Laapata Ladies OTT First Review: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావ్ దర్శకురాలిగా రెండో సినిమాను నిర్మించింది. ఆ సినిమా పేరే లాపతా లేడీస్. ఈ కామెడీ సైటారికల్ ఫీల్ గుడ్ మూవీ నిర్మాణంలో అమీర్ ఖాన్ కూడా భాగస్వాముడు అవడం విశేషం. మార్చ్ ఒకటవ తారీకున ఈ చిత్రం థియేటర్లలో విడుదల మంచి విజయం సాధించింది. అయితే ఇటీవలే ఏప్రిల్ 26న ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఓటిటి లోకి వచ్చిన నెట్‌ఫ్లిక్స్ నుంచి చాలామంది సెలబ్రిటీల వరకు ఈ మూవీ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
2001 సంవత్సరం బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ కదా సాగుతుంది. దీపక్ కుమార్ ( స్పర్శ శ్రీ వాత్సవ), ఫూల్ కుమారి ( నితాన్ని) కు వివాహం జరుగుతుంది. ఆ తరువాత దీపక్ సొంత ఊరికి వెళ్లేందుకు వారిద్దరూ ఓ రైలు ఎక్కుతారు. అదే ట్రైన్ లో కొత్తగా పెళ్లయిన మరికొన్ని జంటలు ఉంటాయి. కొత్త పెళ్లి కూతుర్లు అందరూ ముఖానికి ముసుగు వేసుకుని దాదాపు ఓకే రకమైన దుస్తులు ధరించి ఉంటారు. కొత్తగా పెళ్లయిన పుష్ప రాణి అలియాస్ జయ (ప్రతిభ రంట) వద్ద రైల్లో దీపక్ కుమార్, ఫూల్ కూర్చుని ఉంటారు. అయితే దిగాల్సిన స్టేషన్ వచ్చిన తొందరలో రాత్రి వేళ ఫుల్ ను కాకుండా పుష్ప రాని దీపక్ తీసుకెళ్తాడు. ముసుగు ఉండడంతో దీపక్ ను పుష్ప చూడలేక పోతుంది. అయితే గ్రామానికి వెళ్లిన తరువాత ఆమె ఫుల్ కాదు.. పుష్ప రాణి అని తెలుసుకుని దీపక్ మరియు వారి కుటుంబ సభ్యులు షాక్ అవుతారు. ఫుల్ కోసం దీపక్ వెతుకుతూ ఉంటాడు. ఫుల్ వో రైల్వే స్టేషన్ లో దిగి దిక్కు తోచని పరిస్థితుల్లో ఉంటుంది. అసలు ఈ పుష్ప రాణి ఎవరు? పుల్ కు ఏమైంది? దీపక్‌కు ఆమె దొరికిందా? అనే స్టోరీ తో ఈ మూవీ కొనసాగుతుంది.
సెటైరికల్ మూమెంట్:
సమాజంలో కట్టుబాట్లు, ఆచారాలు, కుటుంబ గౌరవం పేర్లతో అమ్మాయిల ఆకాంక్షనలు మరియు లక్షణాలు, సంతోషాలు ఎలా అణిచివేతకు గురవుతున్నాయో ఈ మూవీలో దర్శకుడు స్పష్టంగా చూపించాడు. పెళ్లి చేసుకుని అత్తారింట్లో సేవలు చేసేందుకు అమ్మాయిలు ఉన్నారని గ్రామీణ ప్రాంతంలోని కొందరు కుటుంబ సభ్యులు ఎలా ఆలోచిస్తున్నారనే అంశాన్ని కూడా బలంగా తెరకెక్కించాడు. ఫుల్ అండ్ పుష్ప రాణి అలియాస్ జయ పాత్రల తో ఈ విషయాన్ని గట్టిగా నిరూపించాడు. ప్రపంచాన్ని చూడకుండా వారు అలిచివేతకు గురవుతున్నట్లు ఈ సినిమాలో స్పష్టంగా అర్థమైంది. ఇక ఈ సినిమాలో సేటారికల్ మూమెంట్స్ ని చూపిస్తూనే మరోపక్క కన్నీరు పెట్టే అంశాలను కూడా చూపించాడు దర్శకుడు. అయితే ఈ సిరీస్ అంశాలను ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు డైరెక్టర్. ఎక్కువ మందికి ఈ మూవీలోని సందేశం వెళ్లేందుకు ఇది కూడా బాగా ఉపయోగపడింది. ఈ మూవీ ఎక్కువ శాతం సరదాగానే ఉంటుంది. అయితే కామెడీ అంతా ఆర్గానిక్ గా కథలోనే లీనమై ఉంటుంది. ఇక ఈ అంశాలను తెరకెక్కించేందుకు 2001 కాలాన్ని తీసుకోవడం చాలా ఫ్రెష్ గా అనిపించింది. అప్పుడప్పుడే మొబైల్స్ ప్రసిద్ధి చెందడం.. రైలు చిన్నచిన్న స్టేషన్లలో ఆగడం ఇలా ఈ కథకు ఆ సమయం సెట్ అయింది.
ఎమోషన్స్:
ఈ సినిమా ఎక్కువ సరదాగానే సాగుతుంది. అయితే చివరి 20 నిమిషాలు ఈ మూవీ కి మరింత బాధని యాడ్ చేశారు. ఎమోషనల్ గా రూపొందించారు. మనసుకు తాకేలా సీన్స్ ను రూపొందించారు. లాస్ట్ 20 నిమిషాలలో ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించారు.
ఆడియన్స్ టాక్:
ఇక ఈ మూవీకి ఆడియన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ దక్కుతుంది. ఇప్పటివరకు ఇటువంటి కథాంశంతో వచ్చిన సినిమాలను మేము చూడలేదంటూ కొందరు ట్విట్టర్ వేదికగా తమ సంతోషాన్ని సైతం పొందుపరిచారు.
రేటింగ్: 3.7/5