NewsOrbit
Entertainment News Telugu TV Serials

Prema Entha Madhuram: స్టైలిష్ ట్రెండ్స్ మరియు సంప్రదాయ సమ్మేళనం…అదరహో అనిపించే ‘ప్రేమ ఎంత మధురం’ అందం అను ‘వర్ష’ గురించి తెలియని వివరాలు!

Prema Entha Madhuram Today 20 September 2023 Special Story on Anu Varsha Latest Update

Prema Entha Madhuram September 20th: తెలుగు బుల్లితెరలో చాలా మంది నటీమణులు హీరోయిన్లకు పోటీగా నటిస్తున్నారు. ఇందులో కొందరు మన తెలుగు వాళ్లు ఉండగా.. ఇంకొందరు కన్నడ, తమిళ ఇండస్ట్రీ నుంచి ఇక్కడికి వచ్చి నటిగా మంచి గుర్తింపు పొందెందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. బుల్లితెర హీరోయిన్లుగా చెలామణి అవుతూ.. ప్రత్యేక గుర్తింపు, ఆదరణను పొందుతున్నారు. అయితే చాలా మంది నటీమణులు సీరియళ్ల ద్వారానే గుర్తింపు పొందిన వారు ఉన్నారు. అలాంటి వారిలో ప్రముఖ సీరియల్ ‘కార్తీక దీపం’ హీరోయిన్ వంటలక్క పాత్రలో నటించిన ప్రేమి విశ్వనాథన్ ఒకరు.

Prema Entha Madhuram Today September 20 2023 Anu Varsha Latest Update
Prema Entha Madhuram Today September 20 2023 Anu Varsha Latest Update

ఆమెకు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక అభిమాన సంఘాలు ఉన్నాయి. ఈ సీరియల్ ముగిసే నాటికి చాలా మంది వంటలక్కకు దూరమవుతామని కన్నీరు కార్చిన వాళ్లూ ఉన్నారు. అంతే స్థాయిలో మరో బుల్లితెర నటి ఫేమస్ అయింది. ఆమె నటనతో తెలుగు ప్రేక్షకుల నుంచి అంతే ఆదరణ పొందుతోంది. ఆమె ఎవరో కాదు.. ప్రముఖ టీవీ ఛానెల్ జీ తెలుగులో ప్రసారం అవుతున్న ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్ హీరోయిన్ అను. అను ఒరిజినల్ పేరు వర్ష హెచ్‌కే. ఇంతకీ వర్ష ఎవరు? ఆమె వ్యక్తిగత విషయాలు, ఆమె నటించిన సీరియళ్లు, వర్ష కెరీర్ ప్రారంభం, తదితర విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Prema Entha Madhuram Serial Today September 20 2023 Anu Varsha Latest Update
Prema Entha Madhuram Serial Today September 20 2023 Anu Varsha Latest Update

వర్ష హెచ్‌కే వ్యక్తిగతం..
1996లో బెంగళూరులోకి కర్ణాటకలో వర్ష జన్మించారు. ప్రస్తుతం ఆమె వయసు 27 ఏళ్లు. స్థానిక ఉమెన్స్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచి మోడలింగ్, యాక్టింగ్‌పై ఇంట్రెస్ట్ ఎక్కువ. అందుకే మొదటగా మోడలింగ్‌లో రాణించింది. మోడల్‌గా కెరీర్ స్టార్ చేస్తూనే సీరియళ్లలో ఛాన్స్ కోసం ప్రయత్నించింది. ఇండస్ట్రీలో అడుగు పెట్టకన్న ముందు ‘బీ పాజిటివ్’ అనే షార్ట్ ఫిల్మ్‌లో వర్ష నటించారు. ఈ షార్ట్ ఫిల్మ్ నుంచి వర్షకు మంచి గుర్తింపు వచ్చింది. దాంతో ఆమెకు కన్నడలోనే ‘నాగ మండలం’ సీరియల్‌తో ఆరంగేట్రం చేసింది. ఈ సీరియల్‌తో కన్నడ ప్రేక్షకులకు వర్ష మరింత దగ్గరైంది. ఆ తర్వాత వర్షకు వరుస అవకాశాలు రావడం మొదలయ్యాయి. కన్నడలోనే ‘రాజా రాణి, కస్తూరి నివాస’ సీరియళ్లలో నటించారు.

Prema Entha Madhuram Today September 20 2023 Special Story on Anu Varsha
Prema Entha Madhuram Today September 20 2023 Special Story on Anu Varsha

తెలుగులో ఛాన్స్..
కస్తూరి నివాస సీరియల్ చేస్తున్నప్పుడే వర్షకు ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్ నుంచి ఆఫర్ వచ్చింది. దానికి ఓకే చెప్పిన వర్ష కన్నడ నుంచి హైదరాబాద్‌కు తన మకాం మార్చింది. ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌తోనే ఆమె మొదటగా తెలుగులో ఆరంగేట్రం చేసింది. అయితే కన్నడ నటి అయినప్పటికీ తెలుగును స్పష్టంగా మాట్లాడేలా, అచ్చం తెలుగు అమ్మాయి అనేంతలా మారిపోయింది. చాలా మంది వర్షను చూసి తెలుగమ్మాయి అని భ్రమ పడిపోతారు. కానీ వర్ష 9 భాషల్లో అనర్గలంగా మాట్లాడగలదు. అయితే వర్షకు ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్ అప్పుడే కన్నడ, తమిళ భాషల్లో నటించేందుకు ఆఫర్స్ వచ్చాయి. ట్రావెల్ కష్టంగా ఉండటం వల్ల ఆమె కేవలం ఒకే సీరియల్ చేస్తున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. కాగా, 2020లో వర్షకు ‘జీ కుటుంబం అవార్డ్’ వచ్చింది. 2023 నాటికి ఆమె నికర ఆదాయం రూ.5 లక్షలు సంపాదిస్తోంది.

Prema Entha Madhuram Today September 20 2023 Anu Varsha HK Latest Update
Prema Entha Madhuram Today September 20 2023 Anu Varsha HK Latest Update

ఫ్యాన్ ఫాలొయింగ్ ఎక్కువే..
‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్ ద్వారా వర్షకు భారీ గుర్తింపే వచ్చింది. తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పొందారు. ప్రత్యేకమైన ఫ్యాన్ బెస్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఒక వైపు సీరియల్‌లో నటిస్తూ బిజీగా ఉంటూనే.. సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు ఎప్పుడూ దగ్గరగా ఉంటారు.

Prema Entha Madhuram Today September 20 2023 Anu Varsha HK Latest Update
Prema Entha Madhuram Today September 20 2023 Anu Varsha HK Latest Update

వర్షకు ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షల్లో ఫాలొవర్స్ ఉన్నారు. ఇందులో ఆమె డైలీ యాక్టివిటీలు, ఫోటో షూట్స్, రీల్స్ షేర్స్ చేస్తుంటారు. ఇండస్ట్రీలో వర్షకు ఫేవరేట్ హీరో హీరోయిన్లు ఎవరని అడిగినప్పుడు.. పునీత్ రాజ్ కుమార్, సౌందర్య అని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. అలాగే టాలీవుడ్‌లో ఆమె ప్రభాస్ అంటే ఇష్టమని ఇంటర్వ్యూల్లో చెప్పింది. తెలుగు ప్రజలు ఇంతలా ఆదరిస్తారని ఎప్పుడూ ఊహించలేదని ఆమె పేర్కొన్నారు.

 

Related posts

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

kavya N

Karthika Deepam 2 May 18th 2024 Episode: సౌర్యని స్కూల్లో చేర్పిస్తూ ఫాదర్గా సంతకం పెట్టిన కార్తీక్.. పారుపై సీరియస్ అయినా దీప..!

Saranya Koduri

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

Prasanna Vadanam: ఆహాలో అల‌రించ‌బోతున్న సుహాస్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ప్ర‌స‌న్న‌వ‌ద‌నం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

kavya N

Brahmamudi May 18 Episode  413: కిడ్నాపర్స్ చెర నుండి బయటపడ్డ కావ్య.. కిడ్నాపర్స్ ని పోలీసుకి పట్టించిన రాజ్.. కావ్య అనుమానం..

bharani jella

Nuvvu Nenu Prema May 18 Episode 627:క్యాబ్ డ్రైవర్ గా మారిన విక్కీ.. అరవింద కోసం విక్కీ బాధను పోగొట్టడానికి పద్మావతి ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 18 Episode 473:ముకుంద కోసం ఆదర్శ కంగారు.. ముకుంద కి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడానికి ఒప్పుకున్న కృష్ణ.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

sekhar

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu