Brahmamudi Serial జూన్ 19th126 ఎపిసోడ్: స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే బ్రహ్మముడి సీరియల్ ఎంత విజయవంతంగా సాగుతుందో అందరికీ తెలిసిందే,నెంబర్ 1 రేటింగ్స్ తో టాప్ లో ఉన్న ఈ సీరియల్ నేటి ఎపిసోడ్ లో ఏమి జరగబోతుందో ఒకాస్కారి చూద్దాము.

రాహుల్ – స్వప్న శోభనం గదిని ముస్తాబు చేసిన కావ్య :
కావ్య రాహుల్ మరియు స్వప్న శోభనం గదిని అందం గా ముస్తాబు చేస్తూ ఉంటుంది. ఈలోపు రాజ్ కత్తి తీసుకొని లోపాలకి వస్తాడు, అదేంటి కత్తి తీసుకొచ్చావ్ అని కావ్య అడగగా , ‘నిన్ను పొడవడానికి’ అని అంటాడు, ఆ తర్వాత పక్కకి తప్పుకో అక్కడ పండ్లు పెట్టావు, కత్తి పెట్టాలనే విషయం మర్చిపోయావ్ అని అంటాడు. అప్పుడు కావ్య ‘హమ్మయ్య నా పీక మీద పెట్టలేదు’ అని మనసులో అనుకుంటుంది. ఇక ఆ తర్వాత కావ్య డెకరేషన్ చూసి చండాలంగా ఉంది అంటూ వెక్కిరిస్తారు. ఆ తర్వాత ఎప్పటి లాగానే కాసేపు గిల్లికజ్జాలు ఆడుకుంటారు. ఇక ఆ తర్వాత రాజ్ తన రూమ్ లోకి వెళ్తున్న సమయం లో ధాన్య లక్ష్మి రాజ్ తో మాట్లాడేందుకు వస్తుంది.

Nuvvu Nenu Prema: అను, అర్యాల హల్దీ ఫంక్షన్ గ్రాండ్ గా జరుగుతుంది…ఫంక్షన్ లో భక్త, ఎమోషనల్..
కావ్య ని బాధపెట్టొడు అని వేడుకున్న ధాన్య లక్ష్మి :
ధన్య లక్ష్మి మాట్లాడుతూ ‘నేను ఒకసారి కావ్య గురించి మాట్లాడడానికి వచ్చినప్పుడు , నువ్వు మా విషయం లో జోక్యం చేసుకోకు అన్నావు, అప్పటి నుండి నేను మీ విషయం లోకి రాలేదు’ అని అంటుంది. అప్పుడు రాజ్ ఆరోజు నేను ఎదో తొందర్లో అనేశాను అత్తా, అది ఇంకా మనసులో పెట్టుకున్నావు అంటే ఎంత బాధపడి ఉంటావో అర్థం అవుతుంది , ఇక ఎప్పుడు అలా అనను అంటాడు రాజ్. అప్పుడు ధాన్య లక్ష్మి నువ్వు జోక్యం చేసుకోకు అన్నా కూడా నేను జోక్యం చేసుకుంటాను, ఎందుకంటే నువ్వు నా కొడుకువి, కొడుకు తప్పు మార్గం లో వెళ్తుంటే సరి చెయ్యడం నా బాధ్యత, నువ్వు కావ్య తో అలా ఉండడం కరెక్ట్ కాదు రాజ్, ఒక ఆడదాన్ని బాధ ఆడదానికే తెలుస్తుంది, తన ఇంట్లో వాళ్ళందరిని వదిలి నీతో కలిసి సంతోషం గా జీవించడానికి ఇక్కడ కి వచ్చింది, సొంత భర్తనే దూరం చేస్తూ ఉంటే ఆ బాధ మామూలుగా ఉండదు,మీ మధ్య పెళ్ళికి ముందు ఎన్ని కండిషన్స్ అయినా ఉండొచ్చు, కానీ ఆమె అమ్మాయి తప్పు ఏమి లేదని తెలిసిన తర్వాత కూడా ఆమెని దూరం పెట్టి బాధించడం మంచిది కాదు, తల్లిచాటున పెరిగిన బిడ్డవి కాబట్టి ఒక అమ్మాయి మనసు అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నా అంటూ ఎమోషనల్ చెప్తుంది ధన్య లక్ష్మి.

Krishna Mukunda Murari: మురారి కృష్ణుని ప్రేమిస్తున్నట్లు తెలుసుకున్న ముకుంద ఏం చేయనుంది…
స్వప్న గర్భవతి కాదనే విషయాన్నీ తెలుసుకున్న రాజ్..?:
మరో పక్క స్వప్న పాల గ్లాస్ తో రాహుల్ గదిలోకి వస్తుంది. రాహుల్ ని చూడగానే నాకు తెలుసు రాహుల్ , ఈ పెళ్లి నీకు ఇష్టం లేదని ,నన్ను కిడ్నాప్ చేయించింది కూడా నువ్వే అనే విషయం నాకు తెలుసు, కానీ ఇప్పుడే నిన్ను ఏమి అడగను, నా ప్రెగ్నన్సీ వార్త నిజం అయ్యేవరకు నీతో మరియు ఇంట్లో వాళ్ళతో మంచిగా ఉంటాను అంటూ మనసులో అనుకోని రాహుల్ వద్దకి వస్తుంది. అప్పుడు రాహుల్ తో నాకు తెలుసు రాహుల్ నీకు చాలా ఇబ్బందిగా ఉందని , నాతో పెళ్లి జరుగుతుందని నువ్వు అనుకోలేదు కదూ అని అనగానే రాహుల్ ఒక్కసారిగా షాక్ అవుతాడు.

అప్పుడు స్వప్న అదే నేను కిడ్నాప్ అవ్వడం , కనిపించకుండా పోవడం ఇవన్నీ జరిగిన తర్వాత పెళ్లి అవుతుందని నువ్వు అనుకొని ఉండవ్. నేను ఎవరో నీకు తెలియదు అని ఒకసారి అన్నావు, నా స్థానం లో వేరే అమ్మాయి అంటే నిన్ను ఈపాటికి వదిలేసి ఉండేది, కానీ నేను నిన్ను వదలలేక పోయాను, ఎందుకంటే నువ్వంటే నాకు అంత పిచ్చి అని కౌగలించుకుంటుంది. అప్పుడు రాహుల్ నా మీద నీకు ప్రేమై పెళ్లి చేసుకోలేదు,

నా వెనుక ఉన్న ఆస్తిని చూసి చేసుకున్నావ్ , వారం రోజులు నీతో హోటల్ లో ఉన్నందుకే నా పర్సు మొత్తం ఖాళీ చేయించావు, ఇప్పుడు నిన్ను భార్య గా అంగీకరిస్తే నా జీవితం మొత్తాన్ని ఆవకాయ బద్ద లాగ నాకేస్తావు అని మనసులో అనుకుంటాడు, ఆ తర్వాత నేను సెట్ అవ్వడానికి కాస్త సమయం పడుతుంది, అప్పటి వరకు మనం భార్య భర్తలుగా ఉండొద్దు అని అంటాడు రాహుల్,ఇక రేపటి ఎపిసోడ్ లో స్వప్న కి నువ్వు గర్భవతి కాదు అనే నిజాన్ని బయపడకుండా కాపాడుకో అని చెప్పి , రూమ్ లో నుండి బయటకి వచ్చాక రాజ్ ఉంటాడు, ఆయన కావ్య మాట్లాడిన మాటలను విన్నాడో లేదో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.