Paluke Bangaramayenaa October 23 Episode 54: ఆగు వైజయంతి అని సుగుణ అంటుంది. సుగుణ,నేనే చంపేసాను అని విశాల్ చెప్పిన వీడియో తీసుకొచ్చి చూపిస్తుంది. అది చూసి వైజయంతి, నేను నమ్మలేకపోతున్నాను అని అంటుంది. ఇది ఒకటేనా ఇంక ఏమైనా ఉన్నాయా అని అడుగుతుంది వైజయంతి. స్వర ఇంక కొన్ని ఆధారాలు ఇచ్చింది అని సుగుణ చెప్తుంది. సరే ఇవి అన్ని జాగ్రత్తగా ఉంచు, ఇవి బావకు చూపించి వాడి సంగతి చెపుదాం అని అంటుంది వైజయంతి.కట్ చేస్తే,అభి ఇంకా స్వర హాస్పిటల్ లో ఉంటారు, అభి ఝాన్సీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇదంతా నా వల్లే నా కోసం సహాయం చేస్తూ, ఒక అమ్మాయి కి న్యాయం జరగాలని పోరాడుతున్న మేడంకి ఇలా జరిగింది, నా సమస్యను నేనే పరిష్కరించుకొని ఉంటే సరిపోయేది, మేడంకి ఈ పరిస్థితి వచ్చేది కాదు, అనవసరంగా నా గురించి చెప్పి మేడంని పెద్ద ప్రమాదంలో పడేసాను అని స్వర అంటుంది. ఎందుకు స్వర అలా అంటున్నావ్ అని అంటాడు అభి.

నా సమస్యను నేనే పరిష్కరించుకుంటాను అని అంటుంది స్వర. ఏంటి నువ్వా అని అడుగుతాడు అభి. ఏంటి సార్ అంటే నా వల్ల కాదని అంటున్నారా. అలా కాదు స్వర నువ్వు ఒక్కదానివే ఎలా చేస్తావు అని అంటున్నాను అని అంటాడు అభి. మనం కలిసి చేద్దాము స్వర ఎందుకు నువ్వు ఒక్కదానివే చేయడం నేను కూడా ఉన్నాను కదా అని అంటాడు అభి. అది కాదు అభి సార్ నావల్ల ఇంకొకరు ప్రమాదంలో పడడం నాకు ఇష్టం లేదు నేను తట్టుకోలేను అని అంటుంది స్వర. నాకెందుకో ఈ యాక్సిడెంట్ విశాల్ చేయించాడు అని అనిపిస్తుంది అభి సార్. నువ్వు చెప్పింది ఝాన్సీ చెప్పింది చూస్తే నాకు కూడా అదే డౌట్ వస్తుంది అని అంటాడు అభి. మనం ఎలాగైనా ఆధారాలు కోట్లో ప్రొడ్యూస్ చేసి కేసుని మళ్ళీ ఓపెన్ చేపించాలి అని అంటాడు అభి. మనం తొందరగా చేయాలి అభి సార్ లేదంటే చాలా ప్రమాదం ఉంది, వాన్ని ఎంత తొందరగా లోపలికి పంపిస్తే అంత మంచిది అని అంటుంది స్వర.

వాడి వల్ల ఇంకొక అమ్మాయికి అన్యాయం జరగడానికి వీల్లేదు అభి సార్ అని అంటుంది స్వర. ఝాన్సీ మేడంకి ఏదైనా సెక్యూరిటీ ఏర్పాటు చేయండి సార్ అని అంటుంది స్వర. కానిస్టేబుల్స్ ఉంటారులే స్వర అని అంటాడు అభి. కట్ చేస్తే వైజయంతి విశాల్ కి ఫోన్ చేస్తుంది. ఏం చేస్తున్నావ్ అని వైజయంతి అడుగుతుంది. ఇప్పుడే ఒక ముఖ్యమైన పని ఉంటే ముగించుకొని వస్తున్నాను అని అంటాడు విశాల్. నీ నేరాన్ని నువ్వే ఒప్పుకున్నట్టు వీడియో స్వర వాళ్ళ అమ్మ దగ్గర దాచి పెట్టింది, అది గనక కోర్టులో ఇస్తే నీకు ఉరి శిక్ష వేస్తారు అని అంటుంది వైజయంతి. దాని దగ్గర ఇంకా ఆధారాలు ఉన్నాయి అంటుంది వచ్చి వాటిని తీసుకొని వెళ్ళిపో అంటుంది వైజయంతి. సరే అని విశాల్ కాల్ కట్ చేస్తాడు. కట్ చేస్తే సుగుణ వంట గదిలో పనిచేస్తూ ఉంటుంది వైజయంతి హాల్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది.

పని వాళ్ళని బయటికి పంపించి విశాల్ ని రమ్మని చెప్పి ఆధారాలు తీసుకోవాలి అని అనుకుంటుంది వైజయంతి. అలివేలుని సీనయ్యని బయటకు పంపిచేస్తుంది వైజయంతి. వైజయంతి విశాల్ కి ఫోన్ చేస్తే ఎక్కడున్నావ్ తొందరగా రా అంటుంది. 20 నిమిషాల్లో ఇక్కడ ఉండాలి ఐదు నిమిషాల్లో పని ముగించుకొని వెళ్ళిపోవాలి అంటుంది వైజయంతి. మీరు ఎప్పుడు ఫోన్ చేస్తారని మీ లైన్ లోనే ఉన్నాను అంటాడు విశాల్. తొందరగా వచ్చి వెనుక ఉన్న గోడ నుంచి దుంకి రా అంటుంది వైజయంతి. సరే అని కాల్ కట్ చేస్తాడు విశాల్. కట్ చేస్తే విశాల్ గోడ ధునికి లోపలికి వస్తాడు. సరిగ్గా నా వెనకాల రా లేదంటే సీసీ కెమెరాలో పడతాము అంటుంది వైజయంతి.దాని బదులు సీసీ కెమెరాలు తీసేస్తే అయిపోయేది కదా అంటాడు విశాల్. అప్పుడు సీసీ కెమెరాలు ఎందుకు ఆఫ్ అయ్యాయి అని డౌట్ వస్తుంది అప్పుడు ఎంక్వయిరీ చేస్తారు అవసరమా అని అంటుంది వైజయంతి.

Paluke Bangaramayenaa: విశాల్ ప్లాన్ ని అమలు చేసిన వీరేశం…స్వరాగిణి పెళ్లి గురించి ఆలోచనలో నాయుడు!
మామయ్యకు బదులుగా మీరు పాలిటిక్స్ లో ఉంటే ఎప్పుడో సీఎం అయ్యేవారు అంటాడు విశాల్. సరే పదా అని ఇద్దరు లోపలికి వెళ్ళిపోతారు. సుగుణ వాళ్ళిద్దరూ లోపలికి రావడం చూస్తుంది. విశాల్ చూసి అత్తయ్య అని అంటాడు. నువ్వెందుకు వచ్చావు అని అంటుంది సుగుణ. వైజయంతి వీడెంత నీచుడో చెప్పాను కదా అయినా ఎందుకు తీసుకొచ్చావు అని అంటుంది సుగుణ. విశాల్, సుగుణ కాళ్లు పట్టుకొని అత్తయ్య నన్ను క్షమించండి నీ కూతురు ని చాలా బాగా చూసుకుంటాను అని అంటాడు. నా స్థానంలో ని కొడుకు ఉంటే ఇలాగే చేస్తావా అత్త అంటాడు విశాల్. నేనే చంపేస్తాను అని అంటుంది సుగుణ. నేను అసలే మంచోన్ని కాదు ఆధారాలు ఎక్కడున్నాయి తెచ్చి ఇవ్వు అని అంటాడు విశాల్.

అసలు నిన్ను కాదు నిన్ను లోనికి రానిచ్చిన వైజయంతిని అనాలి అని అంటుంది సుగుణ. ఉండు ఇప్పుడే ఫోన్ చేసి నా భర్త కి చెప్తాను అని అంటుంది సుగుణ. కోపంతో వైజయంతి తలని పట్టుకొని గోడకి కొడితే సుగుణ చనిపోతుంది. ఇంతలో నాయుడు వస్తాడు. వైజయంతి విశాల్ ను వెనక నుండి పారిపో నేను కూడా వెళ్ళిపోతాను అని చెప్తుంది. విశాల్ వెళ్ళిపోతాడు వైజయంతి కూడా వెళ్ళిపోతుంది నాయుడు ఇంట్లోకి వచ్చి వైజయంతిని సుగుణ అని పిలుస్తాడు కానీ ఎవరు రారు. ఇల్లంతా వెతికి కిందికి వస్తే సుగుణ కింద పడిపోయి ఉండడం చూస్తాడు. సుగుణ సుగుణ అని ఏడుస్తాడు.