Samantha: సౌత్ స్టార్ హీరోయిన్లలో సమంత ఒకటి. హెల్త్ ఇష్యూస్ కారణంగా సినిమాల నుంచి స్మాల్ బ్రేక్ తీసుకున్నప్పటికీ.. సమంత క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. నిత్యం ఏదో ఒక రకంగా ఈ ముద్దుగుమ్మ వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది. తాజాగా ఖరీదైన బ్రాండెడ్ వాచ్ తో దర్శనమిచ్చి హెడ్ లైన్స్ లో నిలిచింది. గొప్ప నటిగానే తన ఫ్యాషన్ సెన్స్ తో ఎన్నోసార్లు ట్రెండ్ సెట్ చేసిన సమంత.. తాజాగా సోషల్ మీడియా ద్వారా కొన్ని స్టైలిష్ ఫోటోలను పంచుకుంది. ఈ పిక్స్ లో సమంత ప్రముఖ ఫ్యాషన్ హౌస్ గూచీకి చెందిన వైట్ లక్కర్ జాకెట్ తో పాటు మినీ స్కర్ట్ ధరించి కనిపించింది. అలాగే చెవులకు డైమండ్ హోప్ ఇయర్ రింగ్స్, చేతికి సర్పెంటి వాచ్ మరియు వేళ్లకు అద్భుతమైన డైమండ్ రింగ్లతో అలకరించుకుంది.
స్టన్నింగ్ అవుట్ ఫిట్లో సమంత లుక్స్ మిస్మరైజ్ చేస్తున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే అందరి చూపు సమంత చేతికి ఉన్న డైమండ్ వాచ్ పైనే పడింది. చాలా ఆకర్షణీయంగా కనిపించడంతో అభిమానులు మరియు నెటిజన్లు సమంత వాచ్ గురించి ఆరాలు తీయడం షారూ చేశాడు. ఈ క్రమంలోనే కొన్ని షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. బల్గారీ బ్రాండ్ యొక్క డైమండ్-స్టడెడ్ సర్పెంటి స్పిగా వాచ్ ను సమంత తన చేతికి పెట్టుకుంది.
పాము ఆకారంలో తయారు చేయబడిన ఈ సర్పెంటి వాచ్ డైమండ్స్ తో పొదగబడింది. ఇంతకీ ఈ బ్రాండెడ్ వాచ్ ధరెంతో తెలుసా.. అక్షరాల రూ. 70 లక్షలు. ఈ విషయం తెలిసి నెటిజన్లు కళ్లు తేలేస్తున్నారు. రూ. 70 లక్షలతో ఒక ఇంటినే కొనేయెచ్చంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే సమంత ఈ సర్పెంటి వాచ్ ను ధరించడం తొలిసారేమి కాదు. గతంలో మరో రెండు సందర్భాల్లో కూడా సమంత ఇదే వాచ్ ను స్టైల్ చేసింది.
కాగా, కెరీర్ విషయానికి వస్తే.. శాకుంతలం పరాజయం అనంతరం గత ఏడాది సమంత ఖుషి మూవీతో ప్రేక్షకులను పలకరించింది. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేరకొండ హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఖుషి యావరేజ్ గా ఆడింది. ఖుషి తర్వాత సమంత నుంచి మరో సినిమా రాలేదు. కొత్త ప్రాజెక్ట్ లను కూడా ప్రకటించలేదు. అనారోగ్య సమస్యల కారణంగా సమంత షూటింగ్స్ నుంచి కొంత విరామం తీసుకుంది. మళ్లీ ఇప్పుడిప్పుడే సమంత కెరీర్ పై ఫోకస్ పెడుతోంది.
ప్రస్తుతం సమంత గతంలో నటించిన హనీ బన్నీ అనే ఓ బాలీవుడ్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు సిద్ధం అవుతోంది. ఇందులో వరుణ్ ధావన్ కు జోడీగా సమంత యాక్ట్ చేసింది. రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ త్వరలోనే అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతోంది. ఇకపోతే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు జోడీగా అట్లీ దర్శకత్వంలో ఓ సినిమాకు సమంత కమిట్ అయినట్లు గత కొద్ది రోజుల నుంచి జోరుగా ప్రచారం జరుగుతోంది. కానీ ఇంతవరకు ఈ ప్రచారంపై ఎటువంటి క్లారిటీ రాలేదు.