Madhuranagarilo Episode 190: రాధా శ్యామ్ రిసార్ట్ కి వెళ్తారు అక్కడ అందరూ చలి మంటలు కాగుతూ ఉంటారు ఏవండీ చలి పెడుతుంది ఏదైనా బెడ్ షీట్ ఇవ్వండి అని శ్యామ్ అంటాడు.వాళ్ల ఇద్దరికీ కలిసి ఒకటే బెడ్ షీట్ ఇస్తారు.మాకు రెండు బెడ్ షీట్లు కావాలండి అని శ్యామ్ అడుగుతాడు.భార్యాభర్తల కి ఒక బెడ్ షీట్ కప్పుకుంటే ఆ థ్రిల్లింగ్ వేరేనoడి అని అక్కడ ఉన్న వాళ్ళలో ఒక అతను అంటాడు. సార్ మాకు అలాంటివి నచ్చవు మాకు వేర్వేరుగా ఇవ్వండి అని మళ్లీ శ్యామ్ అంటాడు. సార్ చూడండి ఇక్కడున్న వాళ్ళలో వేర్వేరుగా ఎవరైనా కప్పుకున్నారా మీకు మాత్రం రెండు ఎందుకు ఇస్తామండి అందరికీ ఒకటి ఈచము ఇదే కప్పుకోండి అని వాళ్ళు అంటారు.

రాధా వాళ్లు ఒక బెడ్ షీట్ ఇచ్చారు ఇది నువ్వే కప్పుకో అని శ్యామ్ రాధకి ఇచ్చేస్తాడు. రాధా ఒక్కతే బెడ్ షీట్ కప్పుకొని చలిమంట దగ్గర కూర్చుంటుంది. రిసార్ట్ వాళ్లు ఇప్పుడు డాన్స్ ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది ఎవరైనా ఒక కొత్తజంట డాన్స్ వేయండి అని అంటారు. వాళ్లలో ఒక నలుగురు వచ్చి డాన్స్ వేస్తూ ఉంటారు.అక్కడ కూర్చున్న శ్యామ్ రాధా వాళ్ళు ఎంత చక్కగా డాన్స్ చేస్తున్నారు రాదా మనం కూడా చేద్దామా అని శ్యామ్ అంటాడు. అంతగా కావాలంటే మీరు వెళ్లి వేయండి సార్ నాకు డాన్స్ రాదు అని రాదా అంటుంది. నేనొక్కడినే వెస్తే ఏం బాగుంటుందిలే రాదా అని శ్యామ్ నవ్వుతూ అంటాడు.పక్కనే ఉన్న జిలేబి జిలేబి వాళ్ళ భార్య ఏవండీ మనం కూడా వేద్దామా అని వాళ్ళ భార్య అంటుంది.

మనమేస్తే ఏం బాగుంటుంది చూడడానికి వీళ్లిద్దరేస్తే బాగుంటుంది అని జిలేబి అంటాడు. బెడ్ షీట్ లేనందు వల్ల శ్యామ్ చలికి వణుకుతూ ఉంటాడు. శ్యాము వణుకుతున్నాడని గమనించినా రాదా ఏవండీ ఈ బెడ్ షిట్ కప్పుకోండి అని అంటుంది. పర్వాలేదులే రాదా నువ్వు ఇబ్బంది పడతావు అని శ్యామ్ అంటాడు.ఏమి ఇబ్బంది పడను కప్పుకోండి సార్ మీరు చలికి వణికిపోతున్నారు అని రాదా అంటుంది. చలికి తట్టుకోలేని శ్యాము బెడ్ షీట్ ని కప్పుకుంటాడు. అక్కడ అందరూ డాన్స్ లు చేస్తారు పాటలు పాడుతారు అందరూ కలిసి ఎంజాయ్ చేసి ఎవరి రూముల్లోకి వాళ్ళు వెళ్ళిపోయి పడుకుంటారు. శ్యామ్ వాళ్ళ రూంలో అప్పటికే సంయుక్త వచ్చి పాయిజన్ స్ప్రే చేసి వెళ్తుంది.
అది తెలియని రాదా వచ్చి బెడ్లో పడుకోగానే ఆ స్మెల్ కి రాధకి ఊపిరాడక కళ్ళు తిరుగుతూ శ్యామ్ ని ఎంత పిలిచినా లేవక పోయేసరికి కింద పడిపోతుంది రాదా. శ్యామ్ పొద్దుటి నుంచి తిరిగి తిరిగి అలసిపోయి ఉంటాడు కాబట్టి రాధ ఎంత పిలిచినా లేవలేదు.కట్ చేస్తేశ్యామ్ వాళ్ళ అమ్మకి ఏదో జరిగిపోయినట్టు కల వస్తుంది. ఏవండీ రాధకి ఏదో అవుతుంది నాకు కలొచ్చిందండి ఒకసారి రాధకి ఫోన్ చెయ్ ఎలా ఉందో తెలుసుకుందాం అని మధురం అంటుంది. మధుర ఈ టైంలో వాళ్లకి ఫోన్ చేస్తే బాగోదు రాధకి ఏమీ కాదులే నువ్వేం కంగారు పడకు పొద్దున్నే లేవగానే చేద్దాం అని ధనoజయ్ ఎంత చెప్పినా వినదు మధుర. లేదండి నాకు కంగారుగా ఉంది మీరు చేస్తారా లేదా అని మధుర పట్టుబడుతుంది. తన బాధ చూడలేని ధనంజయ్ రాధ కి ఫోన్ చేస్తాడు రాధా ఎంతసేపటికి ఫోన్ ఎత్తకపోయేసరికి శ్యామ్ కి ఫోన్ చేస్తారు. శ్యామ్ ఫోన్ ఎత్తి హలో నాన్న ఏంటి ఈ టైంలో ఫోన్ చేశారు అని అంటాడు.

ఏమీ లేదు నాన్న మీ అమ్మ రాధ తో మాట్లాడతాను అంటుంది రాధకు ఒకసారి ఫోన్ ఇవ్వు తన ఫోన్ కి ఎంత చేసిన ఎత్తట్లేదు అని ధనంజయ్ అంటాడు. అప్పుడు శ్యామ్ చూసేసరికి రాదా బెడ్డు మీద లేదు అయ్యో నాన్న రాదా కనిపించట్లేదు అని కంగారుగా శ్యామ్ రూమంతా వెతుకుతాడు అలా వెతుకుతున్నప్పుడు రాదా కింద పడిపోయి కనపడుతుంది రాధా నీకేమైంది లే రాదా అని శ్యామ్ అంటాడు. రే శ్యామ్ రాధకి ఏమైంది రా అని మధుర అంటుంది.ఏమీ లేదమ్మా రాధా చాలా అలసిపోయి బాగా నిద్రలో ఉంది తనకేం కాలేదు బాగానే ఉంది అని అంటాడు శ్యామ్. హమ్మయ్య నాకు ఇప్పుడు కాస్తంత మనసు కుదుటపడిందండి రాధకి ఏమైపోయిందో అని కంగారు పడ్డాను అని మధుర అంటుంది. శ్యామ్ రిసెప్షన్ వాళ్ళకి ఫోన్ చేసి రాదా స్పృహ లేకుండా పడిపోయింది మీరు వెంటనే డాక్టర్ కి ఫోన్ చేసి రప్పించండి అని అంటాడు. వెంటనే డాక్టర్ గారు వచ్చి రాదని చూసి తనకి ఏమీ కాలేదండి బాగానే ఉంది ఇక్కడ ఉండే వాతావరణం కొంతమందికి పడదు అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది మీరేమీ కంగారు పడవలసిన పని లేదు ఈ ఇండిక్షన్ వేస్తున్నాను తనకి రేపు పొద్దుటికల్లా స్పృహ వస్తుంది అంతవరకు తనను డిస్టర్బ్ చేయకండి రాత్రి జ్వరం వస్తే ఈ టాబ్లెట్ వేయండి అప్పుడప్పుడు తలకు నీళ్లలో తడిపి తుడుస్తూ తడి బట్ట వేయండి అని డాక్టర్ వెళ్ళిపోతుంది. ఏంటి అమ్మ చెప్పినట్టు రాధకి పొద్దటి నుంచి ఏవేవో జరుగుతున్నాయి ఏమై ఉంటుంది నిజంగానే వాతావరణం పడట్లేదా అని శ్యామ్ ఆలోచిస్తూ ఉంటాడు. కట్ చేస్తే ముఖానికి ముసుగు వేసుకొని సంయుక్తరూమ్ లోకి వస్తుంది.

తను రాగానే వాళ్ళ అమ్మ ఫోన్ చేసి సంయుక్త నువ్వు వెళ్లిన పని జరిగిందా అని అంటుంది. ఏమీ జరగలేదమ్మాఎన్ని ప్లాన్లు వేసినా శ్యామ్ రాదని కాపాడుకుంటూనే ఉన్నాడు పొద్దున బ్రిడ్జి మించి తోసేసి రాదని చంపేద్దామనుకుంటే అక్కడ రాధను కాపాడాడు బోటు తోలే వ్యక్తితో మాట్లాడి సుడిగుండాలవైపు తీసుకువెళ్లి అందులో రాదను చంపేద్దామని ప్లాన్ చేస్తే అది ఫెయిల్ అయింది నైట్ తను పండుకునే వైపు పాయిజన్ స్ప్రే చేసి వచ్చాను అది కూడా ఫెయిల్ పోయి శ్యామ్ రాదని కాపాడుకున్నాడు ఏం చేసినా ప్లాన్ రివర్స్ అవుతుంది అని వాళ్ళ అమ్మతో అంటుంది సంయుక్త..దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది