ వద్దు అనడంతో సరే అని పసుపు పళ్లెం కింద పెడుతుంది కుచల.

Nuvvu Nenu Prema 19 June 2023 today 340 episode highlights
Nuvvu Nenu Prema 19 June 2023 today 340 episode highlights

విక్కీకి పసుపు రాద్దామని అరవిందా ముందుకు వస్తుంది. విక్కీ నాకొద్దు ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు అని నీకు తెలుసు కదా అక్క అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాడి గురించి నీకు తెలిసిందే కదా, ఎందుకు పసుపు రాయ పోయావు అని అంటుంది అరవింద నాయనమ్మ. పద్మావతి అసలు పసుపు ఎందుకు విక్కీ గారు వద్దంటున్నారు అని అడుగుతుంది. వాడికి ఇలాంటివి అసలు ఇష్టం ఉండదు పద్మావతి. అందరికీ పసుపు రాస్తున్నాం కదా మరి ఆయనకేంటి స్పెషల్, మా వాడు ఎప్పుడు స్పెషల్, నీలాంటి వాళ్లకు అర్థం కాదు అంటుంది కుచల. మీరేం అనుకోకండి నేను రాస్తాను పసుపు అని అంటుంది. మా వాడికి ఇష్టం ఉండదు కదా అంటాడు ఆర్య. అయినా నేను రాస్తాను కదా అని అంటుంది పద్మావతి. పద్మావతి ఇక్కడ చేసేదైతేనే చెప్తుంది చెప్పేదయితేనే చేస్తుంది. పద్మావతి గారు విక్కిని డిస్టర్బ్ చేయకండి, విక్కీ బాధపడితే మేము బాధపడతాము అని కృష్ణ అంటాడు. పర్వాలేదురండి పద్మావతి మీద నాకు నమ్మకం ఉంది. తన రాయనివ్వండి అని అంటుంది అరవింద. పద్మావతి పసుపు పళ్లెం తీసుకొని విక్కీ దగ్గరికి వెళ్తుంది.

Nuvvu Nenu Prema 19 June 2023 today 340 episode highlights
Nuvvu Nenu Prema 19 June 2023 today 340 episode highlights

Krishna Mukunda Murari: మురారి కృష్ణుని ప్రేమిస్తున్నట్లు తెలుసుకున్న ముకుంద ఏం చేయనుంది…

విక్కీ,కి పసుపు రాసిన పద్మావతి…

ఏంటి బావగారు,హళ్లి ఫంక్షన్ అంటే పసుపే కదా రాస్తారు, మీరేంటి అసలు పసుపు ఇష్టం లేదన్నారు, పద్మావతి ఇక్కడ కచ్చితంగా మీకు పసుపు రాసి తీరుతా, నువ్వు చెప్పేది నేను వినాలా అంటాడు విక్కీ. ఆడ పెళ్లి వాళ్ళు చెప్తే మగ పెళ్లి వాళ్ళు వినాలి అని అంటుంది పద్మావతి. పైగా ఈ పద్మావతి చెప్తేవిని తీరాల్సిందే అని అంటుంది.అంత సీన్ లేదు నాకు పసుపు రాయడం ఇష్టం ఉండదు. అలాంటివేం చేయకు అంటాడు విక్కి. పద్మావతి పసుపు తీసుకొని విక్కీకి రాయడానికి ముందుకు వెళ్తుంది. విక్కీ వద్దు వద్దు అని లేచి, పరిగెడుతూ ఉంటాడు. పద్మావతి కూడా వెనకాలే విక్కీ కి పసుపు రాయాలని చూస్తూ ఉంటుంది. ఈ లోపు సిద్దు వచ్చి, పద్మావతి ప్లేటుని చూసుకోకుండా, పైకి విసురుతాడు. దీంతో పసుపు పళ్లెం పైకి విసురుతుంది. పద్మావతి ని పడబోతే విక్కి పట్టుకుంటాడు. సిద్దు ఇంట్లో వాళ్ళందరినీ పిలుస్తాడు. ఇంట్లో వాళ్ళందరూ వచ్చి పద్మావతి అనుకున్నది చేశావు. విక్కీకి పసుపు రాసావు. సరే సాయంత్రం హోమం ఉంది. అందరూ రండి అని అంటుంది ఆర్యా వాళ్ళ నాయనమ్మ. సరే అంటుంది పద్మావతి. అందరూ వెళ్లిపోయాక పద్మావతి కూడా వెళ్ళిపోతుంటే, వికీ పద్మావతి చున్ని తీసుకొని తన ఫేస్ కి అయినా పసుపు అంతా తుడుచుకుంటాడు. బంగారు లాంటి నా చున్నీ ని పాడు చేస్తావా టెంపరోడ అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పద్మావతి.

Nuvvu Nenu Prema 19 June 2023 today 340 episode highlights
Nuvvu Nenu Prema 19 June 2023 today 340 episode highlights

పద్మావతిని పెళ్లి చేసుకుంటానని చెప్పిన కృష్ణ…

పద్మావతి, విక్కీ వెనకాలే వస్తున్నాడు అనుకోని బయటికి వచ్చేస్తుంది. వెనక్కి తిరిగి ఇదిగో సారు అని అంటుంది. అదే టైం కి అక్కడికి కృష్ణ వస్తాడు.పద్మావతి చున్ని తీసుకొని తన కర్చీఫ్ తో తుడుస్తూ ఉంటాడు. ఎంత ధైర్యం నీకు నా చున్నీ తీసుకుంటావు, అని అంటుంది పద్మావతి. విక్కి తీసుకొని పసుపు రాసాడు కదా దీనికి అందుకని తన వేవి నీ దగ్గర ఉండకూడదు అని తుడుస్తున్నా, అని అంటాడు కృష్ణ.నోరు మూసుకొని బుద్ధిగా అరవింద గారితో ఉండు. అలా ఉండలేకే కదా నీ వెనక పడుతుంది మనిద్దరం పెళ్లి చేసుకుందాం అని అంటాడు కృష్ణ. నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా, మనిద్దరికీ పెళ్లి జరగడం ఏంటి అస్సలు జరగదు. పని పద్మావతి అంటుంది. నువ్వు అనుకుంటే జరగదేమో నేను అనుకుంటే జరిగి తీరుతుంది అని అంటాడు కృష్ణ. ఆర్య వాళ్ళ పెళ్లి అయ్యేలోపే నీ మెడలో తాళి కడతాను. అంతదాకా వస్తే నేను చూస్తూ ఊరుకోను అని అంటుంది పద్మవతి. నీ తాట తీసేయనా, అందరి ముందు నీ బండారం బయట పెడతాను అని అంటుంది పద్మావతి. నా గురించి నీకు తెలియట్లేదు పద్మావతి అని అంటాడు కృష్ణ. ఏం చేస్తావ్, ఏం చేస్తావో చేసుకోపో అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. సాయంత్రం మళ్ళీ ఇక్కడికి వస్తావు కదా అప్పుడు తెలుస్తుంది నేనంటే ఏంటో అని అంటాడు కృష్ణ.

Nuvvu Nenu Prema 19 June 2023 today 340 episode highlights
Nuvvu Nenu Prema 19 June 2023 today 340 episode highlights

Brahmamudi serial జూన్ 17th 125 ఎపిసోడ్:  నిజం చెప్తే ఆత్మహత్య చేసుకొని చనిపోతాను అంటూ కావ్య ని బెదిరించిన స్వప్న 

ఆర్య వాళ్ళ ఇంట్లో హోమానికి బయలుదేరిన పద్మావతి ఫ్యామిలీ…

అను అందరికంటే ముందు రెడీ అయ్యి అందరినీ రమ్మని పిలుస్తూ ఉంటుంది. పార్వతీ వచ్చి అత్తారింటికి పోవడానికి బాగా తొందరగా ఉన్నట్టుంది అని అంటుంది. ఈలోపు భక్తా వచ్చి అంత మంచి ఇంటికి కోడలుగా వెళ్లాలని దానికి మాత్రం ఉండదా తొందర అని అంటాడు. పద్మావతి వచ్చి కరెక్ట్ గా చెప్పావు నాయనా అని అంటుంది. అంతకుముందు వాళ్ళ ఇంటికి వెళ్లాలంటే, తర్వాత వెళ్దాం అని అనేది ఇప్పుడు అందరికన్నా ముందు రెడీ అయిపోయింది. అలాంటిదేం లేదు అని అంటుంది అను. బావగారు ని చూడాలని తొందరగా ఉంది నీకు. బావగారు కోసమే కదా ఇదంతా చెప్పు అని పద్మావతి అను ఆటపట్టిస్తూ ఉంటుంది. వాళ్ళిద్దర్నీ అలా చూసి, వాళ్ళ నాన్న మురిసిపోతూ ఉంటాడు. హోమానికి టైం అవుతుంది అందరూ పదండి అని అంటుంది అండల్. పద్మావతి వాళ్ళ నాన్నని కూడా రమ్మంటుంది. నేను రానులే మా ఇక్కడ పెళ్లి పనులు ఉన్నాయి మీరంతా జాగ్రత్తగా వెళ్లి రండి అని అంటాడు భక్త.

Nuvvu Nenu Prema 19 June 2023 today 340 episode highlights
Nuvvu Nenu Prema 19 June 2023 today 340 episode highlights
అరవింద,విక్కీని కూడా పెళ్లి చేసుకో మంటుంది…

విక్కీ తన రూమ్లో ఆఫీస్ పని చేసుకుంటూ ఉంటాడు. అరవింద వచ్చి మే ఐ కమింగ్సార్ అని అంటుంది. ఏంటి అక్క నువ్వు నన్ను పర్మిషన్ అడుగుతున్నావ్ అని అంటాడు. నువ్వు ఆఫీస్ పనిలో, బిజీగా ఉన్నావా అని అడిగాను లేరా అంటుంది అరవింద. నీకన్నా ఏది ఇంపార్టెంట్ కాదు అక్క అని అంటాడు. నాకు తెలుసులేరా ఈ జ్యూస్ తాగు అని అంటుంది అరవింద. అక్క ఈ పనులు నీకు ఎందుకు నువ్వు రెస్ట్ తీసుకో, అని అంటాడు విక్కీ. నా తమ్ముడికి చూసి ఇవ్వడం కూడా పనేనా అని అంటుంది అరవింద. ఆర్య పెళ్లవుతున్నందుకు, నాకు చాలా సంతోషంగా ఉంది రా, నాక్కూడా అని అంటాడు, విక్కీ. వాడు చాలా అమాయకుడు ఎలాంటి అమ్మాయి వస్తుందో అనుకునేదాన్ని, లక్కీగా వాడి మనసుకు నచ్చిన అమ్మాయిని, చేసుకుంటున్నందుకు హ్యాపీగా ఉంది అని అంటుంది అరవింద. అవును అక్క అని అంటాడు విక్కి. మరి ఈ జీవితంలోకి ఎవరు భార్యగా వస్తారో, ఆర్య కి పెళ్లైతున్నట్టే నీకు కూడా పెళ్లయితే చూడాలని నాకు చాలా ఆశగా ఉంది రా, నీకే బాధ రాకుండా, చూడాలన్నది అమ్మ కోరిక. నేను అమ్మ లాగా పెంచానే కానీ, అమ్మ ప్రేమని సరిగా పంచ లేకపోయాను. అమ్మ ప్రేమని పంచే మనసున్న అమ్మాయి నీకు భార్యగా రావాలి. అలాంటి అమ్మాయి నీ జీవితంలోకి భార్యగా వస్తే నువ్వు కూడా జీవితాంతం సంతోషంగా ఉంటావు. నీ మనసుకు నచ్చిన అమ్మాయి అమ్మ దీవెనలతో, నీకు దగ్గర అవ్వాలి. అలాంటి అమ్మాయి నీకు ఎదురు పడాలి. అని అంటుంది అరవింద. నేను అమ్మ కోరిక తీర్చడానికి ప్రయత్నిస్తున్నాను అక్క. కానీ పద్మావతి తను వేరే వారిని ప్రేమిస్తున్నట్టు నాతో అబద్ధం చెప్పింది అనిపిస్తుంది. నిజం ఏంటో తెలుసుకోవాలని చూస్తున్నాను అక్క. అని మనసులో అనుకుంటాడు.విక్కీ,అమ్మ కోరిక చాలా బలమైంది.తప్పకుండా నువ్వు కోరుకున్న అమ్మాయి నీ జీవితంలోకి వస్తుంది అని అంటుంది అరవింద. అవును అక్క నేను ఎట్టి పరిస్థితుల్లో తనని వదులుకోను, అని అంటాడు విక్కీ.

కుచల మేకప్ వేసుకుంటూ ఉంటుంది. అరవింద్ ఒక్కతే పని చేస్తుంది కదా నువ్వేంటి ఖాళీగా కూర్చున్నావు అని అంటుంది,కుచల అత్తగారు.సిద్దు వచ్చి,ఏంటి నాయనమ్మతో, అబద్ధం చెపుతున్నారు అని అంటాడు. నోరు మూసుకో అని అంటుంది కుచల. ఏమంటున్నాడు అని అంటుంది విక్కీ నాయనమ్మ. ఏం లేదు అత్తయ్య నేను పని చేసిందంతా ఇందులో వీడియో రికార్డ్ చేసాడు ట, అని కుచల అంటుంది. సిద్దు మీరు పని చేయలేదు ఖాళీగా కూర్చోవడం రికార్డ్ చేశాను. అని అంటాడు. ఆ విషయాన్ని, గ్రానీ అని చెప్పబోతూ ఉంటాడు. కుచల అరె అరవకు ఇక్కడి నుంచి వెళ్ళు అని అంటుంది. అప్పుడే అక్కడికి అరవింద,విక్కీ వస్తారు..

రేపటి ఎపిసోడ్ లో,హోమానికి నెయ్యి తీసుకురావడానికి పద్మావతి బయటికి వస్తుంది. అప్పుడే అక్కడికి రౌడీలు కొందరు వచ్చి పద్మావతిని తీసుకుని వెళ్లడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఎవరు మీరు వదలండి అని పద్మావతి అరుస్తూ ఉంటుంది. అక్కడికి అప్పుడే హీరోలా ఎంట్రీ ఇస్తాడు విక్కీ..

Related posts

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu

Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: కూతుర్లని పుట్టింటికి తీసుకెళ్లడానికి పార్వతి ప్రయత్నం.. కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్కీ…

bharani jella

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

bharani jella

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Scam 2010 Web Series: మరో సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. వైరల్ అవుతున్న పోస్టర్..!

Saranya Koduri

Manjummel Boys OTT: ఓటీటీలో దూసుకుపోతున్న మలయాల్ బ్లాక్ బస్టర్ మూవీ..!స‌స‌

Saranya Koduri

Big Boss Siri: సరికొత్త లుక్ లో సిరి హనుమాన్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Devara: “దేవర” సాంగ్ వింటే “హుకుం” మర్చిపోతారు అంటూ నాగవంశీ కీలక వ్యాఖ్యలు..!!

sekhar

Tollywood Actor: ఇత‌నెవ‌రో గుర్తుప‌ట్టారా.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా వ‌చ్చి హీరోగా అద‌ర‌గొట్టి చివ‌ర‌కు ఇండ‌స్ట్రీలోనే లేకుండా పోయాడు!

kavya N