NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Sonia Gandhi: మహిళా బిల్లుపై లోక్ సభలో వాడీవేడి చర్చ .. సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు

Sonia Gandhi: నూతన పార్లమెంట్ భవన్ లో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై వాడీవేడి చర్చ జరుగుతోంది. బిల్లుపై చర్చలో భాగంగా కాంగ్రెస్ తరపున సోనియా గాంధీ చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. ఇది నా జీవితంలో కూడా ఎమోషనల్ మూమెంట్. వంటింటి నుండి ప్రపంచ వేదికల వరకూ భారత మహిళల పాత్ర ఎంతో ఉందన్నారు.

మహిళలు వారి స్వార్ధం గురించి ఏనాడు ఆలోచించరు అని అన్నారు సోనియా గాంధీ. స్త్రీల త్యాగాలు ఎనలేనివి అని కొనియాడారు. ఆధునిక భారత నిర్మాణంలో పురుషులతో కలిసి స్త్రీలు పోరాడారన్నారు. సరోజినీ నాయుడు, సుచేత కృపాలనీ, ఆరుణాసఫ్ ఆలీ, విజయలక్ష్మీ పండిట్ వంటి వారెందరో దేశం కోసం పోరాడారని గుర్తు చేశారు. ఈ బిల్లు కోసం దశాబ్దాలుగా పోరాడుతున్నామన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు రాజీవ్ గాంధీ కల అని, స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళా ప్రాతినిధ్యాన్ని నిర్ణయించేందుకు తొలి సారిగా రాజ్యాంగ సవరణ చేస్తూ రాజీవ్ గాంధీ బిల్లును తీసుకొచ్చారని చెప్పారు. రాజ్యసభలో ఏడు ఓట్ల తేడాతో ఓడిపోయిందని గుర్తు చేశారు సోనియా గాంధీ.

ఆ తర్వాత పీఎం పీవీ నర్శింహరావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యసభలో ఆమోదించిందన్నారు. ఫలితంగా స్థానిక సంస్థల ద్వారా దేశ వ్యాప్తంగా 15 లక్షల మంది మహిళా నేతలు ఎన్నికయ్యారన్నారు.  దీంతో, రాజీవ్ గాంధీ కల పాక్షికంగా మాత్రమే పూర్తయిందన్నారు. ఈ బిల్లు ఆమోదంతో అది పూర్తి అవుతుందని చెప్పారు. గతంలో బీజేపీ సభ్యులు మహిళా బిల్లును అడ్డుకున్నయనీ, కానీ ఇప్పుడు ఈ బిల్లును కాంగ్రెస్ పార్టీ సమర్ధిస్తుందని ప్రకటించారు సోనియా గాంధీ. కానీ బీజేపీ తెస్తున్న బిల్లులో కొన్ని భయాలు ఉన్నాయన్నారు. ఇప్పటి వరకూ 13 ఏళ్లుగా మహిళలు బిల్లు అమలు కసం వేచి చూస్తున్నారన్నారు. ఇంకా ఎన్నాళ్లు మహిళలు వేచి చూడాలన్నారు. వెంటనే కుల గణన చేసి మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేష్ల పై కూడా నిర్ణయం తీసుకోవాలని సోనియా గాంధీ డిమాండ్ చేశారు.

కాగా సోనియా గాంధీ వ్యాఖ్యలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఖండించారు. కాంగ్రెస్ నిర్ణయాలను తప్పుబడుతూ బీజేపీ ఎంపీలు నినాదాలు చేశారు. డీఎంకే ఎంపీ కనిమొలి మాట్లాడుతూ .. మహిళా బిల్లును బీజేపీ రాజకీయంగా వాడుకుంటోందని అన్నారు. దేశంలోనే తొలి సారిగా 1921లో తమిళనాడు మహిళా ప్రజా ప్రతినిధిగా ఎన్నుకున్నామన్నారు. వందేళ్ల తర్వాత ఇప్పటికీ మహిళలకు రిజర్వేషన్లు అమలు కాలేదన్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో రాజ్యసభలో మహిళా బిల్లును ఆమోదించారని అన్నారు.

Tirumala: తిరుమల కాలిబాట మార్గంలో చిక్కిన మరో చిరుత.. టీటీడీ చైర్మన్ భూమన ఎమన్నారంటే..?

Related posts

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N