Nindu noorella savasam March 13th: ప్రస్తుతం ఉన్న జనరేషన్ సినిమాలకు ఎంత ఎడిట్ అవుతున్నారో చెప్పలేము కానీ సీరియల్స్ కి మాత్రం బేభత్సంగా ఎడిట్ అవుతున్నారు. పొద్దున్నుంచి ఎంత బిజీ పనిలో ఉన్నప్పటికీ సాయంత్రం అయ్యేసరికి టీవీల ముందుకు చేరుతున్నారు. సినిమా అయితే సంవత్సరానికి ఒకటి రెండు ఇలా స్టార్ హీరో సినిమాలు చూసేందుకు వస్తాయి. అదే సీరియల్ అయితే ప్రతిరోజు ప్రేక్షకుల్ని అలరిస్తుంది. అందువల్లే సీరియల్స్ కి మంచి ప్రాధాన్యత దక్కుతుంది కూడా. వెండితెరపై నటించే సైడ్ క్యారెక్టర్స్ కి పెద్దగా గుర్తింపు దక్కదు కానీ బుల్లితెరపై నటించే సైడ్ యాక్ట్రెస్ కి ఫుల్ పాపులారిటీ దక్కుతుంది.
తమ యాక్టింగ్ నిరూపించుకోవాలి అనుకునే వారికి బుల్లితెర బెస్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. వెండితెరపై అయితే మహా అయితే రెండు మూడు సీన్స్ ఇస్తారు అంతే. అదే బుల్లితెరపై అయితే ప్రతిరోజు మీ యాక్టింగ్ ని ప్రదర్శించుకోవచ్చు. డబ్బు కోసం యాక్టింగ్ చేయాలంటే సినిమాలు కరెక్ట్. అదే తమ పేరు ప్రఖ్యాతలను మరింత పెంచుకుంటూ గొప్ప యాక్టర్ అనిపించుకోవాలి అనుకుంటే సీరియల్స్ బెస్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. అలా తమ నటనను నిరూపించుకుంటూ జీ తెలుగులో టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్నారు నిండు నూరేళ్ల సావాసం సీరియల్ యాక్టర్స్.
ఈ సీరియల్ లో అమరేంద్ర మరియు అరుంధతిల మధ్య ఉన్న లవ్ అండ్ ఎఫెక్షన్ కి ప్రతి ఒక్కరూ ఫిదా అనే చెప్పొచ్చు. ఇక వీరిద్దరిని ఎలా అయినా విడదీయాలి అనుకునే మనోహరి కి ఎంతోమంది శత్రువులు ఉన్నారు. అదేవిధంగా ఈ సీరియల్ నీ ఒంటి చేత్తో లాక్కొస్తున్నా బాగి కూడా గొప్ప యాక్టర్. ఈ ముద్దుగుమ్మ గతంలో ఎన్ని సీరియల్స్ చేసిన రాణి గుర్తింపు ఒక్క నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తో వచ్చింది. తమ నటనను నిరూపించుకునే ఒక బెస్ట్ ప్లాట్ఫారం దొరికింది. ఈ ముద్దుగుమ్మ గతంలో ఇంటి గుట్టు అనే ఓ సీరియల్ లో నటించింది. ఆ సీరియల్ ఈమెకి గొప్ప ప్రశంసలు సైతం దక్కించింది. ఇక ఆ సీరియల్ అనంతరం ఈ ముద్దుగుమ్మ ఎంచుకున్న సరైన సీరియల్ నిండు నూరేళ్ల సావాసం.
ప్రస్తుతం ఈ సీరియల్ జీ తెలుగులో ఏడింటికి ప్రసారమవుతుంది. ఇక ఈ సీరియల్ టీం ఒక షూటింగ్ లోనే కాకుండా సోషల్ మీడియా మధ్యమాలలో సైతం ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు. అక్కడ యాక్టింగ్ వేరు ఇక్కడ యాక్టింగ్ వేరు అనుకుంటూ… పలు కామెడీ రియల్స్ ను షేర్ చేస్తున్నారు. ఇక వీరి అభిమానులు వీటిని ఊరికే వదిలేస్తారా? వీటిని కొన్ని రోజులు సోషల్ మీడియాలో ఫుల్ గా ట్రెండింగ్ చేస్తున్నారు. అలా ఇప్పటికే అనేక ఫోటోలు వీడియోలు సైతం ట్రెండ్ అయ్యాయి.
తాజాగా మరో ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ సీరియల్ లో అమరేంద్ర పాత్ర పోషిస్తున్న ” Richard Josh” కి పెళ్లయిన సంగతి తెలిసిందే. ఇక ఇంట్లో పెళ్ళాన్ని పెట్టి బయట రీల్ లైఫ్ భార్యతో తిరుగుతున్నాడు అమరేంద్ర. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను చూసిన వారంతా..” ఇంట్లో ఇల్లాలు బయట ప్రియురాలు అనే కాన్సెప్ట్ ని బానే ఫాలో అవుతున్నావు బ్రో ” అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.